ముండకోపనిషత్తు..

ముండకోపనిషత్తు..

ఈ ఉపనిషత్తులోని 'సత్యమేవజయతే' అనే ఈ సూక్తి భారత ప్రభుత్వ అధికార ముద్రలో ఉండడం భారతజాతి గర్వించదగిన విషయం.

ముండనం అంటే శిరసుపై జుట్టును తొలగించుట అని అర్థం. ముండనం చేయించుకోవడం ద్వారా, అన్ని కోరికలను పరిత్యజించి, మోక్షప్రాప్తికి ప్రయత్నం ప్రారంభించడం, దీని కొరకు సన్న్యాసాన్ని స్వీకరించడం అనేది సంకేత రూపంలో తెలుప బడింది. 

అటువంటి మోక్షేచ్చ కలవారికి ఉపదేశాన్ని అందించే ఉపనిషత్తు గనుక ముండకోపనిషత్తు అని పేరు వచ్చింది.

యజ్ఞ యాగాదులు, పుణ్యకార్యాలు చెయ్యడం వలన పుణ్యాన్ని సంపాదించుకొని, దాని ద్వారా, ఈ లోకంలో అఖండమైన కీర్తిని, భోగభాగ్యాలను, పరలోకంలో స్వర్గాది సుఖాలను పొందగల్గుతారు. 

కాని వీటి ద్వారా మోక్షాన్ని పొందలేరు.

విద్యాగర్వంతో విర్రవీగడం అజ్ఞానుల ప్రధాన లక్షణం. 

తాము బ్రహ్మజ్ఞానులమనుకొని విర్రవీగే మూర్ఖులు ఒక గ్రుడ్డి వానిచే తీసుకొని వెళ్ళబడే ఇంకొక గ్రుడ్డివాడు చిక్కుల్లో పడినట్లుగా జరామరణాలతో కూడిన జననమరణ వలయంలో తిరుగుతూ ఉంటారు.

సత్యమేవ జయతే నానృతం 

సత్యేన పంథా వితతో దేవయానః (3.1.6)

సత్యమే గెలుస్తుంది. అసత్యం ఎప్పటికీ గెలవదు. సత్యవ్రతాన్ని నిష్ఠతో అనుష్టించిన వారు దేవయానంతో ప్రయాణించి పునర్జన్మ రహితమైన సత్యలోకం చేరుకుంటారు. 

ఈ ఉపనిషత్తులోని 'సత్యమేవజయతే' అనే ఈ సూక్తి భారత ప్రభుత్వ అధికార ముద్రలో ఉండడం భారతజాతి గర్వించదగిన విషయం

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!