గుమ్మడి వెంకటేశ్వరరావు

గుమ్మడి వెంకటేశ్వరరావు.............అవధానుల రామారావ్

తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్న నటుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

గుమ్మడి వెంకటేశ్వరరావు అంటే తెలియని వారు తెలుగునాట ఉన్నారంటే అది అతిశయమే. అద్వితీయమైన గుణచిత్రనటనతో ఆయన తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు. పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఏవిధమైన చిత్రమైనా అయన తనవేషంలో జీవించాడు. తండ్రిగా, అన్నగా, తాతగా వేషమేదైనా దానిని తన నటనతో పండించడం అతడికి కరతలామలకం. అన్ని రకాల వేషాలు ఆయన ధరించినా సాత్విక వేషాలలో ఆధిక్యత సాధించి ప్రేక్షకులను మెప్పించాడు. అయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాడు. ఆంధ్రుల పంచకట్టులోని హందాతనాన్ని ప్రతిబింబించిన ఏకైక నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. మహామంత్రి.గుమ్మడి కి ఐదుగురు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు. గుమ్మడి స్వగ్రామము గుంటూరు జిల్లా తెనాలి సమీపములోని రావికంపాడు . ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి బసవయ్య, తల్లి బుచ్చమ్మ. ముగ్గురు తమ్ములు, ఒక చెల్లి ఉన్నారు. కుటుంబ సభ్యుల అప్యాయతానురాగాల మధ్య గారాబంగా గుమ్మడి జీవితం గడిచింది. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కారణంగా బంధాలు అనుబంధాలు అనుభవ పూర్వకంగా తెలుసుకోవడానికి అయనకు అవకాశం కలిగింది. ఉమ్మడి కుటుంబం వాతావరణంలో పెరిగిన గుమ్మడి జీవితం ఆయన నట జీవితంలో ప్రతిఫలించి సాత్విక పాత్రలలో ఆయన జీవించడానికి సహకరించింది. 

గుమ్మడి ప్రారంభవిద్య నుండి స్కూల్ ఫైనల్ వరకు స్వంత ఊరు అయిన రావికంపాడుకు 3 కిలోమీటర్ల దూరంలో కొల్లూరు ఉన్నత పాఠశాలలో జరిగింది. అక్కడ ఆయన ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివాడు. ఈ దశలోనే ఈయన తమ ఊరిలో పుచ్చలపల్లి సుందరయ్య గారి ఉపన్యాసంతో ప్రభావితుడై కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడయ్యాడు. గుమ్మడి ఎస్.ఎస్.ఎల్.సి మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అయ్యాడు. తన తరువాత విద్యాభ్యాసం గుంటూరు హిందూ కాలేజిలో సాగించాలని ఎంతో అభిలషించినా పెద్దవారు మాత్రం ఆయనకు ముందున్న కమ్యూనిష్టు ఆసక్తిని తలచి దారితప్పి వ్యవహరిస్తాడని భావించి ఉన్నత విద్యకు అంగీకరించక వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పటికి ఆయన వయస్సు 17 సంవత్సరాలు కావడం విశేషం. పెద్దల వివాహప్రయత్నాన్ని వద్దని వారించగలిగిన వయస్సు కాని, మానసిక పరిపక్వత కాని లేని ఆ వయస్సులో, ఆయన వివాహం 1944లో పెద్దల సమక్షంలో నాయనమ్మకు అమ్మమ్మ అయిన 103 సంవత్సరాల వృద్ధురాలు, నాయనమ్మ, అమ్మమ్మ వంటి పెద్దల ఆశీర్వచనంతో లక్ష్మీ సరస్వతితో జరిగింది.. అత్త సహకారంతో గుంటూరు హిందూకాలేజ్‌లో ఇంటర్ వరకు (1944-1946) చదువు సాగింది. 

