విదుర నీతి

విదుర నీతి


మహాభారతంలో విదురుని పాత్ర విశిష్ఠమైనది. అతని వ్యక్తిత్వం విలక్షణమైనది. 


మహాభారత యుద్ధ సమయంలో చిత్త వైకల్యాన్ని పొందిన ధృతరాష్ట్రునికి తన సాధు వచనములతో విదురుడు స్వాంతనను చేకూరుస్తాడు. అప్పుడు విదురుడు చెప్పిన మాటలే 'విదుర నీతి' గా ప్రసిద్ధిపొందాయి. 


ఆ విదుర నీతిలో కొన్ని మాటలు. 


1. ఆర్భాటం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయే వానిని, తనను గురించి తాను చెప్పుకోని వానిని, ఎంత రెచ్చగొట్టినా పల్లెత్తు మాటలాడని వానిని ప్రజలు గౌరవిస్తారు. 



2. ఫలించని చెట్ల చెంతకు పక్షులు చేరవు. ప్రయోజనము చేకూర్చని వానిని ఎవరూ చేరరు. 


3. మరణం ఊపిరిని, క్రోధం సంపదను, అసూయ న్యాయ బుద్ధిని, కామం లజ్జను, వార్థక్యం అందాన్ని, దుర్జన సేవనం సద్గుణాన్ని, దురహంకారం మన సర్వస్వాన్ని హరించివేస్తాయి. 


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!