Vinnapalu Vinavale -- Annamacharya Sankeerthanam
అన్నమాచార్య....శృంగార సంకీర్తన.!
(విన్నపాలు వినవలె వింత వింతలు.)
.
పల్లవి:
విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా
చరణములు:
తెల్లవాఱె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదివో వారె
చల్లని తమ్మి రేకుల సారస్యపుఁ గన్నులు
మెల్లమెల్లన విచ్చి మేలుకొనవేలయ్యా
గరుడ కిన్నర యక్ష కామినులు గములై
విరహపు గీతముల వింత తాళాల
పరిపరి విధములఁ బాడేరు రాగాల నిన్నదివో
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా
పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
పంకజ భవాదులు నీ పాదాలు చేరి
అంకెల నున్నారు లేచి అలమేలుమంగను
వెంకటేశుఁడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా
.
Comments
Post a Comment