Posts

Showing posts from March, 2016

మగవాడు నల్ల త్రాచు. ఆడది.కోపం వస్తే బుస కొట్టే నాగు పాము.

Image
మగవాడు నల్లత్రాచు !  తాళ్ళపాక తిమ్మక్క తొలి కవయిత్రి.  రాయగా రాయగా తొలి కావ్యం ''సుభద్రా కల్యాణం'' రాసింది. రాసి, . ''పొలతి! నమ్మగరాదు పురుషులనెపుడు/పలురీతి కృష్ణసర్పములైయుండ్రు''అని . మగవారిని నిం దించింది. (కృష్ణసర్పం అంటే నల్లత్రాచు)..  రాదే సఖి నమ్మ రాదే సఖి .. మగవారని ఇల నమ్మ రాదే సఖి ... అన్న సత్యభామ పాట గుర్తు చేస్తుంది... మగవాడు నల్ల త్రాచు.  ఆడది.కోపం వస్తే బుస కొట్టే నాగు పాము.

జొడెడ్ల బండి !

Image
మన పెద్దాలు భార్యాభర్త లా సంసారా భధ్యత లు ను  జొడెడ్ల బండి తో పోల్చరూ..... ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు .... ఒకరి కి ఒకరు కట్టి కాలే వరకు ....వెనుక ముందు అంతే ... పాలు నుండీ పెరుగు తరువాత మజ్జిక ,వెన్న నుండి నేయి.... మన జీవితం కుడా ఈ చిన్న కధ లోనే ఇమిడి ఉంది నిశితముగా పరిశీలిస్తే .. ఎలా అంటే మగవాడు మరిగిన పాలు చల్లరి గొరువెచ్చని ....  పాలు లాంటి మగని కి తోడు అంటు మజ్జిక మగువ ను చేరిస్తే  చక్కటి చిక్కటి గడ్డ పెరుగు లాంటి మంచి సంసారం మొదలైంది  ఈ చక్కని చిక్కని సంసారం చిలికితేనే మజ్జిక ,వెన్న అనబడే చిట్టి పిల్లాలు  ,సిరి సంపదలు .ఆ అలు మగలు కరిగి .. మధుర మైన నేతి గా మారి  వారి ఆ నేతి తో పిల్లాలకూ బంగారూ భవిష్యత్తు తీర్చి దిద్ది ..... కడకు కాటి కి ఆవిరి అయి ఈ లోకం నుండీ ఆవిరి గాల్లో కలిసి పోయి  ఎగసి పోతారూ..... చూసారా...తరిచి..తెరచి చూస్తే .... జీవితం ఎంతా చిన్నాదో ....ఏన్ని అరాటాలు ...ఎన్ని ...పోరాటాలో....

దైవం చేసే పని....బామ్మ చెప్పిన కధ.!

Image
దైవం చేసే పని....బామ్మ చెప్పిన కధ.! పూర్వం ఓ దేశంలో ఒక రాజుగారికో సందేహం వచ్చింది. వెంటనే తన మంత్రిని పిలిచి "అమాత్యా! నా సైనికులు దేశాన్ని కాపాడుతున్నారు. మీరు మంత్రులుగా నాకు సలహాలు ఇస్తున్నారు. వర్తకులు వర్తకం చేస్తున్నారు. అధ్యాపకులు పాఠాలు చెపుతున్నారు. ఇలా ప్రతివ్యక్తి తనకి కేటాయించిన పనిని చేస్తున్నాడు. నా సందేహం ఏమిటంటే, "సృష్టికర్త అయిన ఈ దైవం చేసే ప్రధానమైనపని ఏమిటి?" అని. రాజుగారికి వచ్చిన సందేహాన్ని తీర్చటానికి మంత్రివర్యులు "రాజగురువు"ను పిలిపించి రాజుగారి సందేహము తీర్చమని అడిగాడు. రాజగురువు వెంటనే సమాధానము చెప్పక ఓ వారము రోజులు గడువు తీసుకుని బయటపడ్డాడు. కాని, ఆరురోజులయినా రాజుగారి సందేహానికి సరైన సమాధానము స్పురించక, ఆలోచిస్తూ, నగరము బయట అశాంతిగా తిరుగుతున్నాడు. అక్కడ రాజగురువును ఓ ఆవులు కాచుకునే కుర్రవాడు చూచి " స్వామీ! మీరు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. కారణం తెలుసుకోవచ్చా?" అని నమస్కారము చేసి మరీ అడిగాడు. ఆ కుర్రవాడు వినయము చూసి ముగ్ధుడయి, ఆ రాజగురువు తన సమస్యకు అతనివల్ల సమాధానము బహుశ: భగవంతుడు పంపించి వుంటాడని తలంచి, తన సమస్యన...

శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.

Image
శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు. శ్రీరామ ప్రవర:- చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.  వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,  నాభాగ మహారాజ వర్మణో నప్త్రే... అజ మహారాజ వర్మణః పౌత్రాయ... దశరథ మహారాజ వర్మణః పుత్రాయ... శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ. సీతాదేవి ప్రవర:- చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం... స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం... హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం... జనక మహారాజ వర్మణః పుత్రీం... సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం... ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది. మా అత్మీయులైన మీకందరికీ... శ్రీరామనవమి శుభాకాంక్షలు.

వలపు తేట !

