తిట్టు' కవిత్వం కాదు .. 'విట్టు' కవిత్వమే!!


తిట్టు' కవిత్వం కాదు .. 'విట్టు' కవిత్వమే!!
.
(శ్రీ చల్లా రామలింగశర్మ గారి అద్బుత సేకరణ.)
.
"ఆంధ్ర రత్న" బిరుదు కల దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య ప్రముఖ స్వాతంత్ర్య
సమర యోధులు. కోదండ రామయ్య, సీతమ్మ దంపతులకు పుణ్య ఫలముగా పుట్టిన గోపాల క్రిష్ణయ్య "రామ దండు" సమర దళమును నిర్మించి,
స్వాతంత్ర్య పోరాటములో తన క్రియా శీలతను నిరూపించు కొనిన ధీశాలి. అంతేకాదు! ఆయన గాయకుడు, రచయిత కూడా!
ఆ దుగ్గిరాల వారి రచనలలో ఒక వ్యంగ్య సీస పద్యమును చూడండి.
.
సీ. కొండెంకటప్పన్న గుండు సున్న గదన్న - గోపాల కిట్టాయి కొక్కిరాయి
.
టంగుటూరు ప్రకాశ మింగిలీసు పిశాచి - నాగేశ్వరుడు వట్టి నాగ జెముడు
.
పట్టాభి సీతన్న తుట్టె పురుగు గదన్న - ఉన్నవ లచ్చుమన్న దున్నపోతు
.
గొల్ల పూడ్వరన్న కళ్ళు లేని కబోది - బులుసు సాంబడు వట్టి పుట్టు కుంక
.
అయ్యదేవర గాడు పెయ్య నాకుడు గాడు - అయ్యంకి రమణయ్య దయ్యమయ్య
.
డాక్టర్ సుబ్రహ్మణ్య మాక్టింగ్ పులిష్టాపు - దువ్వూరి సుబ్బమ్మ దృష్టి బొమ్మ
.
.
తే.అనుచు పల్కుదు రాంధ్రుల నవని యందు -
గాంధి శ్రేష్ఠుని మతములో గలిసి నపుడు
తపము లేనిదె యెన్నరే నెపము లెల్ల -
రామ నగరీ నరేంద్ర! శ్రీ రామచంద్ర!
.
ఈ శతక పద్యము తొలి భాగము చదవగానే "ఇది తిట్టు కవిత్వము కామోసు!" అని అనిపిస్తుంది.
"గాంధి మహాత్ముని"మతములో చేరినపుడు అందరూ అలాగ అనుకొన్నారనగానే,ఆ రచనలోని చమత్కారము చదువరికి నవ్వు తెప్పిస్తుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!