నవ్వితే...నవ్వండి ...

నవ్వితే...నవ్వండి ...

1..

నీకు విమానాలకు చౌకగా రంగువెయ్యటం ఎలాగో తెలుసునా?” అని శ్రీశ్రీ గారడిగారు. 

“ఏం లేదు, విమానం పైకి వెళ్ళాక చిన్నదైపోతుంది కదా? 

అప్పుడు వెయ్యాలి రంగు” అన్నారు, కలకల నవ్వుతూ.

2,..

రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు.స్వరం మారుతోంది." 

"మేం ప్రమాణ స్వీకారం నాడే చెప్పాం."

"ఏం చెప్పారు?"

"మాకు ఓటేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేమని."

3..

అలవాట్లు

స్కాట్స్ కు, ఐరిష్ లకు, ఇంగ్లీషు వాళ్ళకు పడదు.

ఇంగ్లీషువాడు చెప్పినది.

ఇంగ్లీషువాడు ట్రైన్ నిర్లక్ష్యంగా దిగిపోతాడట.

ఐరిష్ వాడు తనవి ఎమైనా వదిలానేమో అని చూచుకుని దిగుతాడట.

స్కాట్ వాడు ఎవరైనా ఎమైనా వదిలివెళ్ళారేమోనని చూచుకుంటూ దిగుతాడట.

4...

"మార్కెన్ డెవిల్" కి వురి శిక్ష పడింది!!

"నీ ఆఖరి కోరిక ఏమిటీ?" అని అడిగారు జడ్జి గారు!

"మా ఆవిడని చూడాలి సార్!!" అన్నాడు "మార్కెన్ డెవిల్" !

"చాచ్చేముందు కూడా నీకు తల్లి తండ్రులని చూడాలని అనిపించటం లేదా??!!" అని అన్నారు జడ్జి గారు! 

"ఇంకో జన్మ ఎత్త గానే తల్లి తండ్రులు వస్తారు సార్!!...కానీ....మళ్లీ పెళ్ళాం కావాలంటే 20 సం.లు ఆగాలి, మరి!!" అన్నాడు "మార్కెన్ డెవిల్" !!

5..

కొత్తగా పెళ్లి అయ్యిన జంట "అతి", "మందమతి " , రైల్ లో వెళుతున్నారు!!

"డార్లింగ్ !! నాకు మెడ చాలా నొప్పిగా వుంది !" అంటూ వొగలు పోయింది "మందమతి"!

"నేనున్నానుగా!!నేను వున్నాను !!చిటికెలో నొప్పి మాయం చేస్తాను, చూడు!!" అని "అతి" గాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు !!

"అరె ! పోయిందే!! ఇట్స్ గాన్!! వావ్!!" అంది "మందమతి!

కాసేపు ఉన్నాక...

"డార్లింగ్ నాకు చెయ్యి నొప్పిగా వుంది!" అంటూ వొగలు పోయింది "మందమతి"!

"నేనున్నానుగా!!నేను వున్నాను !!చిటికెలో నొప్పి మాయం చేస్తాను, చూడు!!" అని "అతి" గాడు, చెయ్యి మీద ముద్దు పెట్టుకున్నాడు !!

"అరె ! పోయిందే!! ఇట్స్ గాన్!! వావ్!!" అంది "మందమతి!

ఇదంతా మన "అయోమయం" గాడు పై బెర్త్ మీద నుండి చూస్తున్నాడు !!

మెల్లెగా కిందికి దిగాడు!!

"మతి" గాడి ఎదురుగ్గా నించున్నాడు!!

"ఎం కావాలి?...అలా చూస్తున్నావెన్దుకూ??!!" అని అడిగాడు "అతి" గాడు!

"బాబ్బాబు !!మీరే పుణ్యం కట్టు కోవాలి!" అన్నాడు "మన "అయోమయం"!

"సరిగ్గా చెప్పు, ఏమిటి నీ ప్రాబ్లెమ్?!" అన్నాడు "అతిగాడు!

"అదేనయ్యా!! నేను ఒక సంవత్సరం నుండి , పైల్స్ తో భాద పడుతున్నాను, మీరు దయచేసి, ఒక ముద్దు,,,,,,....!!!!"అని ఆశగా చూసాడు మన "అయోమయం''!

6..

"మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇంతకి ఇది మీకు ఎన్నో పుట్టినరోజు" 

అన్నాడు విలేఖర్.. తార అభినయ శ్రీ తో ..

'ఇది నా పదిహేడు పుట్టినరోజు"అంది ఆమె మెలికలు తిరిగి పోతో...

"మరి మీరు అయిదు ఏళ్ళు క్రింద ఇదే మాట అన్నారు.."అన్నాడు

మన విలేఖర్..

అందుకు ఆమె "నేను అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పిదని కాదు" అని కోపగించు కుంది ..