Image
వలపు తేట ! అనసూయ ,ప్రియంవద లు ఒకరికి మించిన వారిన్కొకరు , శకుంతల ప్రియ సఖులు.  శ.శకుంతలా దుష్యంతుల ఆకార వికారాలను త్రుటి లో గ్రహించారు  వారిద్దరూ .వలపు ల జ్వాల రగుల్తోందని తెలుసు కొన్నారు .  .  శకుంతల తో వారు ”సఖీ శకున్తలే !యద్యత్రా దయ తాతః సన్నిహితో భవేత్ ”అన్నారు . ”నాన్న గారే వుంటే ఏం చేసే వారో ఇప్పుడు ”ఇది కదాగామనాన్ని వేగం చేసే మాట . అంటే తండ్రి గారు చేయాల్సిన పని నువ్వే చేయాలి అని చెప్పకుండా చెప్పటం .ఆమె లోపలి భావాన్ని వ్యక్తీకరించా టానికి తగిన మాట కూడా . .  ఇద్దరి హృదయ భావాలను వెలికి తీసి,వలపు ను నాటి ,ప్రోది చేసే మాట . .  శకుంతల కు చిరు కోపం వచ్చింది . ”వుంటే ఏం చేసే వారు “?అంది బుంగ మూతి పెట్టి . సఖులు దేవాంతకులు కదా వెంటనే అందుకొన్నారు .’ ఇదం జీవిత సర్వస్వేనా వ్యతి దారో క్రుతార్దీ కరిష్యతి ”అన్నారు . .  స్త్రీ సహజ మైన మాటలు ఇవి శకుంతలకు వచ్చిన కోపానికి ”మేమేం చేశామమ్మా అంత కోపం ”అన్నట్లు వుంది. ఇంతకీ వాళ్ళ మాటల్లోని అర్ధం తెలుసోవాలి .” .  నాన్న గారే వుంటే ,తమ జీవిత సర్వస్వాన్ని - అంటే శకు...

Srimanthudu Songs - Buli Buli Buggala - ANR - Jamuna

Image
ఎప్పటి బుగ్గలో .. ఇప్పటికి  మెరుస్తో బులి బులి ఎర్రని బుగ్గలదాన… బులి బులి ఎర్రని బుగ్గలదాన… చెంపకు చారెడు కన్నుల దాన మరచి పోయవా నువ్వే మారిపొయవా… ఆయ్యొ… మరచి పోయవా నువ్వే మారి పోయవా…

చీర !

Image
చీర ! .  చీర అంటే వస్త్రము. వాడుకలో స్త్రీలు మాత్రం కట్టుకునే బట్టకు పర్యాయపదంగా చీర వాడబడుతూంది.  భారతదేశంలో స్త్రీలు ధరించే దుస్తులలో ముఖ్యమైనది చీర. చీర అత్యంత పొడవైన వస్త్రము; ఇది నాలుగు నుండి తొమ్మిది మీటర్లుంటుంది. చీరను ఎక్కువమంది నడుంచుట్టు కట్టుకొని ఒక చివర భుజం మీదనుండి వెనుకకు వేసుకుంటారు. చీరలోపల క్రిందభాగంలో లంగాను పైభాగంలో రవికె ధరించడం  సరైన పద్ధతి. .  చరిత్రకు పూర్వం సింధూ లోయ ప్రాంతపు స్త్రీలు ప్రత్తి నూలుతో నేయబడిన బట్టలు ధరించేవారు. ప్రత్తి మరియు పట్టుబట్టల గురించి వేదాలలోను, రామాయణ, మహాభారత కథలలోనూ కూడా చెప్పబడింది. చంద్రగుప్తుని కాలంలో పాటలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు భారత స్త్రీలు ధరించిన వస్త్రాలను గురించి "బంగారు జరీతో విలువైన రాళ్ళు పొదగబడినవి" అని వ్రాశాడు. ప్రాచీన కాలపు చిత్రాలలోను, రాతి విగ్రహాలలోను పలచని చీర మడతలు సూచించబడ్డాయి. అజంతా గుహల కుడ్య చిత్రాలలో ప్రాచీన భారతదేశపు నేతగాళ్ళ ప్రతిభ ప్రదర్శింపబడుతూంది. సమకాలీన వాంగ్మయంలో వివరించబడిన చీర్ల పేర్లను పరిశీలిస్తే ఆనాటి హస్తకళా నైపుణ్యం విదితమవుతుంది. ఆ...

పసుపు తాడు ముడులేత్తే ఆడదాయెరా!

Image
పలుపు తాడు మెడకేత్తే పాడి ఆవురా పసుపు తాడు ముడులేత్తే ఆడదాయెరా , కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది . కడుపుకోత కోసినా అది మనిషికే జన్మ ఇత్తాది . బొడ్డుపేగు తెగిపడ్డ రోజు తలుసుకో గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో!

మానస సంచర రే ||

Image
సదాశివ బహ్రేంద్ర ఒక యోగి, కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు,  అద్వైత తత్వవేత్త. 18 శతాబ్దంలో తమిళనాడులోని కుంభకోణం వద్ద జీవించారు. ప్రధానంగా సంస్కృతంలో ఆయన రచనలు ఉన్నాయి.  ఈ స్వరసృష్టిలోని ఇప్పటికి కొన్ని మాత్రమే మిగిలి ఉన్నా, వాటిని  కర్ణాటక సంగీతంలో అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు అందులో ఒకటి మానస సంచరరే... మానస సంచరరే బ్రహ్మణి || మానస సంచర రే || మదశిఖిపించాలంకృతచికురే | మహనీయకపోలవిజితముకురే || శ్రీరమణీకుచదుర్గవిహారే | సేవక జనమందిర మందారే || పరమహంశముఖచ్చంద్రచకోరే | పరిపూరితమురళీరవధారే || x

సప్తసముద్రాలు దాటి వచ్చిన వాడు ఇంటి ముందు నీటి గుంట లో పడ్డాడట. !

