Skip to main content
ఎవరి కన్న ఎవరు గొప్ప!
ఎవరి కన్న ఎవరు గొప్ప!
.
పద్యానవనం జగతి పుట్టించెడి వాడతడంటినా బ్రహ్మ తామరపువ్వు తనయుడాయె
.
తామర ఘనమని తర్కించి చూచిన
.
నలినాక్షి విష్ణు తా నాభినుండె విష్ణువు ఘనమని వివరించ చూచిన
.
జలరాశి కొకతెప్ప చందమాయె జలరాశి ఘనమని తర్కించి చూచిన
.
కుంభసంభవుచేత గ్రోలబడియె కుంభసంభవుండు ఘనమని చూచిన
.
భూమిలోపలను పొత్తుబడెను భూమియె ఘనమని తర్కించి చూచిన
.
శేషుండు మోసెనని చెప్పగలిగె శేషుండు ఘనమని తర్కించి చూచితె
.
ఉమకన్నె కొకవేలి ఉంగరంబు ఉమకన్నె ఘనమని వూహించి చూచిన
.
శివుని అర్థాంగమున చిక్కుబడెను శివుడె ఘనమని తర్కించి చూచిన... .
జగతిని పుట్టించిన వాడు కదా బ్రహ్మ గొప్పవాడనుకుందామంటే,
ఆయనేమో తామర పువ్వులో పుట్టాడు!
పోనీ, తామర పువ్వే గొప్పదనుకుందామన్నా, అదేమో విష్ణు నాభిలోంచి వచ్చిందాయె!
సరే, విష్ణే గొప్పోడనుకుందామా అంటే, శేషశయ్యమీద పవళించిన ఆయన సముద్రంలో ఓ చిన్న తెప్ప మాదిరి. అయ్యో! అలాగని సముద్రుడు ఘనుడనుకుందామా, అగస్త్యుడు సాంతం తాగేశాడాయె! పోనీ, కుంభసంభవుడైన ఆ అగస్త్యుడే ఘనమనుకుందామా, అతడు భూమిలో ఓ భాగమే అయ్యాడు!
అందుకని, భూమే గొప్పదనుకుందామా అంటే, ఆదిశేషుడు భూమిని అలవోకగా మోసాడంటారు!
అద్సరే, ఆ శేషుడే ఘనుడని వాదిద్దామంటే, ఆయన ఉమాదేవి చేతి వేలికి ఉంగరమంత!
సరే, ఆ ఉమనే గొప్ప అనుకుందామా అన్నా, ఆమె శివునిలో అర్ధభాగమైంది... ఇలా ఎందాక?
.
ఇంతకు ఎవరు గొప్ప?
Comments
Post a Comment