Skip to main content
రామశబ్దం.!
రామశబ్దం.!
.
ఒక చమత్కారం "రామ" అనే శబ్దాని తెలిసి పలికినా తెలియక పలికినా
ఎటువంటి పలుకుల్లో భాగంగా పలికినా అవి జీడిపప్పు పలుకులై
ముక్తి సుగంధాన్నిమనస్సుకి అందిస్తాయట.
ఒకానొక అరణ్యంలో వేటాడుతూ తిరుగుతున కిరాతుల్ని ఎవరు ప్రశ్నించినా
వారు వారి దినచర్యను ఈ విధంగా వివరిస్తునారట.
.
"వనే చరామః వసుచాహరామః
నదీ స్తరామః న భయం స్మరామః
ఇతీరయంతో విపినే కిరాతాః
ముక్తింగతా రామపదానుషంగాః"
.
మేం అడవుల్లో తిరుగుతూ ఉంటాఅ(చరామః)
జంతువుల్ని (ఆహరామః), నదీ నదాలు సులువుగా దాటేస్తూ ఉంటాం(తరామః). భయం మా మనస్సులోకే రాదు (న స్మరామః)," అంటూ ఉంటే
అనుకోకుండా ఆ మాటల్లో రామః రామః అని పలుమార్లు రావడం వల్ల
రామసంకీర్తన చేసిన ఫలం లభించి వారి మోక్షం పొందగలిగారట.
ఎంత చమత్కారం లీలా మానుష వేషధారియైన భగవంతుని దృష్టిలో
ఈ సృష్టియే ఒక పెద్ద చమత్కారం.
అంత శక్తి గల్గిన భగవన్నామ సంకీర్తనతో జీవుడు ఆనందలహరిగా మారి
ఆత్మానంద మహా సాగరంలో లీనం కావడమే జీవన పరమార్దం
Comments
Post a Comment