తెలుగు వ్యుత్పత్తి.!

Sri Charan Raj Pasupuleti..గారిఅమూల్యమైన పరిశోధన...
తెలుగు వ్యుత్పత్తి.!

.

1. తెలుగు వ్యుత్పత్తి. తెల్ అన్న ధాతువుకు తెలుపు, తేట(clear) 

ఇక..తెల+ఉంగు లోని ఉంగు... బహువచన ప్రత్యాయం మరియూ గౌరవ చిహ్నం.

కరినాడు అంటే నల్లనిభూములే ఎందుకు కావాలి... పడమర దిశలోని దేశం కాబట్టి. 

సూర్యాస్తమ సూచిగా (సూర్యుడు) చీకటినిచ్చే దేశం అయ్యుండొచ్చుకూడ.. 

అట్లే తెలినాడు(అక్కడి వారు తెలుంగులు) అంటే సూర్యోధయభూమి అయ్యుంటుంది. 

2. తేల్ నది వల్ల తెలుంగు వస్తే కళింగుకి అర్థం ఇవ్వటం కష్టం. కళింగ కళ్=రాయి; పర్వతదేశం కాబట్టి ఆపేరువచ్చివుంటుంది. ఉత్కళం (ఉత్ కళింగం = ఎగువ కళింగం) అంటే దిగువ ఉన్నది తె కళింగం; అంటే దక్షణ కళింగం. ఆనాక వలస వచ్చిన ఓంఢ్రజాతీయల వల్ల ఒడిస్స అయ్యింది. అంటే జాతితః ఇప్పుడున్న ఒరిస్సవారు కళింగులు కారు. వారు తెలుగువారు అయ్యివుండొచ్చు.. లేకపోతే ఇంత ఘనచరిత్రనూ ఎందుకొదులుకుంటారు..తెలుగువారు ఆంధ్రాని వదలనట్లు. ఇవికాకుండా శైవానికి తెలుగునాడుకు గల అవినాభావసంబంధం. శ్రీశైలం మహేంద్రగిరుల ప్రాచీనత.. అయినా కూడా దేశీయంగా నన్నయ్యవరకు సాహిత్యం రాకపోవటానికి కారణాలు పదకవితలను ముదిలంజలుగా చూడటం వల్లే అని పాల్కూరి పలుకులను ప్రస్తావించటం. తమిళవారిలా పాటను త్రివిధ కవితా ప్రక్రియలా ఎంచి గంథస్థం చేయకపోవటం... ఇలా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుండి. మురుగ తెలుగు జాతీయుడని.. తెలుగు వాడని ఐరావతం గారు వివిధ సభలలో పేర్కొన్న విషయాన్ని.. ఆయన శూలాయుధం వల్ల సత్తువేల్ అయ్యాడని సత్తు అంటే లోహం. సత్తు దేశ్యమని.. దానికి ఉదాహర్ణగా... సతికేస్తారు, సతికేయటం అంటే కొట్టటంమాత్రమే కాదు సూటిపోటి మాటలతో పొడుస్తూ కొట్టడం.. దాన్నుంచి సతాయించు అనే నేటి మాటవరకు అదే అర్థం వస్తోంది అని చెప్పటం.. ఇది అంతా కరీంనగరంలో దొరిక పులోమావి(మురుగన్ పేరు = రెళ్ళుగడ్డిలో పుట్టిన వాడు దేశ్యం) 'అరహనకు వాహిట్టీ..మగనుకు' వెండినాణేల శాసనభాష తెలుగని వివరించే ప్రయత్నంలో వస్తుంది. 'కు' షష్టివిభక్తి ప్రత్యాయంగా తెలుగులో మాత్రమే కనిపిస్తుంది... 

ఇప్పుడు నేను రాసినట్లే పుస్తకమంతా అస్తవ్యస్తంగా ఉన్నా... చాలా విషయాలు మనజ్ఞాపకాల్లో ఉంది. వీటిని పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్తూవుంటాయి..గతంలో మీరు తూర్పుకనుమలుకు వేంగి,వేంకట,వేంగడం,వెంగళప్పకు మధ్య సంబంధం మీద అనుమానంలా...... వీటిని వివరంచటంలో విఫలం అయినా పూర్తిగా మాత్రం కాదు...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!