గుమ్మడి సినీప్రవేశం అదృష్ట దీపుడు (1950) సినిమాతో జరిగింది. రెండవ చిత్రం నవ్వితే నవరత్నాలు మూడవ చిత్రం పేరంటాలు, నాలుగవ చిత్రం ప్రతిజ్ఞ వీటన్నింటిలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి. తదుపరి, అవకాశాలు లేవని, తిరిగి వెళ్ళాలని భావించిన సమయంలో, ఎన్.టి. రామారావుతో కలిగిన పరిచయం వలన ఆయన గుమ్మడి వెంకటేశ్వరరావును తిరిగి వెళ్ళవద్దని, తన స్వంత చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేసాడు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్.టి. రామారావు ఆయనకు తన స్వంత చిత్రం పిచ్చిపుల్లయ్య చిత్రంలో ప్రతినాయక పాత్ర ఇచ్చాడు. ఆ చిత్రంతో గుమ్మడి జీవితం మరో మలుపు తిరిగింది. ఎన్.టి.రామారావు తన తరువాతి చిత్రం తోడు దొంగలు చిత్రంలో ప్రధాన పాత్ర అంటే తోడుదొంగలుగా అయన, ఎన్.టి.రామారావు నటించారు. ఆ చిత్రం విజయం సాధించక పోయినా దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించడం విశేషం.

తోడు దొంగలు చిత్రం తరువాతకూడా చిన్నచిన్న వేషాలతో కాలం జరుగుతున్న సమయంలో గుమ్మడి వెంకటేశ్వరరావు చలచిత్ర జీవితాన్ని మలుపు తిప్పిన పాత్ర ఆయనకు అభించింది. అదే అర్ధాంగిలో శాంతకుమారి భర్త మరియు జమీందారు వేషం లభించడం. ఆచిత్ర ఘన విజయం కారణంగా చలచిత్ర రంగానికి గంభీరమైన తండిపాత్రల నటుడు లభించాడు. ఆ చిత్రంలో నటించడానికి, నిర్మాత పుల్లయ్యను కలవడానికి వెళ్ళిన సమయంలో, ప్రముఖ నటీమణి శాంతకుమారి అయన చిన్నవాడని ఆ పాత్రకు తగడని చెప్పినా పుల్లయ్య అంగీకరించక తాను అనుకున్నట్లు ఆ పాత్రలో గుమ్మడి వెంకటేశ్వరరావును నటింపజేసాడు. ఆ తరువాత ఆయన వెనుచూడకుండా నటజీవితంలో ముందుకు సాగాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు చిన్నవయసులోనే కారెక్టర్ నటునిగా మారాడు. నిజానికి రామారావు, నాగేశ్వరరావుల కన్నా గుమ్మడి వయసులో చిన్నవాడే అయినా అనేక చిత్రాలలో ఆ ఇరువురి నటులకు తండ్రిగా, మామగా నటించాడు. నటించిన పాత్రలో ఒదిగిపోతూ అన్నిరకాల పాత్రలూ ధరించాడు. పౌరాణిక, జానపద, చారిత్రిక, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ పాత్రలు పోషించాడు. అత్యంత విరుద్ధమైన వశిష్ట, విశ్వామిత్ర పాత్రలు రెంటిని గుమ్మడి ధరించి ప్రశంసలు అందుకున్నాడు. దశరధునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్, బలరాముడు, భృగుమహర్షి, మొదలైన పౌరాణిక పాత్రలు ధరించాడు. తెనాలి రామకృష్ణ, వీరాభిమన్యు, కర్ణ (డబ్బింగు) మొదలైనవి మిగతావి. సాంఘిక చిత్రాలలో సాత్విక పాత్రలతోపాటు ప్రతినాయకునిగా (నమ్మినబంటు, లక్షాధికారి, రాజమకుటం) కూడా నటించాడు.

సినీజీవితంలో ప్రవేశించే సమయానికి ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు. సినీజీవిత ఆరంభంలోనే ఎన్.టి రామారావు పరిచయం కలిగింది. అలాగే ఎన్.టి.రామారావు కుటుంబ సబ్యులతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఎన్.టి.రామారావు తన స్వంత చిత్రంలో అవకాశం ఇవ్వగానే ఆయన తండ్రి గుమ్మడికి కుటుంబాన్ని తీసుకురావడం మంచిదని చొరవగా సలహా ఇచ్చాడు. ఆయన సలహాను పాటించి కుటుంబాన్ని మద్రాసుకు తీసుకు వచ్చాడు. గుమ్మడి వెంకటేశ్వరరావుకు అయిదుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయన తన కుటుంబానికి బాధ్యతాయుతమైన తండ్రిగా వ్యవహరించారు. కుటుంబ శ్రేయస్సు కోరి చిత్రనిర్మాణానికి దూరంగా నిలిచారు. కుమార్తె మరణం, సతీమణి వియోగం కొంత బాధను కలిగించినా తృప్తికరమైన జీవితం అనుభవించినట్లు తన మాటలలో చెప్పుకున్నాడు.