Image
సప్తసముద్రాలు దాటి వచ్చిన వాడు ఇంటి ముందు నీటి గుంట లో పడ్డాడట. ! . (గల్పిక...కృష్ణప్రియ..) . సాయంత్రం లాప్ టాప్ షాపు కట్టేసి ఇక కాస్త సాయంత్రపు నడక కి బయల్దేరదామని లేచి అరడుగు ఎత్తు నుంచి దబ్బున కూలి పడి పాదం ఎముక విరగ్గొట్టుకున్నాను. ఓ రెండు గంటల్లో ఎక్స్ రే లూ, సిమెంట్ కట్టూ అన్నీ అయి, మళ్లీ అదే సోఫా లోకి వచ్చి పడ్డాను. మా వారూ, పిల్లలూ కూర్చో పెట్టి మంచి నీళ్ల దగ్గర్నించీ చేతికిచ్చి .. ‘ఆహా.. ఇంత రాజ భోగం ఉంటుందని తెలిస్తే ..ఎప్పుడో పడేదాన్ని..కనీసం కాలు బెణికిందనో, చేయి గుంజిందనో చెప్పైనా ఎన్ని సేవలు చేయించుకోవడం మిస్సయ్యానో ‘  అని ఓ సారి నిట్టూర్చాకా అందరికీ మరి ఫోన్ చేసి చెప్దామా? అని ఉత్సాహం గా ఫోన్ చేతిలోకి తీసుకుని మొదలు పెట్టాను. . నాకొచ్చిన సలహాలు.. అసలెందుకు పడ్డావు? కృష్ణా.. నీకు దూకుడెక్కువ.. ఇంక నెమ్మది గా నడవటం నేర్చుకో..!!! (నేను నడుస్తూ పడలేదే?) వయసు పెరుగుతున్నప్పుడు ఎముకలు బిరుసు బారిపోయి ఉంటాయి.. జాగ్రత్త గా ఉండాలి.. (ఓకే. అయితే ఈసారి ఆరడుగు ఎత్తు కూడా ఎక్కకుండా జాగ్రత్త గా ఉండాలి..) పచ్చళ్లూ, పొడులూ తింటావు.. టీ ఎక్కువ గా తాగుతావు. త...

మా సావిత్రమ్మ..!

Image
మా సావిత్రమ్మ..!  . “నవరసాలనూ రెండు నేత్రాలలో నింపుకున్న బంగారు బొమ్మ.., మా సావిత్రమ్మ..! నటనకు ప్రాణం పోస్తే సావిత్రి గారిలా ఉంటుంది. తెలుగుదనం తల ఎత్తి చూస్తే సావిత్రి గారి లాగే ఉంటుంది.జాలి, దయ, కరుణ అనే మూడింటికి త్రివేణి సంగమం మా సావిత్రమ్మ…” ఇప్పటికీ తెలుగు వారంతా అనుకునే మాటలు ఇవే తల్లీ!అప్పట్లో సావిత్రి గారి చీరకట్టు, వాణిశ్రీ కొప్పు, జమున గారి కాటుక లాంటివి బాగా ప్రఖ్యాతి గాంచిన మాటలు… కాని ఇప్పుడు ఆ చీరకట్టు చాలా బరువైపోయిందటమ్మా… బికినీలకి ఇచ్చే ప్రాధాన్యత నేటి కధానాయికలు చీరకట్టు కి ఇవ్వడం లేదు తల్లీ…ముద్దుగా బొద్దుగా ఉంటూనే మీరు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు, అలరించారు. ఈ రోజుల్లో తారలదరూ జీరో సైజ్ మోజులో పడి మరీ కరువు ప్రాంతపువాసుల్లా తయారౌతున్నారు. బాగా కొవ్వు పెరిగిపోయినా కూడా లైపోసెక్షన్ పేరుతో దాన్ని కరిగించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అతివ్రుష్టి, అణావ్రుష్టి అన్నట్టు ఉందమ్మా వీళ్ళ వరస… వీళ్ళకి మీలా క్రమబద్ధమైన అలవాట్లు కర్ర పుచ్చుకుని నేర్పడానికైనా ఒక్కసారి రావమ్మా…! x

భారత క్రికెట్ జట్టు అష్టోత్తర నామావళి!

Image
భారత క్రికెట్ జట్టు అష్టోత్తర నామావళి ఈ రోజు అంటే 27 మార్చ్ 2016 న మొహాలీ లో భారత క్రికెట్ విజయం కోసం ఈ అష్టోత్తర పఠించండి. ఓం ధోన్యై నమః ఓం విరాట్కోహ్లై నమః ఓం అశ్వన్యైనమః ఓం రోహిత్యైనమః ఓం ధావన్యైనమః ఓం రైన్యైనమః ఓం యువరాజ్యైనమః ఓం బుమ్రాఐ నమః ఓం జడేజాయైనమః ఓం నెహ్రాయైనమః ఓం పాండ్యైనమః ఓం హర్భజన్యై నమః ఓం సామ్యై నమః ఓం నెగ్యైనమః ఓం రాహాన్యైనమః ఓం ధర్మసైన్యాయ నమః ఓం ఈర్మాసైయ్యాయ నమః ఓం ఇల్లింగ్వర్త్యైనమః ఇతి క్రికెట్ అష్టోత్తర నామావళి సమాప్తః (చివరి ముగ్గురు మన మ్యాచ్ కి ఇద్దరు ఫీల్డ్ ఎంపైర్లు, మరొకరు టీవీ ఎంపైర్, వాళ్ళని కూడా ప్రార్ధించాలి కదా ! అది ఇష్టం లేనివారి కోసం మరో మూడు నామాలు జోడిస్తున్నాను) ఓం మొహాల్లీ పిచ్యై నమః ఓం క్రికెట్ కందుక్యై నమః ఓం సమతుల్య ఉష్టోగ్రత్యై నమః ఈ నామాలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో 108 సార్లు పఠిస్తారో వారి టీవీలో ఎప్పుడూ భారత క్రికెట్ టీము గెలిచినట్లు కనబడుగాకా !!

