కాలే కడుపుకి రుచి తెలీదు

కళ్ళు మూసుకొని నిద్ర పోవాలా... లేక నిద్ర పోయి కళ్ళు మూసు కోవల ..

తేలిక నాకు నిద్ర పట్టం లేదు..

కాలే కడుపుకి రుచి తెలీదు 

మండే కట్టెకి వర్ణం లేదు 

అర్ధించే చేతులకి తనపర భేదం లేదు 

పీల్చే గాలికి కులం తాగే నీరుకి మతం లేదు

నడిమధ్యన వచ్చావ్ 

చివరకి ఆమట్టిలోనే కలుస్తావ్ 

తోలుతిత్తి శరీరానికిబంధాల మందు జల్లి 

అహం అనే మత్తులో కష్టాల కొలిమిలో భవసాగరాన్ని ఈదుతున్నవ్

ఊపిరి ఆగే వరకే ఈ బంధం 

కట్టెకాలే వరకే ఈ పాశం

జానెడు పొట్టకోసం ఆరడుగుల నేలకోసం ఇన్ని పాట్లా 

మానవ జన్మకి ఇన్ని వెతలా ......@ బాటసారి

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!