పూరీజగన్నాథ స్వామి....

పూరీజగన్నాథ స్వామికి సంబంధించినటువంటి పురాణాలలో క్షేత్ర చరిత్రలలో ఒక అద్భుతమైన విషయం ఉన్నది. ఒకప్పుడు కర్ణాటక దేశానికి చెందినటువంటి ఒక మహాగణపతి భక్తుడు శ్రీక్షేత్రానికి వెళ్ళాడు. శ్రీక్షేత్రం అంటే పూరీ. వాళ్ళకి భేదం లేదు. ఏ భక్తులమైనా ఏ దేవతా క్షేత్రానికైనా వెళతాం కదా! భేదం లేదు కానీ ఇష్టం గణపతి అంటే. విష్ణు క్షేత్రమైన ఆ పూరీ క్షేత్రానికి వెళ్ళారట స్వామి దర్శనం కోసం. వెళ్ళి మనస్సులో గణపతిని ధ్యానిస్తున్నాడు. జగన్నాథ స్వామిని చూసి నమస్కారం చేస్తూండగా ఆ జగన్నాథుడు గణపతిగా కనపడి తొండం చాచి అతనిని చుట్టి తనలోపలికి లీనం చేసుకున్నాడట. ఇప్పటికీ దానికి తార్కాణంగా దానికి కథ చెప్పడమే కాకుండా జ్యేష్ఠ శుద్ధ పాడ్యమినాడు స్వామి వారికి గణపతి అవతారం వేస్తారు జగన్నాథ స్వామికి. గణపతి ముఖం పెట్టి వేస్తారు. దీనినిబట్టి గణపతికీ, విష్ణువుకూ వాళ్ళు అభేదాన్ని పాటిస్తూ అది వాళ్ళు తరువాత జరుపబోయే రథయాత్రకి నెలముందు చేస్తారీపని. అదంతా నిర్విఘ్నంగా జరగడం కోసం విష్ణు స్వరూపుడైన గణపతి, గణపతి స్వరూపుడైన విష్ణువు మాకు సహకరించవయ్యా అని ప్రార్థన చేస్తారు. అప్పుడు స్వామికి నేత్రాలను ప్రక్షాళన చేయడం (కన్ను కడగడం అంటారక్కడ) చేసి అవతారం వేసి స్వామిని కొట్లో పెడతారు అని చీకటి కొట్లో పెట్టి తలుపువేస్తారు. మళ్ళీ రథయాత్రకు పూర్వకాలంలో తీయడం జరుగుతుంది. ఇదంతా అక్కడ జరిగే ఆచారం. గణపతి విష్ణువు స్వరూపం అని తెలిశాక శుక్లాంబరధరం విష్ణుం మరింత స్పష్టంగా మనకి అర్థమౌతుంది.

ఇలా బ్రహ్మరుద్రవిష్ణు గణాలకి పతియైన కారణంగా స్వామివారికి గణేశుడని పేరిచ్చారు. — with Samavedam Shanmukha Sarma.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!