శరదృతువులో ఆరాధించే ‘శక్తి’ స్వరూపిని


శరదృతువులో ఆరాధించే ‘శక్తి’ స్వరూపిని
.
చంద్రుడు వెనె్నలను బాగా ప్రసరింపచేసే ఋతువు- శరదృతువు.
ఆశ్వయుజ కార్తీక మాసములు శరదృతువు.
మనస్సును నిర్మలంగా ఉంచుకోవటానికి మహర్షులు చెప్పిన మార్గాల్లో
‘‘శక్తి ఆరాధన’’ ముఖ్యమైనది.
ఎందుకంటే, జ్యోతిష శాస్తర్రీత్యా, చంద్రుడంటే తల్లి, జగన్మాత.
పూర్ణమైన చైతన్య స్వరూపిణి. పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, లలిత, దుర్గ, మహిషాసుర మర్ధిని,
శ్రీ రాజరాజేశ్వరి, కాత్యాయని, కామాక్షి, కల్యాణి-
ఏ పేరుతో పిలిచినా, ఆరాధించినా, మూల శక్తి- ఒక్కటే. అదే చిచ్ఛక్తి.
విశ్వమంతా చిచ్ఛక్తి విలాసం. అన్ని నామాలలోనూ ప్రధానంగా ఉండేది
‘శక్తి’. అగ్నికి వేడి శక్తి, సూర్యునికి వెలుగు శక్తి, చంద్రునికి వెనె్నల శక్తి, యిలా ప్రతి పదార్థంలోనూ ‘శక్తి’ ఉంటుంది.
అంతేకాదు, ప్రతి పదంలోనూ ఉండే శక్తి- ‘అర్థం’.
శక్తితో కూడిన వాడు- పరమేశ్వరుడు.
పరమేశ్వరికి, పరమేశ్వరునికి భేదం లేదు.
శ్వనీ నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది ఆశ్వయుజ మాసం. దీనినే ‘ఇష’ మాసమని శ్రుతి వివరించింది. అశ్వనీ నక్షత్రానికి ‘అశ్వనీ’ దేవతలు అధి దేవతలు. అందుకే ‘‘అశ్వినో ఆశ్వయుజౌ’’ అని చెప్పబడింది. ఈ అశ్వనీ దేవతలు- సూర్యపుత్రులు, సూర్యతేజస్సు కలవారు. ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ‘త్వష్ట’ అనే నామంతో ఉంటాడని, సూర్య ‘శక్తి’ తన సృష్టిలోగల జీవుల కష్టనష్టములను తగ్గిస్తుందని పేర్కొనబడింది
...
ఈ విధంగానే, పూర్ణిమ కృత్తికా నక్షత్రంలో వచ్చేది- కార్తీక మాసం. దీనే్న ‘ఊర్జ’ మాసమంటారు. కృత్తికా నక్షత్రానికి, అగ్ని అధిదేవత. ఈ నెలలో సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటాడు. కార్తీక మాసంలో సూర్యుడు ‘విష్ణు’ నామకుడై పిలువబడతాడు. ‘‘వ్యాప్నోతీతి విష్ణుః’’ అంతటను వ్యాపించుటవలన, సూర్యుడు విష్ణునామకుడైనాడు. సూర్యుడు, తన తేజస్సును అంతటను వ్యాపింపచేసి, ధాన్యాది సస్యముల గింజలలో డొప్పల ఆకారముగా ఉన్నపుడు, చంద్ర కిరణముల నుండి పడిన అమృతాహారమును గట్టిపరచి, ధాన్యాదులను గింజలుగా ఏర్పరచి, ఆహారముగా జీవులకు అందించే ‘శక్తి’వంతుడు, ఆదిత్యుడు.
అందుకే ‘‘ఇషశ్చోర్జ శారదావృతూ’’ అన్నది వేదం. ఈ ఋతువునందే రాజులు శక్తివంతులై యుద్ధములకు వెళ్ళేవారని ఇతిహాస పురాణములు పేర్కొన్నాయి. అది ధర్మయుద్ధము. శరదృతువులో ‘‘శరత్’’ పదము ‘‘శాృ- హింసాయామ్’’ అనే ధాతువునుండి ఏర్పడింది. అంటే, మనిషిలో ఇంద్రియ నిగ్రహం లేక, కామక్రోధాది అరిషడ్వర్గ శతృవుల్ని జయించలేక, హింసా ప్రవృత్తి ఎక్కువ అవుతుంది. మానవుడు తనలో వున్న- పశు, రాక్షస ప్రవృత్తిని అణచికొని, దైవీ శక్తిని పెంపొందించుకోవాలని హెచ్చరిస్తుంది, శరదృతువులో దేవీ శరన్నవరాత్రి
వ్రత మహోత్సవములు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!