గారెలు లేని విందు !

పెమ్మయ సింగధీమణీ!

పెమ్మయ సింగయ గారు లోకజ్ఙులు.వారి లౌకిక మైన జ్ఙానాన్ని రంగరించి

"పెమ్మయ సింగధీమణీ! యేమకుటంతో ఒక శతకంవ్రాశారు. 

అందులో ఒకపద్యం మీకోసం!


ఉ:

"గారెలు లేని విందు , సహకారము లేని వనంబు , లొల్త నోం

కారము లేని మంత్రమ ,ధికారము లేని ప్రతిజ్ఙ , వాక్చమ

త్కారము లేని తెల్వి , గుణకారములేనటువంటి లెక్క , సా

కారము లేని పూజ ,కొఱఁగానివి పెమ్మయ సింగధీమణీ !"

.

,విందు భోజనంలో గారెలు లేకపోతే అది అతిథుల మన్ననకు నోచదు.

సహకారం అంటే మామిడి చెట్టు. అదిలేకపోతే తోటకు అందం రాదు. 

ఓం కారము అన్నిమంత్రాలకూ శక్తినొసగే వేదమూలమైన బీజాక్షరం. 

అదిముందు లేకపోతే యేమంత్రమూ ఫలవంతం కాదు. 

అధికారం లేనివాడు యేమాటన్నా చెల్లదు. వాడిమాటలు వెఱ్ఱివాని ప్రేలాపనమే ,! మాట చమత్కార రంజితంగా ఉండాలట.చొల్లువాగుడు వాగితే విసుగొస్తుంది.

లెక్కలో గుణకారం ఉండాలట అంటే లెక్కల మౌలికమైన సూత్రాలప్రకారం ఉండాలట. భక్తి లేకుండా ఫలించని వ్యర్ధమైన పూజలెన్నిచేసినా వ్యర్ధమే నంటాడు.

మానవ జీవన విధానంలో పై జెప్పిన యంశాలను పాటిస్తే మంచిది!

.

అందుకే పండగకిగారెలు ఎలా చెయ్యాలో చెబుతున్నాను... ఇకమీఇష్టం.

పెసర గారెలు


పచ్చి పెసలు - 1 కిలో

ఛాయ మినపప్పు - కప్పు

నూనె - తగినంత

పచ్చిమిర్చి - 50 గ్రా

అల్లం - అంగుళం ముక్క

జీలకర్ర - టీ స్పూన్‌

ఉప్పు - సరిపడినంత


తయారు చేసే విధానం...

పెసలు, మినపప్పు కడిగి ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచాలి. ఉద యాన్నే నీళ్ళు వంపేసి అల్లం, పచ్చి మిర్చి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి. తగినంత ఉప్పు కూడా కలపాలి. తడి బట్ట మీద గానీ లేదా పాలకవర్ల మీద గానీ మనకు కావలసిన సైజులో గారెలు వత్తి నూనెలో దోరగా వేయించి తీయా లి. 3 రోజుల వరకూ నిల్వ ఉంటా యి. అల్లం, వేరుశనగ, ఏ పచ్చ డితో తిన్నా ఇవి రుచిగా ఉంటాయి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!