శబ్ద చమత్కారం !

శబ్ద చమత్కారం !

(ఆచార్య చొప్పకట్ల సత్యనారయణగారు.)

.

సాహిత్య క్షేత్రంలో విహరిస్తూ ఉంటే యెన్ని వింతలు, విడ్డూరాలో! 

అవి మనం ఊహించలేం.అది అంతే ! కవుల ప్రతిభ! దక్షిణాంధ్ర యుగంలో

మేటి చమత్కార ప్రయోగంలో ఘనాపాటి, చేమకూర వేంకట కవి 

యెంత చమత్కారాన్ని రంగరించాడో యీపద్యంలో చిత్తగించండి!

.

ఉ: చిత్తజుఁ డల్గి తూపు మొనఁ జేసిన జేయగనిమ్ము ; పైధ్వజం 

బెత్తిన నెత్తనిమ్ము ; వచియించెద కల్గిన మాట గట్టిగా , 

నత్తరళాయతేక్షణ ,కటాక్ష ,విలాస, రస ప్రవాహముల్ 

కుత్తుకబంటి తామరలకున్ ;ఁదలముల్కలు గండుమీలకున్;

.

సుభద్ర సోయగాన్నిఃవర్ణించే సందర్భం . ఆమెజగదేక సుందరి , ఆమెకళ్ళు విరసిన కమలాలు, సొరచేపల వటివి, అనిచెప్ప వలసినదానికి పెద్ద నేపధ్యాన్ని కల్పిస్తున్నాడు వెంకన్నగారు.

.

" ఈమాట చెపితే మన్మధుడు అలుక బూని నాపై బాణంయెక్కు పెడతాడేమో? నామీద యుధ్ధాన్నిప్రకటిస్తూ, తనరధంమీదనున్నజండా నెగరేస్తాడేమో? యేమైనా గానీ ఉన్నమాట యేదో అది అనేస్తా! ఆచంచల నేత్ర చూపులు ఆచూపులలోని రసప్రవాహములు, తామరలకు కుత్తుక బంటియౌతున్నాయి. సొరచేపలకు తలముల్క లౌతున్నాయి" అంటాడు.

.

తామరపూ లెప్పుడూ పీక వరకూ నీీళ్ళలోనేఉంటాయి.

అవిఅలాఉండటానికి కారణం కోపమట! యెవరిమీద?సుభద్ర కన్నిలపై, 

( తామరలకన్నా అందంగాఉన్నాయనిచెప్పటం) 

యిక సొరచేపలకు తలముల్క లౌతున్నాయట! చేపలు నీటిలో మునిగే ఉంటాయి. దానినేకవి, సుభద్ర కనులను పోలలేక, సిగ్గుతో నీళ్ళలో తలదాచుకుంటున్నాయట!

.

మరి యీవిధంగా తన పరివారాన్ని గురించి చెపితే యెవరికైనా కోపంవస్తుందిగదా! కోపంవస్తే పరిణామం దాడిచేస్తారు. అంటే యుధ్ధానికి రావడం. వచ్చేవారు రధంమీద జండాయెగరేస్తారు. యీయనృమీనాంకుడేగదా! యికనేం నాపరివారంగొప్పదనిచెప్పటమేగదా! యికపోతే యుధ్ధంలో బాణప్రయోగం ఉంటుంది. ఉన్నదిగదాఅరవిదం అదేనండీ పద్మం.దాన్నే వింటికి తొడగవలసి యుంటుంది. ఆవి ధంగా రెటిపగ తీర్చినట్లేగదా!

( ఆమెచూపులు మన్మధబాణాలే - ఆనెక్రీగంటి చూపులు మన్మధ ధవజారోహణమే! యనిభావం)

యిక మీనాలు ప్రవాహంలోనే ఉంటాయి, పద్మాలేమో రసం- జలం లోనేకదా ఉండేది. మొత్తానికి ఆమెవాలుచూపులు శృంగార రసప్రవాహాలు, మన్మధబాణాలు. అనికవిగారి యభిప్రాయం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!