ధనుస్సు అంటే ప్రణవ నాదమయిన ఓంకారం ...దానిని విరవటం అంటే ఓం కారాన్ని విడగొట్టడం!

Image
ధనుస్సు అంటే ప్రణవ నాదమయిన ఓంకారం ...దానిని విరవటం  అంటే ఓం కారాన్ని విడగొట్టడం! . ..సీతా స్వయంవరం అప్పుడు శివధనస్సు ఎక్కుపెడితే ఎందుకు విరిగిపోతుంది? విరిగిపోతే అందఱూ (బాధపడాలి కానీ) ఎందుకు సంతోషిస్తారు? రాముడు అవతారపురుషుడు అని అందరికీ తెలిసినదే కదా! ఆయన ఏమి చేసినా ఒక మానవుడు ఎలా బ్రతకాలి తద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అని చెప్పడానికే చేశాడు. ఆయన ప్రతీ కదలికకీ అంతరార్థం, పరమార్థం ఉన్నాయి. అలానే శివధనుస్సు విషయానికి వస్తే….. అకార ఉకార మకారములు ప్రణవము, ప్రణవం ధనుహు, శరోహ్యాత్మ, బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేధ్ధవ్యం శరవత్ తన్మయో భవేత్ అన్నారు. అంటే…. అ, ఉ, మ కలిస్తేనే ప్రణవ నాదమయిన ఓం కారం వస్తుంది. ధనుస్సు (ప్రణవం) అంటే ఈ ఓంకారం అనమాట. శరము (బాణము) అంటే ఆత్మ. బాణముతో ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు కనిపించే లక్ష్యమే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనగా పరబ్రహ్మ లేదా పరమాత్మ. బాణాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా, చిత్త శుద్ధితో కొడితేనే లయమయ్యి లక్ష్యాన్ని చేరుతుంది. ఇది ధనుస్సు యొక్క అంతరార్థం. ఇక్కడ శివధనుస్సు ఆవిర్భావం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ శివధనుస్సు...

గులాబీని ముళ్ళుకూడా రక్షించలేవు!

Image
శ్రీ శ్రీ గారు అన్నట్లు--- విసిగిన ప్రాణుల పిలిచే దెవ్వరు? దుర్హతి, దుర్గతి, దుర్మతి, దుర్మృతి! "స్త్రీ ఒక మాట వల్ల, చూపు వల్లా పురుషునికి సందిచ్చిందా... ఇక అతని అధికారానికి, కోరికలకి, విన్నపాలకి అంతం ఉండదు. అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటినించి విముఖంగానే ఉండాలి... నిప్పు వలె ఉండాలి"------ చలం దుర్మోహితుఒళ్లు అందాన్ని నాశనం చేయాలనుకుంటే, గులాబీని ముళ్ళుకూడా రక్షించలేవు! ఇదే జీవితం నేర్పిన నీతి వాక్యం!!

భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవంగా చూసుకొంటూ.. నలుగురిలో చులకన కాకుండా... చూసుకొంటూ... జీవితాన్ని హ్యాపీగా కొనసాగించుకోవాలి.

Image
భార్య గాని, భర్త గానీ... తమ తమ ఆధిక్యతను ప్రదర్శించే సమయంలో యేదో ఒకటి అనేస్తూ వుంటారు. అలాంటి ప్రవర్తన వలన..... తన జీవిత భాగస్వామి యెదుటి వారి దృష్టిలో ఎంత లోకువ అవుతారో గమనించాలి. భార్యా భర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి. ఒకరి లోపాలను ఒకరు ఏకాంతంలో సరిదిద్దుకోవాలి భార్యా భర్తలన్నాక.. పాలూ నీళ్ళలా ఒకరికొకరు కలిసిపోవాలి.. అంతే గాని ఒకరి లోపాలను మరొకరు ఇతరుల ముందు ఎత్తిచూపడం ఎంతవరకు సమంజసం.... !  . సున్నితమైన విషయాలలో... ఇలాంటి సందర్భాలు... చిలికి చిలికి... గాలివానగా మారి, వారి జీవితాలలో తుఫానులు సృష్టించే అవకాశం వుంది... భర్త ఎంతటి అసమర్ధుడైనా. .... దానికి గోరంతలు కొండంతలు చేసి.... పొరుగు వారితో చెప్పటం మంచిదికాదు. భార్య తన కంటే తక్కువ అనే భావంతో నలుగురు ముందు వ్యంగ్యంగా మాట్లాడటం హర్షణీయం కాదు.భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవంగా చూసుకొంటూ.. నలుగురిలో చులకన కాకుండా... చూసుకొంటూ... జీవితాన్ని హ్యాపీగా కొనసాగించుకోవాలి.

ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి .!

