‪#‎బోనాలు‬

‪#‎బోనాలు‬   (Eco Ganesh)

.ఆషాఢం అనగానే గుర్తుకువచ్చేది #బోనాలు. భాగ్యనగరం (హైద్రాబాదు)లో ఎంతో వైభవంగా జరుగుతాయి. బోనం భోజనం అనే పదానికి వికృతి. మా పిల్లల్ని, కుటుంబసభ్యులను, మొత్తం గ్రామాన్ని చల్లగా చూస్తున్న ఓ జగన్మాత! అందరికి అన్ని ఇవ్వగల నీకు భక్తితో ఈ బోనం సమర్పిస్తున్నానమ్మా! మా అందరి కోసం ఊరి పొలిమేరలో కూర్చున్నావు, నీకు ఏదైనా ఇద్దామంటే నీ దగ్గర లేనిదేది లేదు. కానీ అమ్మ! భక్తితో నీకు బోనం(భోజనం) తెచ్చాను. స్వీకరించి మమ్మల్ని సదా అనుగ్రహించు తల్లీ! అంటూ బోనం సమర్పించి అమ్మకు కృతజ్ఞతలు చెప్తున్నాం.

‪#‎బోనం‬ జగన్మాతకు చెప్పే కృతజ్ఞత

.

లలితా సహస్రనామాల్లో ' ఆబ్రహ్మకీట జననీ్' అని అమ్మకి ఒక నామం, అంటే బ్రహ్మ మొదలుకొని చిన్న కీటకముల వరకు పక్షులు, చెట్లు, గ్రహాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, మనుష్యులు, దేవతలు మొదలైనవారందరికి ఆమెయే తల్లి అని అర్దం. ఇలా అమాయకుల ప్రాణాలు అనవసరంగా బలవడం అమ్మ(పరమేశ్వరి/జగజ్జనని)కి ఇష్టంలేదు. అందరం ఆమె పిల్లలమే. కాబట్టే అమ్మ మనందరికోసం భూమి మీదకు అనేకమార్లు అనేక రూపాలలో వచ్చింది.

.మన కోసం ఆ జగన్మాత ఊరి పొలిమేరలో గ్రామదేవతగా కూర్చుంది. సంవత్సరమంతా ఎండకు ఎండి, వానకు తడిసి, ఎముకలు కొరికే చలిలో కూడా ఆ శక్తి మనలని, మన గ్రామాల్ని రక్షిస్తూనే ఉంది. ఆమెకు ఏ విధంగానైన సాయం చేయగలమా? అది అసాధ్యం. ధనం ఇద్దామనుకుంటే ఆవిడకు డబ్బు అవసరమే లేదు. అందరికి లక్ష్మీదేవి రూపంలో తానే ధనం తానేఇస్తుంది. మరి గ్రామదేవతకు కృతజ్ఞతలు చెప్పడం ఏలా? అన్నిటిని మనకు ప్రసాదించగల ఆ దివ్యశక్తికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవడంలో భాగమే ప్రతి ఏటా నిర్వహించే జాతరలు, బోనాలు, ఉత్సవాలు మొదలైనవి. ఆ సమయాల్లో మొత్తం ఊరు ఊరంతా ఏకమై తరిలివెళతారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!