7..

భూమి మీద నివసించే జంతువులూ, పిల్లల్ని కంటాయి!!

అలాగే, గాలిలో ఎగిరే పక్షులు గుడ్లు పెడతాయి...

ఇప్పుడు మీకు ఒక ప్రశ్న !!

....గాలిలో నే ఎగుర్తుంది కానీ పిల్లల్ని పెడుతుంది ...ఎవరో చెప్పుకోండి ??!" అని అడిగింది "లావణ్యా మిస్" 

ఎవరూ మాట్లాడ లేదు 

ఎవరూ చెప్పలేక పోయారు!!

"ఉరేయ్! పిడుగూ!!! నువ్వు చెప్పరా!'' అంది ''లావణ్యా మిస్" 

"ఏర్ హోస్టెస్ !!" అన్నాడు, తడుముకోకుండా "పిడుగు"!!

8..

మీరు పొద్దున్నే లేచి

ముగ్గురిని నిద్ర లేపండి.

వాళ్ళ ముగ్గురిని

మరో ముగ్గురిని లేపమనండి...

ఇలా బద్దకాన్ని

భారతదేశం నుండి తరిమేయవచ్చు.

గమనిక :

నన్ను మాత్రం లేపొద్దు

9..

ఈ చీరను స్వంతం చేసుకోవాలంటే వెంటనే కాల్చేయండి! 

ఆవిడెవరో టీ వి లో చెపుతున్నారు. ఎవర్నో చెప్పలేదు.

ఎలా చచ్చేది.... పోలీసుకు ఫోను చెయ్యాలి..

10..

"ఇంజేనీరిగ్ కాలేజీ ప్రొఫెసర్లు ఒక విమానం ఎక్కారు!!"

పైలట్ వచ్చి,"ముందుగా మీకు వెల్కం !!నేను, మీరు అన్దరూ గర్వ పడే ఒక విషయం చెబుతాను!!

ఈ విమానం మీ కాలేజీ విద్యార్థులు తయారు చేసిందే ...ఈ రోజే ఈ విమానం మొదటి ప్రయాణం!!" అన్నాడు.

అంతే!!...అన్దరూ బిల బిలా మంటూ విమానం లోంచి దిగిపోయారు!!

ఒక ప్ర్ఫేసర్ గారు మాత్రం , తొణక కుండా పేపర్ చదువు కుంటూ, కూర్చునె వున్నాడు !!

"గుడ్! మీ ధైర్యానికి నా జోహారు!" అన్నాడు పైలెట్ !

"ధైర్యమా నా బొందా??!!...ఈ విమానం స్టార్ట్ అవదు, నాకు తెలుసు!!" అన్నాడు ప్రొఫెసర్ జీ!!

11..

అయోమయం" గాడు డిల్లీ వెళ్లి , కుతుబ్ మినార్ చూడటానికి వెళ్ళాలను కున్నాడు !!

కానీ దారి తెలియక, ఒక పోలీస్ వాడీ వద్దకు వెళ్లి ..."అయ్యా!!కుతుబ్మినార్ కి వెళ్లాలి, కొంచం ఎలా వెళ్ళాలో చెబుతారా??" అని అడిగాడు .

"నువ్వు ఒక పని చెయ్యి ..ఇక్కడె నించో 46 వ నంబర్ బస్ వస్తుంది, అది నిన్ను డైరెక్ట్ గా కుతుబ్ మినార్ తీసుకుని వెళుతుంది!!" అన్నాడు పోలీసు.

"చాలా థెంక్స్ అండీ!" అన్నాడు "అయోమయం"

................................

...................................ఒక మూడు గంటల తరువాత !!

పోలీసు ఆయన తన బండి మీద ,పనులన్నీ చూసుకుని తిరిగి వస్తున్నాడు !!

ఆశ్చర్యం!! "అయోమయం" గాడు ఇంకా అక్కడె నించుని వున్నాడు!!

"ఏమిటీ ఇంకా వెళ్ల లేదా...చెప్పానుగా 46 వ నంబర్ బస్ ఎక్కమనీ??!" అన్నాడు 

"అదే సార్ నేను చూస్తూనె వున్నాను లెండి .....ఇప్పటికి 39 బస్సు లే వెళ్ళాయి ....46 వ డి రాగానే ఎక్కేస్తాను!!" అన్నాడు "అయోమయం"గాడు.

12..

ప్రశ్న 1: భీముడు బకాసురుణ్ణి ఎలా చంపాడో 5 వరుసలకు మించకుండా వివరింపుడు? (5 మార్కులకు)

జవాబు: భీముడు బకాసురుణ్ణి గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది …చంపాడు.

13..

నమ్మకం.