Image
ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి .! . ఈ శరీరానికి ఒక్కటే ప్రయోజనం! ‘బోధన’ను బయలు పరచడం ఉపన్యాసాలు ఆపివేయడం తోటే ఈ శరీరం మరణిస్తుంది. - తనను తాను సంరక్షించుకోవాలనుకోవడం, మార్పులకు అవరోధం కలిగించాలనుకోవడం... మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఓ ఆసక్తి. జీవితంలో సరళమైన మార్పులు తీసుకువచ్చి మనసుకు వయసు రాకుండా చూసుకోవచ్చు. అందుకు విస్తృతమైన అవగాహన అవసరం. . "నా ప్రధాన లక్ష్యం ఒక్కటే_వ్యక్తి స్వేచ్చ .అన్ని భయాలనుండి,బంధాలనుండి మనిషిని విముక్తి చెయ్యాలి." నేను ఎవరికీ గురువును కాను నాకెవరు అనుచ రులు లేరు. . ఆయన ఏ మతానికి,ప్రాంతానికి,దేశానికి చెందకుండా ,ఏ సంస్థను స్థాపించకుండా ,ఏ తత్వాన్ని ప్రచారం చేయకుండా ప్రపంచమంతా తిరుగుతూ తూర్పు,పశ్చిమ దేశాల్లో ,అన్ని కాలాల్లోని తత్వవే త్తల్లో గొప్ప స్థానం సంపాదించుకున్నారు. . *ప్రకృతి సృష్టించిన ఈ అందమైన భూమిని,పర్యావరణాన్ని ,ఇందులో నివసిస్తున్న మానవులను రక్షించుకోవాలని పిలుపిచ్చారు. ఆయన బోధనల్లోని ముఖ్యాంశాలు. *సత్యానికి మార్గం ,పథం అంటూ ఏమీ లేదు. * అన్ని జీవనకళల్లోకి ధ్యానం ఉన్నతమైనది. *అసలైన విప్లవం ...

పోతనామాత్యుని కందము.!

Image
పోతనామాత్యుని కందము.! . ఓ యమ్మ! నీ కుమారుఁడు మా యిండ్లను బాలు పెరుగు మననీఁ డమ్మా! పోయెద మెక్కడి కైనను మా యన్నల సురభు లాన మంజులవాణీ! . ఓ యశోదమ్మ తల్లీ! నీ సుపుత్రుడు మా ఇళ్ళల్లో బాలుపెరుగు బతకనీయ డమ్మా. మెత్తని మాటల మామంచి దానివే కాని. సర్దిపుచ్చాలని చూడకు. మేం వినం. మా అన్న నందుల వారి గోవుల మీద ఒట్టు. ఈ వాడలో మేం ఉండలేం. ఊరు విడిచి పోతాం. మాకు మరో గతి లేదు."

పోతనామాత్యు ని శార్దూలం!

Image
పోతనామాత్యు ని శార్దూలం! -శా. "అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?  నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన దండింపవే." . భావము: " అమ్మా! మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్లాడినా చెప్పు.  ఇప్పుడే కదా పాలు తాగాను ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది. లేకపోతే నేనేమైనా అంత వెర్రివాడినా ఏమిటి మట్టి తినడానికి.  నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి చెప్తున్నారు అంతే. కావాలంటే  నా నోరు వాసన చూడు. నే చెప్పింది అబద్ధమైతే కొట్టుదుగానిలే.  వీళ్ళు చెప్పేమాటలు నమ్మెయ్యద్దు" అని చిన్నికృష్ణుడు, మట్టి ఎందుకు తింటున్నావని బెదిరిస్తున్న తల్లి యశోదమ్మకి చెప్పి నోరు తెరిచి చూపించాడు.

కల్పన! (కిన్నెరసాని పాటలు విశ్వనాథ సత్యనారాయణ)

Image
కల్పన! (కిన్నెరసాని పాటలు విశ్వనాథ సత్యనారాయణ) ..... కిన్నెర మహాపతివ్రత. అందరు తెలుగుకన్నెలకు మల్లేనే ఉద్విగ్నహృదయ. ఎక్కువ తెలుగుకుటుంబాలకు సామాన్యమైన అత్తాకోడళ్ళ పోరాటం ఆ యింట్లోనూ వెలిసింది.  కొడుకు సుఖమెరుగని అత్తకు కిన్నెరమీద నిందలారోపించడం పని అయింది. ఒకప్పుడు ఆవిడ చేసిన నింద భరించడం కష్టమైంది.  కిన్నెరహృదయం శోకంచేత ప్రళయసముద్రం అయింది. కిన్నెర భర్త ఏంచేస్తాడు? తల్లిని కాదనాలేడు, భార్యను ఓదార్చుకోనూలేడు. ఆవేశహృదయంతో కిన్నెర అడవులవెంట పరుగెత్తింది. భర్తపోయి ఆమెను వద్దని కౌగిలించుకున్నాడు.  ఆమె అతని కౌగిట్లోనే కరిగి నీరై వాగై ప్రవహించింది. అతడు శోకించి శోకించి శిల అయినాడు. . వనములను దాటి 'వెన్నెల బయలు' దాటి తోగులను దాటి దుర్గమాద్రులను దాటి పులుల యడుగుల నడుగులు కలుపుకొనుచు 'రాళ్ళ వాగు' దాటి పథాంతరములు దాటి అచట కిన్నెరసాని - . నా యాత్మయందు నిప్పటికి దాని సంగీతమే నదించు ...

యెంకితో బద్రాద్రి.(యెంకి పాటలు నండూరి సుబ్బారావు)

Image
యెంకితో బద్రాద్రి.(యెంకి పాటలు నండూరి సుబ్బారావు) . యెంకితో బద్రాద్రి ఆడ నీ సుక్కాని యీడ నే గెడయేసి పడవెక్కి బద్రాద్రి పోదామా బద్రాద్రి రాముణ్ణి సూదామా గోదారి గంగలో కొంగు కొంగూగట్టి కరువుతీరా బుటక లేదామా సరిగెంగ తాణాలు సేదామా కొత్త మడతలు కట్టుకోని పెజలోకెల్లి రామన్న రాముడో యందామా రామకతలే పోయి యిందామా సంబరము కెదురుంగ జంటగా నిలుసుండి సామివోరికి దణ్ణ మెడదామా సాపసుట్టుగ నేల బడదామా ఈడ నీ సుక్కాని ఆడనే గెడయేసి పడవెక్కి మనపల్లె కెడదామా బద్రాద్రి రాముణ్ణి సూదామా

శ్రీ రమణ మహర్షి .. ఆశ్రమము. !