అర్ధాంగి చిత్రంలో ఆయనకు భార్యగా నటించిన శాంత కుమారి ఆయనకంటే 8 సంవత్సరాలు పెద్దది. అలాగే ఆయనకు పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు ఆయనకంటే 3 సంవత్సరాలు పెద్ద. ఆయన చిన్న కుమారుడిగా నటించిన జగ్గయ్య ఆయన కంటే 1 సంవత్స్దరం పెద్ద.

మహామంత్రి తిమ్మరుసు చిత్రం లో ఎన్.టి.ఆర్ కృష్ణదేవరాయలు గా నటించినా చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదుగా ఉండటం రామారావు చిత్రాలలో ఓ అరుదైన ఘటన. అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే ఉంది.

తెలుగు విశ్వవిద్యాలయం తిమ్మరుసు(1962)లో కథానాయకుడి పాత్రకు జీవం పోసిన గుమ్మడిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఆయన తనజీవిత చరిత్ర తీపిగుర్తులు చేదు జ్ఞాపకాలు అన్న పేరుతో రచించాడు. 1995 లో ఆరోగ్యం సరిగాలేక గొంతు సరిగా పనిచేయనప్పుడు, ఇతరుల గొంతు వాడటంఇష్టంలేక నటించటం మానుకున్నాడు. మరల జగద్గురు శ్రీ కాశినాయన చరిత్ర (2008) లో ఆయన వయస్సు మరియు గొంతు సరిపోతుంది కాబట్టి నటించాడు

గుమ్మడి చివరిసారిగా 2008 సంవత్సరంలో జగద్గురు శ్రీ కాశీనాయని చరిత్ర సినిమాలో తన జీవితానికి దగ్గరగా వున్న కాశీనాయనv పాత్ర పోషించాడు.

గుమ్మడి 'చేదు గుర్తులు, తీపి జ్ఞాపకాలు' పేరుతో జీవనస్మృతుల్ని అక్షరీకరించాడు. తొలి ముద్రణ ప్రతులన్నీ, కొద్ది రోజులలోనే చెల్లిపోవటం గుమ్మడి పట్ల తెలుగు ప్రేక్షకులకున్న అభిమానానికి ఓ ఆనవాలు.

నటుడిగా అవకాశాలు వచ్చినా ఆధునిక చిత్రసీమ యొక్క పోకడ నచ్చక చివరి కాలంలో నటనకు దూరంగా ఉన్నాడు. 1995 లో ఆరోగ్యం సరిగాలేక గొంతు సరిగా పనిచేయనప్పుడు, ఇతరుల గొంతు వా డటంఇష్టంలేక నటించటం మానుకున్నాడు. 

హైద్రాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో 26 జనవరి 2010 న చాలా శరీరఅవయవాలు పనిచేయక మరణించాడు. ఆయన చివరిగా మాయాబజార్ (రంగులలోకి మార్చిన) ప్రదర్శించినప్పుడు ప్రజల మధ్య గడిపాడు. "ఆ గొప్ప సినిమాను రంగులలో చూడటానికేమో, నేను ఇంత దీర్ఘకాలం బ్రతికి వున్నాను" అని సంతోషం వ్యక్తం చేశాడు.

గుమ్మడి పోషించిన పాత్రలు.

పురాణ పాత్రలు: బలరాముడు , భీష్ముడు భృగుమహర్షి, దుర్వాసుడు, జమదగ్ని, కర్ణుడు , విశ్వామిత్రుడు, ధర్మరాజు , సత్రాజిత్తు, దశరథుడు.

చారిత్రాత్మక పాత్రలు: పోతన, కబీర్ దాసు,తిమ్మరుసు, కాశీనాయన

1998 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డు నిచ్చి సత్కరించింది.

1982 : మరో మలుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం చేత గౌరవించబడ్డాడు.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!