ఓ వెండ్రుక కట్టి కొండను లాగుతాము. వస్తే కొండ వస్తుంది, రాకపోతే వెండ్రుక పోతుంది. అంతే కదా !

గన్నవరపు నరసింహమూర్తి. ఉవాచ !
.
మానవప్రయత్నము చాలా ముఖ్యము.
ఏ పనినీ కష్టతరమని ప్రయత్నించకుండా వదిలివేయ కూడదు.
ఓ వెండ్రుక కట్టి కొండను లాగుతాము. వస్తే కొండ వస్తుంది,
రాకపోతే వెండ్రుక పోతుంది. అంతే కదా !
.
కొండను వెండ్రుక లాగిన
గొండే రాగలదు, కాక కొండకుఁ బోవున్
గొండల నెన్నో .................................లాగగ
గుండుగఁ దల నున్న నయ్యె ! గుణనిధులారా !!!
.
మరల నిదే ప్రశ్న, ఒకప్పుడు ఒత్తుగా జుట్టుండేది ,
ఏమయింది యని. మరి నా బట్టతలకు కారణము తెలుపుకొన్నా గదా ! 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!