అష్టావక్రుని శాప ఫలితం ...

అష్టావక్రుడు చిన్నతనములోనే ఉగ్రమైన తపస్సుచేశాడు. తండ్రినుండి సృష్టి రహస్యములు తెలుసుకున్నాడు. వివాహమునకు యుక్త వయస్సు వచ్చింది. అష్టవంకరల శరీరము కలవానికి కన్యనెవరిస్తారు? మళ్ళీ తపస్సుకే కూర్చున్నాడు. ఇంద్రుడు ఆయన తపోబలాన్ని ఎరిగికూడా ఆయన సేవకు అప్సరసలను పంపించాడు. అష్టావక్రుడు వారిని చూచి "మీరు ఇంద్రుడు పంపగా వచ్చారు. ఆట పాటలు ప్రదర్శించారు. సంతోషం. మరలిపోండి" అని చెబుతాడు. వారు దానికి "మీరు తపస్సంపన్నులని, మహాత్ములని ఇంద్రుడు చెప్పాడు. మీరు మాకు ఒక వరమీయగలరా?” అని అడిగారు. దానికి ఆయన సమ్మతించాడు. "మమ్మలిని మహావిష్ణువు పెండ్లిచేసుకోవాలి. అది మాకోరిక" అంటారు. దానికి ఆయన "ద్వాపరంలో విష్ణువు భూమిమీద కృష్ణునిగా జన్మిస్తాడు. మిమ్ములను వివాహంచేసుకుంటాడ"ని చెబుతాడు. వాళ్ళు హేళనగా నవ్వుతారు. దానికి ఆయన కుపితుడై నావలన వరంపొంది నన్నే పరిహసిస్తారా? మీరు కృష్ణుని భార్యలుగా ఉన్నప్పుడు మీకంటె ముందే ఆయన అవతార పరిసమాప్తి జరుగుతుంది. మీకు వైధవ్యయోగం ఉంటుంది. సామాన్యమైన నిషాదులు, దొంగలచేతిలో అవమానాలు పొందుతారు" అనిశపిస్తాడు. కృష్ణుడు అవతారం చాలించినప్పుడు అర్జునునికి అంతఃపుర స్త్రీలను రక్షించమని కబురు పంపుతాడు. అర్జునుడు వారిని ద్వారకనుండి తీసుకు వెళ్ళుచుండగా దొంగలు దోచుకుంటారు. అర్జునుడు దొంగలను ఎదిరించలేకపోతాడు. ఇది అష్టావక్రుని శాప ఫలితమే.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!