రాధనురా నీ రాధనురా!

రాధనురా నీ రాధనురా!

రాసలీలలా ఊసే తెలియని కసుగాయలకారాధనురా!

వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా!

రాధనురా నీ రాధనురా!

ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధనురా!

మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకె సుబోధనురా!

.

(శ్రీ పింగళి నాగేంద్రరావు. గారు.)

Comments