Image
శ్రీ రమణ మహర్షి .. ఆశ్రమము. ! . శ్రీ రమణ మహర్షి : Sri Ramana Maharshi) (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి.  ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరు 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది  తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు.బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి" గా ప్రకటించుకున్నారు. రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవారు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడివడియున్ననూ అడిగినవారి మనస్థితిని బట్టి వారికి మార్గముల భక్తిని కూడా బోధించేవారు. . భగవాన్ గురించి చలం! భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్ర...

స్వర్ణముఖి నది.!

Image
స్వర్ణముఖి నది.! .  పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది.  .  శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో  సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే అది వారికి కష్టానికి తగిన ప్రతిఫలం విలువచేసేంత బంగారంగా మారేది.  అందుకే ఈ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చింది. సువర్ణముఖి నది అగస్త్యుని తపోభంగం కలిగించగా అగద్త్యుడు స్వ ర్ణముఖినీ నదిని శపించాడు. అందువలన నదిలో నీరు ఇంకిపోయింది. అయినప్పటికీ అంతర్వాహినిగా ప్రవహిస్తున్న కారణంగా నదీసమాంలో ఉన్న బావులలో నీరు ఇంకిపోదు.  నదీతీరంలో విపరీతంగా మొగలి పొదలు పెరిగిన కారణంగా స్వర్ణముఖీ నదికి " మొగలేరు " అనే మరొకపేరు కూడా వచ్చింది.  ఈ నదికి పలు వాగులు, వంకలు, ఏరులూ జలాలను ఆందిస్తున్నాయి.  వాటిలో కల్యాణీ, భీమానదులు ప్రధానమైనవి. కల్యాణీ నదీతీరంలో శ్రీనివాసమంగాపురంలో కల్యాణశ్రీనివాసుడు వెలసి పూజలందుకుంటున్నాడు.

ఏడ్చింది కిన్నెరా తనువెల్ల మాడ్చింది కిన్నెరా....

Image
మండు టెండలు గాసి మాడ్చినది గ్రీష్మమ్ము కొండయంచులనుండి కురిసినది ఊష్మమ్ము నీటిపుట్టము తొలగి నిలువెల్ల నిప్పులో యేటియిసకలు మండి యెగసిపడిపోవగా ఏడ్చింది కిన్నెరా తనువెల్ల మాడ్చింది కిన్నెరా.... ఈ ఎండలు చూస్తుంటే.. నాకు గుర్తుకు వచ్చిననాలుగుపంక్తులు .విశ్వనాధ వారివి.

అలమేలు మంగ!

Image
అలమేలు మంగ! . అలమేలు మంగ లేదా పద్మావతి, కలియుగంలో వేంకటేశ్వరుని దేవేరిగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. తిరుపతి సమీపంలోని తిరుచానూరు లేదా "ఆలమేలు మంగాపురం"లోని అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధమైనది. . లక్ష్మియే అలమేలు.... శ్రీనివాసుని దేవేరులుగా అలమేలు మంగ, లక్ష్మి, భూదేవి, శ్రీదేవి, పద్మావతి, అండాళ్, గోదాదేవి, బీబీ నాంచారి వంటి అనేక పేర్లు పేర్కొనబడడంవల్ల సామాన్యభక్తులలో కొంత అయోమయం నెలకొంటుంది. సంప్రదాయ గాధలను బట్టి ఈ దేవతలను గురించి ఇలా చెప్పవచ్చును. శ్రీదేవి (లక్ష్మి), భూదేవి ఇరువురూ శ్రీమహావిష్ణువును వరించిన దేవతలు. ఉత్సవ మూర్తియైన మలయప్పస్వామి ఉభయ నాంచారులతో కూడి ఉన్నాడు. వెంకటేశ్వర మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్యవలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద...

గోవిందరాజులస్వామి వారి కోనేరు: తిరుపతి!

Image
గోవిందరాజులస్వామి వారి కోనేరు: తిరుపతి! . గోవిందరాజ స్వామి ఆలయం, తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషను సమీపంలోనే, కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజ స్వామి. ఈయన శ్రీవేంకటేశ్వరునికి అన్న అని అంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ నిర్వహణలోవే ఉంది. . క్రిమికంఠుడనే శైవుడైన రాజు రామానుజుల కాలంలో చిదంబర క్షేత్రంలోని శేషశయనుడైన విష్ణుమూర్తి ఆలయంపై దాడిచేసి విగ్రహాన్ని సముద్రంలోకి తోయించాడు.  ఆలయంలోని వైష్ణవ పూజారులందరూ ప్రాణభయంతో రాజ్యాన్ని దాటి చెల్లాచెదురుగా పారిపోయారు. కొందరు పూజారులు స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకుని తిరుమల ప్రాంతంలో ఉన్న రామానుజాచార్యులను కలిశారు.  ఆ విషయం తెలుసుకున్న రామానుజాచార్యులు బాధపడి చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారుచేయించి తిరుపతిలో ప్రతిష్ఠచేసారు. చిదంబరం నుంచి వచ్చిన ఉత్సవవిగ్రహ సహితంగా ఆరాధనలు, నిత్యపూజలు జరిగేలా కట్టుబాటు ఏర్పరిచారు.  తన శిష్యు...

