రంగాజమ్మ--కవయిత్రి

రంగాజమ్మ--కవయిత్రి

మనిషిలో బలీయమైనది ఏమిటీ అంటే బలహీనత. రాజుల బలహీనతలలో ఒకటి "స్త్రీ సౌందర్యోపాసన". తంజావూరి రాజు శ్రీ విజయరాఘవనాయకుడి ఆస్థానంలో కవయిత్రి రంగాజమ్మ అని మహాసౌందర్యవతి ఉండేది. రంగాజమ్మ ఆస్థానానికి వచ్చిన తరువాత ఆమె మోజులో తన దేవేరి రాజగోపాలంబికని ఆ స్థానం నించి పక్కన పెట్టి ఆమె దగ్గరకు వెళ్ళటం మానేశాడు. ఒక దాసి ఒక బ్రాహ్మణుడు రంగాజమ్మ దగ్గరకి రాజగోపాలాంబిక తరఫున రాయబారానికి వెళ్తారు---రాజుగారి మీద కాస్త పట్టువదలమని. గడుసరి అయిన రంగాజమ్మ దాసీకి ఇచ్చిన కొంటె సమధానం:

ఏ వనితల్ మమున్ దలప నేమిపనో? తమరాడువారు గా

రో! వలపించు నేర్పెరుగరో! తమ కౌగిటిలోన నుండగా 

రావదియేమిరా! విజయరాఘవ! యంచుఇలుదూరి బల్మిమై 

దీవరకత్తెనై పెనగి తీసుకువచ్చితినా? తలోదరీ?

మహారాణి ఆడదిగాదా? చేతనయితే భర్తను నేర్పుగా వలపింప చేసుకోవాలి. నేనేమైనా రాణిగారి కౌగిటిలో ఉంటే వారి ఇంట్లోకి దూరి అయనను విజయరాఘవా రా అని బలవంతంగా లాక్కోని వచ్చానా ఏమిటి

By..Vunnava Nageswara Rao garu .... Bapu gari Painting..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!