ఉడతా భక్తి......

 ఉడతా భక్తి......

రామసేతు నిర్మాణ సమయంలో వానరులంతా పెద్దపెద్ద బండరాళ్ళను మోసుకుని వచ్చి సముద్రంలో వేస్తున్న సమయంలో ఒక ఉడత తీరంలో ఉన్న ఇసుకను తన తోకతో తెచ్చి సముద్రంలో వేయడం ప్రారంభించింది.ఈ విషయాన్ని వానరులు శ్రీరామచంద్రుని దృష్టికి తీసుకుని వచ్చారు.

తన వల్ల అవుతుందా? తాను అందుకు అర్హమేనా అనే విషయాల గురించి ఆలోచించకుండా ఉడత తనంతట తానే ఆ విధంగా ఇసుక రేణువులను సముద్రంలోకి నెట్టడాన్ని చూసిన శ్రీరామచంద్రుడు దానిని చేతుల్లోకి తీసుకుని దాని వెన్ను మీద నిమిరాడట.రామాయణం కథలో ఉడతా భక్తి గురించి ప్రత్యేక అధ్యాయనం ఉంది. 

ఉడతా భక్తిగా సాయం చేయాలని పెద్దలంటూ ఉంటారు. సహజీవన విధానానికి ఇదే ప్రాతిపదిక.సృష్టిలో లభించిన సంపద అంతా తామొక్కరం అనుభవించాలన్న కాంక్ష వల్లే కొద్ది మంది యావత్‌ సంపదనూ,సహజ వనరులనూ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ స్వార్ధపూరిత భావం అనాదిగా ఉన్నప్పటికీ,ఆధునిక కాలం లో బాగా పెరిగిపోయింది.దీని వల్లే సమాజంలో ఘర్షణలు తలెత్తుతున్నాయి. భగవంతుడు సృష్టించిన ఈ ప్రకృతిలోప్రతి వస్తువునూ సొంతంచేసుకోవడానికి మనిషి అనాదిగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మనుషుల కోపతాపాలకూ, గొడవలకూ ఈ స్వార్థ చింతన బాగా పెరిగి పోవడమే ప్రధాన కారణం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!