‘అబ్బే! ఏమైనా సానిసానే’’

Image
మహాకవి విశ్వనాథ సత్యనారాయణగారు , ఆయన చతురతకు అద్దం పట్టే  ఓ సంఘటన గురించి...వారి మాటల్లోనే "‘నేను కిన్నెరసాని పాటలు వ్రాసేనాటికే గొప్పకవినని అభిమానించిన శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు నాకు సహాయం చేయించాలని కొందరు సంస్థానాధీశుల వద్దకు తీసుకొనిపోయారు. ఆ రోజుల్లో నైజాం యిలాకా జమీందారులకు సివిల్ క్రిమినల్ అధికారాలుండేవి. సరే! అందరిసంగతీ అలావుంచుదాం ఒక సంస్థానాధీశుని యింటికి తీసుకువెళ్ళారు. ఆ జమిందారు చనిపోయి కొద్దికాలమైంది. ఆయనగారి రాణివుంది.  పరదా చాటున ఆమె ఇవతలనేను. నన్ను ఆమెకు పరిచయం చేశారు. ఆమె విజ్ఞురాలని నాకు చెప్పారు.  ఆమె పరదా చాటునుండి ‘‘కవిగారూ! మీరు సంప్రదాయబద్ధంగా వ్రాస్తారన్నారు. కాని సానిపాటలు వ్రాశారేమిటి?’’ అన్నది. నేను ఎంత పొగరుబోతునైనా వినయం తక్కువైనవాణ్ణి కాదుగదా! ‘‘అమ్మా! ‘కిన్నెరసాని’ అన్నది ఒక వాగు పేరు కదా! దానిపేరుతో దాని గురించి వ్రాయడంలో తప్పేమిటి’’ అన్నాను. ఆమె ఊరుకోవచ్చు! ‘ ‘అబ్బే! ఏమైనా సానిసానే’’ అన్నది. పరదాలోపల పెదవి విరుచుకొని వుంటుంది.  నేను వెంటనే ‘‘అలాగా అమ్మా! ఇందాకటి నుండి తమను తమ పరిచారకులు దొరసానిగారు దొ...

'కృషీవలుడే ఈశ్వరుడు"!

Image
'కృషీవలుడే ఈశ్వరుడు"! . కృషీవలుడనగానే మనకు ప్రధానంగా దువ్వూరి రామిరెడ్డిగారి 'కృషీవలుడు' పద్యకావ్యం, ఏటుకూరి వెంకట నరసయ్యగారి క్షేత్రలక్ష్మి (పద్యకావ్యం), తుమ్మల సీతారామమూర్తిగారి పరిగపంట మున్నగు ఖండకావ్య సంపుటాలు గుర్తుకు వస్తాయి. ఇంకా అనేకులు అనేక కవితా ప్రక్రియా రూపాల ద్వారా రైతుకు అక్షర పట్ట్భాషేకం చేశారు. దువ్వూరి రామిరెడ్డిగారు తమ 'కృషీవలుడు' పద్యకావ్యంలో ఒకచోట.. 'సైరికా! నీవు భారతక్ష్మాతలాత్మ గౌరవ పవిత్రమూర్తివి- శూరమణివి, ధారుణీపతి పాలన దండమెపుడు నీహలంబు కన్నను ప్రార్థనీయమగునె?' అన్నారు. అంటే రైతును భారతదేశాత్మ స్వరూడవు, గౌరవ పావనమూర్తివి - వీరమణివి - అని అన్నారు. అంతేకాదు నీ హలం కన్నా రాజు యొక్క పాలన దండం ఎప్పుడూ తక్కువే.  నీ నాగలియే ప్రార్థింప యోగ్యమైనదని, రాజు కంటే రైతు గొప్పవాడని చాటిచెప్పారు. కానీ- ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారు- దువ్వూరి రామిరెడ్డిగారి ప్రేరణతోనే ఒక్క అడుగు ముందుకు వేసి - కాకతీయ రాజుల చరిత్రలోని కొందరి జీవిత ప్రధాన ఘట్టాలనే ఇతివృత్తాలుగా తీసుకొని రచించిన 'కీర్తితోరణము' పద్యకావ్యంలో ఒక రాజు పరిపాలనలో...

ఈగ పేరు!

Image
ఈగ పేరు! (చెప్పిందే మల్లి చెప్పి పిల్లల జ్ఞాపక శక్తి పెంచే కధఅని శ్రీదేవులపల్లికృష్ణశాస్త్రిగారుఅనేవారు... అసలుమనకధలుఅన్నిఆవిధంగానేఉంటాయి.) . ఒక ఈగ ఒక రోజు ఇల్లు అలుకుతూ అలుకుతూ దాని పేరు అదే మర్చిపోయింది. ఎంతాలోచించినా పేరు గుర్తు రాలేదు. . ఇంట్లో వున్న పెద్దమ్మకి పేరు తెలుస్తుందని వెళ్ళింది. . “పెద్దమ్మా, నా పేరేంటి?” అంది. . . “నాకేమి తెలుసు, నేను రోజంతా ఇంట్లోనే వుంటాను, అడవిలో వున్న నా కొడుకునడుగు” అంది పెద్దమ్మ. . . ఈగ అడవిలోకి వెళ్ళింది. . “పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకా, నా పేరేంటి?” అంది. . “నాకేంతెలుసు, నేను నరుకుతున్న చెట్టునడుగు, నాకన్నా బలంగా వుంది” అన్నాడు పెద్దమ్మ కొడుకు. . “పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, నా పేరేంటి?” అంది ఈగ. , “నాకు తెలీదు, నన్ను కొట్టే ఈ గొడ్డలిని అడుగు”, అంది చెట్టు. . “పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలీ, నా పేరేంటి?” అంది ఈగ .. “నాకన్నా పెద్దది, ఈ నదినడుగు” అంది గొడ్డలి. . “పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చె...

