కుమారా శతకం

మనకు కుమారీ శతకము గురించి తెలుసు..

.

స్త్రీలు .కన్యలు నడచుకోవలిసిన తీరు తెన్నులు ఇందులో ప్రవచించారు.. 

అయితే శ్రీమతి ఆత్మూరి అన్నపూర్ణమ్మగారు.. పిచ్చ్సుకపై బ్రహ్మాస్త్రమన్నట్లు,బొడ్డూడ కున్నను,పురుషులమను పేరిట పల్కుబడి చెలాయించుచు.స్త్రేలకు నీతులు గరపువారే కాని.యెంత దుష్టులైనను పురుషులకు నీతి గరపువారు లేరని యామె.కటకటపడి రాసిన ది కుమారా శతకం

.

తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు

అని వచించు సామెతను దలంచి,

నీదు దప్పు లెరిగి నేర్పున సవరించి,

సఖుల నీతి గరప జను కుమార!

నీ సతియు నీకు మిత్రము

నీ సతియే నీకు దోడు,నిజముగసుమ్మీ,

రోసమున సతిని దూరిన

మోసము నీ సౌఖ్యమునకు ముందు కుమారా!

రుస రుస లాడుచు,దిట్టుచు,

గసరుచు గోపింప సతులు గ్రక్కున వశులై,

మసలుదురని తలపోయుచు

రసురుల వలె దుష్ట పురుషులవని గుమారా!

ముదమున బతంగ నివహము

వదలక ఫలరసములకును బరుగిడు కరణిన్

మృదు హృదయుడ వై మెలగిన

సుదతి నినుo బొంద దలచు జూవె కుమారా!

.

సరసములగుభావముల కూర్పుతో ,సలలితమగు పదములతో .ఏర్చి. తీర్చిన ఈమె పద్యములు తిన్న గ పటితుల హృదయమును దూరి సన్నగా పనిచేయ గలవు.

చల్లనైన జీవముతో మెల్లగా నర్తించు నదీమ తల్లి యొడి లో ముక్కుకు సూటి గా పోవు చుక్కాని ద్రిప్పుకొనుచు,.నోడిడుడుకులు లేక జీవనపధము నొక మధుర యాత్ర గా సాగించ మని ఈ సాధ్వి బాలురకు,కుమారులకు ఉపదేశించింది.. 

బాల్యావస్థ నుండే తల్లిదండ్రులు మగ పిల్లలకు చక్కటి సంస్కారము స్త్రీల యెడల గౌరవ మర్యాదలు కలిగేలా సద్వర్తనం ,నేర్పినఎడల..చాలా వరకు వివాహానంతరము వచ్చె సమస్యలు సమసి సంతోష మైన జీవిత గతి తెలుసుకోగలుగుతారు..

స్త్రీ జాతి జీవిత సార్ధక్యము గల్గించునట్టి పూనుకొన్న..ఈ సదుద్యమ శీలకు స్త్రీలపక్షమున ఇవే నా సాధువాదములు...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!