ఏ మ్ ఎస్ నారయణ (కాషిఎర్) మేనేజర్ బ్రహ్మానందంతో 

సారూ. ఇక్కడ ఒకడు బ్యాంకు దోచుకోనడికి ఒకడు వచ్చేడు ,గన్ మర్చిపోయ్డు ట

ఏమి చెయ్యాలి.

కొంచెం కస్టమర్ అంటే నమ్మకం ఉండాలి , తొక్కలో గన్ రేపు తెస్తాడు ...

ముందు డబ్బు అంతా ఇచ్చి వెయ్యి అన్నాడునమ్మకం.

ఏ మ్ ఎస్ నారయణ (కాషిఎర్) మేనేజర్ బ్రహ్మానందంతో 

సారూ. ఇక్కడ ఒకడు బ్యాంకు దోచుకోనడికి ఒకడు వచ్చేడు ,గన్ మర్చిపోయ్డు ట

ఏమి చెయ్యాలి.

కొంచెం కస్టమర్ అంటే నమ్మకం ఉండాలి , తొక్కలో గన్ రేపు తెస్తాడు ...

ముందు డబ్బు అంతా ఇచ్చి వెయ్యి అన్నాడు బ్రహ్మానందం. 

14..

జంధ్యాల మచ్చుతునకలు

భర్త భార్యను ప్రేమించే పద్ధతికి, భార్య భర్తను వేదించే పద్ధతికి సరైన నిర్వచనం :- పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క - ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లంచెక్క, నీ పీకనొక్క

మొక్కుబడికి బుక్కులన్నీ చదివినా కుక్కగొడుగు మొక్కలా, చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా, కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా, బిక్క మొహం వేసుకొని, వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ డెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ, ఇక్కడే ఈ ఉక్కలో గుక్కపెట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపీనుగులా చక్కిలాలు తింటూ, అరటి తొక్కలా, ముంగిట్లో తుక్కులా, చిక్కు జుట్టు వేసుకొని ముక్కు పొడి పీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్ళాన్ని రక్కుతూ, పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ, రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కినక్కి ఈ చెక్క బల్ల మీద బక్క చిక్కి ఇలా పడుకోకపోతే --- ఏ పక్కకో ఓ పక్కకు వెళ్ళి పిక్క బలం కొద్దీ తిరిగి, నీ డొక్క శుద్ధితో వాళ్ళని ఢక్కాముక్కీలు తినిపించి, నీలక్కు పరీక్షించుకుని ఒక్క చక్కని ఉద్యోగం చిక్కించుకొని, ఒక్క చక్కటి అడ్వాన్సు చెక్కు, చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి.

శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహారాజు, కళా హృదయుడు తన మహామంత్రికి "అప్పాజీ" అని పేరు పెట్టుకున్నాడంటే.... అప్పు ఎంత విలువైనదో గ్రహించండి. ఇంగ్లీషులో కూడా "డౌన్" కంతే "అప్" ఉన్నతమైనది కాదా?

డబ్బు పెరిగినా, జబ్బు పెరిగినా ఆ తేడా ముఖంలోనే తెలుస్తుంది.

కుంతీ సెకండ్ సన్ బూన్… అదే భీమవరం…

గారెన్‌కర్రీ… అదేనమ్మ తోటకూర

15..

పరిశీలన

ఆరోజు కాబోయే డాక్టర్లకు శరీర నిర్మాణం (అనాటమీ) గురించి ఆ ప్రొఫేసర్ గారు క్లాసు తీసుకుంటున్నారు. 

"మీరు దేనిని అసహ్యంచుకోకూడదు. ఇది మొదటి సూత్రం" అని ఎదురుగా బల్లమీద ఉన్నశవానికి గుడ్డ తొలగించాడు.

శవం రసాయినాలలో నుండి తీసుకువచ్చారు కాబోలు నిగనిగలాడుతోంది. 

"ఇప్పుడు మీరు అందరూ దీని నొట్లో ఇలా వేలుపెట్టి ఆ వేలును మీ నోట్లో పెట్టుకోండి. "

అందరూ ఒకరు తరువాత ఒకరు అలాగే చేశారు. 

"ఇప్పుడు రెండో సూత్రం. మీరు ప్రతీది నిశీతంగా పరిశీలించాలి. 

మీరు నన్ను చూడలేదు. నేను చూపుడు వేలు శవంనోట్లో పెట్టి మద్య వేలు నోట్లో పెట్టుకున్నాను. "

16..

"డాక్టర్ గారు!!మీరు భలే నర్స్ ని పెట్టుకున్నారు !! ఆవిడ చెయ్యి తగలగానే రోగం ఇట్టె తగ్గిపోయింది!!!!" అన్నాడు "దర్వేష్"!

"అవును!! నాకూ, "చెళ్" అని శబ్దం వినిపించింది !!" అన్నాడు డాక్టర్ !!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!