// కో కిలా లాపము//


// కో కిలా లాపము//

మధుర పల్లవ పుష్ప సంభరిత చూత

పోతమును నుజ్జగించి,యో ముగ్ధ పికమ,

చేదు నిండిన య వేప చెట్టు మీద

గాకులను గూడి యుంటకు గతము చెపుమ!

మౌనమును మానుకొని పంచమ స్వరమున

గుహి కుహీ నాద మొకటి పల్కుముపికంబ!

కానిచో నెట్లు గుర్తింప గలము నిన్ను

గాకి మూకలలోన మాకంద సాఖి

కోకిలా! నీ శరీరము నలుపు,

అదియు బర బోషితమ్ము,వనాంతరముల

నితర విహగమ్ముల నుకూడి యెగురుచుందు;

చెవుల నమృతంబు బిందువుల్ చిలుకు నేర్పు

నే గరుక్మంతునొద్ద గ్రహించినావు?

ప్రాంగణముచేరి కావు కావనుచు గర్ణ

పరుషముగ గూయు కాకిని బార ద్రోలి

ఎచటనో కొమ్మలందు గుహీరవమ్ము

సలుపు కోకిల దెస జూపు నిలుపుబుధుడు.

అరచెదవు,.గంతు వేసెద.వడిచి పెడేద,

వేమి చేసిన నీ లోపమేమి? కాక;

కోకిలావాస చూతమ్ము నీకు కూడ

వసతి చేసిన విధి ననవలెను గాక.

తాలుచును గాక నల్లని తనువు,ఫలర

సమ్ములను గ్రోలుగాక,రసాల శాఖ

నధి వసించు గాక యుద్యాన వీధి

సంచరించును గాక,సుస్వర కళా ప్ర

గల్భతన్ గాకి కాకె,పికమ్ము పికమె.

.............. ( పింగళి లక్ష్మీ కాంతం గారి రచన)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!