నాలోన శివుడు గలడూ"



అతని నక్షత్ర దర్శనం, పరికిణీ పక్కన పెడితే, తనికెళ్ళ భరణి తన్మయత్వంతో పలికిన శివ తత్త్వంలో నాకు చక్కని చిక్కని కవిత్వం కనిపిస్తుంది. "ఆటగదరా శివా" కన్నా కూడా "శబ్భాషురా! శంకరా!" నాకు బాగా నచ్చింది. ఆ యాసలో ఏదో మాధుర్యం ఉంది.
ధూర్జటి మళ్ళీ పుట్టి తెలంగాణా యాసలో మరో శతకం వ్రాసాడా అనిపిస్తుంది అది చదువుతూ (వింటూ) ఉంటే! ఈ ఆలోచనలో కొంత అతిశయోక్తి ఉన్నా, అనౌచిత్యం లేదు. ఈ పోలికకి కారణం ఇద్దరూ శివభక్తులవ్వడం, అతనిపై శతకం వ్రాయడం మాత్రమే కాదు. కాళహస్తీశ్వర శతకంలో ఉన్న భక్తి, ఆర్ద్రత, ఇందులోనూ ఉన్నాయి. కొంతలో కొంత ఆ పదునూ ఉంది. మరో విశేషం ఏంటంటే, వాటి ఛందస్సులు కూడా దగ్గర్గా ఉంటాయి! కాళహస్తీశ్వర శతకం మత్తేభ శార్దూల విక్రీడితాల్లో సాగుతుంది. "శబ్బాషురా! శంకరా!"ది కూడా అలాంటి నడకే. మకుటాల ఛందస్సయితే సరిగ్గా ఒకటే - "శ్రీకాళహస్తీశ్వరా", "శబ్బాషురా శంకరా". బహుశా కాళహస్తీశ్వర శతక పద్యాలు కంఠగతం, హృద్గతం అయిపోవడం వల్ల అనుకోకుండానే ఆ నడక వచ్చి ఉంటుంది.
భరరణిగారు "నాలోన శివుడు గలడు" అనే పాటల ఆల్బం కూడా తీసుకువచ్చారన్న సంగతి నాకు మొన్నీమధ్య దాకా తెలీదు. అందులో పాటలు కూడా నచ్చాయి. ముఖ్యంగా "నాలోన శివుడు గలడూ" అనే పాట మనసుకు బాగా పట్టేసింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!