మా.. రోజులలో క్రికెట్ వీరులు ... 7... . విశ్వనాథ్!

మా.. రోజులలో క్రికెట్ వీరులు ... 7... . విశ్వనాథ్!

.















ఫోర్ట్ హై స్కూల్ బాయ్ ... క్రికెట్ తప్ప ఏమి తెలియదు .. 

కష్ట పది ఇంటర్ పాస్ ఎలాగో అయ్యేడు .. 

కాని క్రికెట్ లో sheet anchor అని మంజ్రేకర్ లా స్టార్ట్ చేసి అతన్ని మించి పోయ్యేడు . ఎప్పుడు captaincy కావాలి అని అడగ లెదు. 

అయన చాల పొట్టి ... అయన batting stance గూర్చి ఒక జోకు వుంది . 

He is standing before the wikkets as if Shitting ... మంచి డిఫెన్సు బాట్స మాన్ 

1949 జనవరి 12 న జన్మించిన గండప్ప రంగన్న విశ్వనాథ్ (Gundappa Rangnath Viswanath) (Kannada:ಗುಂಡಪ್ಪ ರಂಗನಾಥ್‌ ವಿಶ್ವನಾಥ್‌) భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. 1970 దశాబ్దపు భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. 1969 నుంచి 1983 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 91 టెస్టులు ఆడి 6080 పరుగులు సాధించాడు. 1974 మరియు 1982 మధ్యలో వన్డే పోటీలను కూడా ఆడినాడు. 1975, 1979 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత్ రతఫున పాల్గొన్నాడు. దేశవాళి క్రికెట్ లో అతను కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇతను సునీల్ గవాస్కర్ సోదరిని వివాహం చేసుకున్నాడు.

1969 లో కాన్పూర్ లో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. అదే మ్యాచ్ లో సున్నాకే అవుటై, ఈ విధంగా ఒకే మ్యాచ్‌లో సెంచరీ, డకౌట్ రికార్డు చేసిన బ్యాట్స్‌మెన్లలో ఇతను మూడోవాడు మాత్రమే. అతను టెస్ట్ క్రికెట్ లో మొత్తం 14 సెంచరీలు సాధించగా వాటిలో భారత్ ఒక్కటి కూడా ఓటమి చెందకపోవడం గమనార్హం. ఆ కాలంలో బ్యాట్స్‌మెన్లపై విరుచుకుపడే ఆస్ట్రేలియా, వెస్ట్‌ఇండీస్ బౌలర్లను ఎదుర్కొని ఆ దేశాలపై 50 కి పైగా సగటు సాధించడం సామాన్యం కాదు[1]. అతని అత్యున్నత ఇన్నింగ్సులలో ఒకటైన మద్రాసు టెస్ట్ లో వెస్ట్‌ఇండీస్ పై ఆండీ రాబర్ట్స్ బౌలింగ్‌ను ఎదుర్కొని 97 పరుగులతో నాటౌట్ గా నిల్చినాడు. ఆ ఇన్నింగ్సులో జట్టు స్కోరు 190 మాత్రమే. సెంచరీ సాధించకుననూ భారతీయుడు సాధించిన అత్యుత్తమ ఇన్నింగ్సు లలో ఇది ఒకటి [2] భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయం కూడా సాధించింది. 2001 లో వెజ్డెన్ ప్రకటించిన 100 అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ఇన్నింగ్సులలో ఇది 38 వ స్థానం ఆక్రమించింది, కాగా సెంచరీ లేని ఇన్నింగ్సులలో ఇది రెండో స్థానంలో ఉంది.[3]. 1975-76 లో గుండప్ప విశ్వనాథ్ వెస్ట్‌ఇండీస్ పై 112 పరుగులు చేసి తన మరో ప్రతిభను నిరూపించాడు. దానితో ఆ టెస్ట్ మ్యాచ్ లో భారత్ 403 పరుగులు చేసి గెల్వడమే కాకుండా అప్పటి వరకు ఛేజింగ్ రికార్డును అధికమించింది [4]. 1978-79 లో మరో పర్యాయం మద్రాసు టెస్టులో విస్వనాథ్ 124 పరుగులతో నాటౌట్ గా నిల్చినాడు. ఆ ఇన్నింగ్సులో టీం స్కోర్ కేవలం 255 మాత్రమే. అతని ప్రతిభతో ఆ టెస్ట్ కూడా భారత్ గెల్చి 6 టెస్టుల సీరీస్ లో 1-0 తో ముందంజవేసింది. 1979-80 లలో కొద్దికాలం గుండప్ప విశ్వనాథ్ భారత కెప్టెన్ గా వ్యవహరించాడు. అతను నేతృత్వం వహించిన రెండూ టెస్టులలో ఒకటి డ్రా కాగా, మరికటి ఓడిపోయింది. ఆ టెస్టులో భారత్ ఓడిననూ విశ్వనాథ్ మంచితనం మాత్రం చెప్పుకోవాల్సిందే. బాబ్ టేలర్ ను అంపైర్ ఔట్ ఇచ్చిననూ విశ్వనాథ్ జోక్యం చేసుకొని అతనిని మళ్ళీ క్రీజుకు పిల్వడం అతను ధాటిగా ఆడి మంచి పరుగులు చేయడం భారత్ ఆ టెస్ట్ కోల్పోవడం జర్గాయి.

విశ్వనాధ్ కెప్టెన్గా వ్యవహరించిన భారత్ ఇంగ్లండ్ గోల్డెన్ జూబ్లీ టెస్ట్ వాంఖాడే స్టేడియం లో ప్రత్యక్షంగా చూసాను. టైలర్ని వెనక్కు పిలవడం సెంచెరీ వీరుడు ఇయాన్ బోథమ్ తో సెంచెరీ ష్టాండ్ మ్యాచ్ని తిప్పేసాయు. క్రికెట్ అప్పటికి జెంటిల్ మెన్స్ గేమే ఐనా మరీ అంత జెంటిల్మెన్ షిప్ పనికిరాదను కొన్నారు అంతా.గుండప్ప విశ్వనాథ్ 1983 లో రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మ్యాచ్ రిఫరీ గా పనిచేశాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!