ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది

సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి

ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది

ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది

ఎందుకో ఎందుకో ప్రతి పులుఁగు యేదో చెప్పబోతుంది

వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది

ఉండుండీ నా ఒళ్ళు ఊగి ఊగి పోతుంది

 .ఇదీ అద్భుతమమే బాపూరమణ గార్ల సంపూర్ణ రామాయణం లో kv మహదేవన్ పండించిన పాట ...https://www.youtube.com/watch?v=tw4aTlg0gLU&hd=1

అదిగో రామయ్య! ఆ అడుగులు నా తండ్రివి

ఇదుగో శబరీ! శబరీ! వస్తున్నానంటున్నవి

కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని

నా కోసమే నా కోసమే నడచి నడచి నడచి

నా కన్నా నిరుపేద నా మహరాజు పాపం అదుగో

అసలే ఆనదు చూపు ఆ పై ఈ కన్నీరు

తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో

ఏలాగో.. నా రామా.. ఏదీ ఏదీ ఏదీ

నీల మేఘమోహనము నీ మంగళ రూపము

కొలను నడిగి తేటనీరు.. కొమ్మ నడగి పూల తేరు

గట్టు నడిగి.. చెట్టు నడిగి.. పట్టుకొచ్చిన ఫలాలు.. 

పుట్ట తేనె రసాలు

దోరవేవో కాయలేవో ఆరముగ్గినవేవో గాని

ముందుగా రవ్వంత చూసి విందుగా అందీయనా...

విందుగా అందీయనా

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!