శ్రీ కొనకళ్ళ వెంకటరత్నం.... గారి బంగారి మావ పాట!

శ్రీ కొనకళ్ళ వెంకటరత్నం.... గారి బంగారి మావ పా




//గోదారి గట్టంట //
గోదారి గట్టంట పోదారి మామా!
సిగ్గులో వలపేటో భగ్గుమన్నాది..
పట్న వాసపు గాలి పడదస్సలే మనకు;
మసక వెన్నెల లింకుఇసక తిన్నెల కేసి.//గోదారి //
తొలి వాన జల్లుకో,వలపు కౌగిళ్ళకో
పుల్కరింతలు వొడల్ పొర్లి పోయినవోయి //గోదారి//
దారిలో చందురుడుఓర చూపులు మాని
కారుమబ్బుల వెన్క కను మూసినాడులే //గోదారి //
వాన లో మెరుగు పూల్ సోనలై దిగజార,
చెదరి, కొబ్బరి తోట చేసైగ రమ్మంది //గోదారి //x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!