నంద, యశోదల పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి?

నంద, యశోదల పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? 

యశోదా నందులు పూర్వజన్మలో ధరా ద్రోణులనే పుణ్యదంపతులు. భర్త శాస్త్ర పారంగతుడు. బ్రాహ్మీ ముహూర్తమున నిద్రనుండి లేచి తన నిత్యానుష్ఠానములను పూర్తిచేసుకొని సమీపములోని పట్టణమునకు వెళ్లి, భిక్షాటన చేసి, ఆవచ్సిన దానిని అతిథి అభ్యాగతులకు నివేదించిన పిమ్మట మిగిలిన దానిని మాత్రమే ఆదంపతులు ప్రసాదముగా స్వీకరించువారు. మిగులనినాడు కేవలం జలముతో బ్రతికేవారు. ఒకనాడు వారి ఆశ్రమమునకు వారిని పరీక్షించుటకు, పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతులవలె, శ్రీహరి వారి పుత్రునివలే రూపములు ధరించి వచ్చారు. తల్లిదండ్రులకు ఆకలితో శోష వస్తున్నదని చెప్పి ఆయువకుడు కూడా మూర్చతో పడిపోయాడు. అప్పటికి భర్త తిరిగిరాలేదు. వారికి ఇచ్చుటకు తమ వద్ద ఏమీలేదు. ఎప్పుడూ బయటకు వెళ్ళని ధరాదేవి పట్టణములోని అంగటికి సరకులు తెచ్చుటకు వెళ్తుంది. తన వద్ద మాంగల్యము తప్ప ధనమువేరేలేదనీ, ముగ్గురు అతిథులకు సరిపడ దినుసులు ఇమ్మని దుకాణదారుని అడుగుతుంది. అతడు వారుచేసేది వ్యాపారమని, సరుకులకు బదులుగా ధనమునికాని, లేకున్న ఆమె అందమునుగాని ఈయవలెనని అడుగుతూ, ఆమె వక్షస్థలమువైపు ఆశగా చూస్తాడు. అప్పుడామె అక్కడ ఉన్న ఒక కత్తిని తీసుకొని తన ఒక స్తనమును కోసి వానివైపు పడవేసి రక్త ధారలతో ఇంటికిచేరి అతిథుల పాదాలపై పడి ప్రాణావశిష్ట స్థితి లో ఉంటుంది. వచ్చిన వారు తమనిజ స్వరూపాలతో ఆమెకు ప్రత్యక్షమై ఆమెను పూర్వస్థితికి తీసుకు వస్తారు. శ్రీహరి ఆమె రక్తదారకు బదులుగా అపారమైనక్షీరధారను ఇస్తానని తానే శిశువుగా అదిస్వీకరిస్తాననీ చెబుతాడు. ఆ దంపతులే నంద యశోదలుగా ద్వాపరంలో జన్మిస్తారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!