ఒక రాజు, యేడుగురు కొడుకులు!

Image
ఒక రాజు, యేడుగురు కొడుకులు! , అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండీవారు. ఒక రోజు ఆ యేడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్ళారు. యేడు చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన చేపలిని యెండబెట్టారు. సాయంత్రానికి ఆరు చేపలు యెండాయి కాని, యేడొ చాప యెండలేదు. ఆ చేపను పట్టిన రజకుమారుడు చేపని “చేప చేప ఎందుకు యెండలెదు” అని అడిగాడు. ఆ చేప “గడ్డిమెటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది. ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప యెండకుండా యెందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు. గడ్డిమెటు అందీ “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని. రాజకుమరుడు వెంటనే ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి యెందుకు మెయలేదు?” అని అడిగాడు. “నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది. రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “యెందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు” అప్పుదు పాలెరాడు ఇల అన్నదు, “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని. అమ్మ ని అడిగితే అమ్మ అందీ “ఆక్కడ పాప యెడుస్తొంది” రాజకుమారుడు పాపని “పాప, పాప, యెందుకు యేడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు...

ఆట గదరా శివా ! (శ్రీతనికెళ్ళ భరణి.)

Image
ఆట గదరా శివా ! (శ్రీతనికెళ్ళ భరణి.) . ఆట గదరా నీకు అమ్మ తోడు ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా నీకు అమ్మతోడు ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గద జననాలు ఆట గద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆట గద సొంతాలు ఆట గద పంతాలు ఆట గద సొంతాలు ఆట గద పంతాలు ఆట గద అంతాలు ఆట నీకు ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా నీకు అమ్మతోడు ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా నలుపు ఆట గదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆట గదరా మన్ను ఆట గదరా మిన్ను ఆట గదరా మన్ను ఆట గదరా మిన్ను మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా నీకు అమ్మతోడు ఆట గదరా శివా ఆట గద కేశవ

చు క్కో ప ని ష త్"

Image
చు క్కో ప ని ష త్" (శ్రీ Dinavahi Venkata Hanumantharao గారికి కృతజ్ఞలతో.) ఖగపతి యమృతము తేగా భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ ! పొగచెట్టై జన్మించెను పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ !! ఇది మన గిరీశంగారు శిష్యుడు వెంకటేశానికి చెప్పిన పద్యం.. బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసంలో వుందని సదరు గిరీశంగారే ఉవాచ.."మీతో వుంటే నాకు పొగచుట్ట త్రాగడం తప్ప చదువేం రావటంలేదట" అని వెంకటేశం వాపోతే చుట్ట మాహాత్మ్యం పైవిధంగా చెప్తారు గురువుగారు. ఇప్పుడు మనకు కావలసినది -- ఆ పద్యంలో పాయింటేమిటని? దున్నపోతు, పొగచుట్ట కాదండి-- 'చుక్క'. అది మనపాయింట్... భుగ భుగ పొంగుతోందట.. అమృతంపు చుక్క..ఆ అమృతం ఖగపతి అంటే గరుత్మంతుడు తెచ్చాడు.. "నా దగ్గర దాస్యం చేస్తున్ననీ తల్లికి విముక్తికావాలంటే నాకు అమృతంకావాలి..అమరపురికి వెళ్ళి అమృతం తెచ్చి ఇయ్యి..." అని సవతితల్లి కండిషన్ పెట్టింది...వెంటనే వైనతేయుడు సురపురికి వెళ్ళి, దేవతా వీరులనోడించి.. అమృతభాండము గ్రహించి, చేతిలో ఉన్న అమృతాన్ని కనీసం వాసనకూడా చూడకుండా, సవతితల్లికి సమర్పించి, అక్కడున్న దర్భలపై వుంచాడు వినతాసూనుడు. అఫ్ కో...

కలయో ! వైష్ణవ మాయయో ?

Image
కలయో ! వైష్ణవ మాయయో ? . కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమో తలపన్నేరక యున్నదాననో ! యశోదాదేవి గానో ! పర స్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర జ్వలమై యుండుట కేమి హేతువో ! మహాశ్చర్యంబు చింతింపగన్" . భాగవతంలో భగవంతుడు యశోదాదేవికి విశ్వరూపాన్ని చూపించిన ఘట్టం .  పసిబాలుని నోటిలో సప్త సముద్రాలు , ఎత్తైన కొండలు , మహారణ్యాలు , సూర్య చంద్రులు , భూగోళం , సకల నక్షత్రాలు కనిపించాయి . బ్రహ్మాండాన్ని కనులతో చూచిన ఆ తల్లికి ఒక్కసారిగా మతిపోయింది . ” ఇది కలా ! నిజమా ! అసలు నేను యశోదా దేవినేనా . ఇది మా యిల్లేనా ? విష్ణుమాయా ? సత్యమేనా ? అసలు నా బుధ్ధి పనిజేస్తోందా ?  చూడడానికి పసి బాలుడు . నోరు తెరిస్తే విశ్వం కనిపిస్తోంది . ఇంతకంటే వింత ఏదైనా ఉంటుందా ? . అలోచించిన కొలదీ ఆశ్చర్యం వేస్తున్నది . అని ఆమె మనసు పరి పరి విధాల ఆలోచించింది . నా భ్రమ తొలగడానికి అన్ని లోకాలకూ అధిపతి అయిన ఆ విష్ణుమూర్తినే శరణు కోరుతాను ” అని అనుకొని భగవంతుని శరణు కోరింది మాత . కోరిన మరుక్షణం మాయ కరిగి పోయింది . సర్వాత్ముడు పసిబాలుడుగా కనిపించాడు . క్షణకాలం కింద తను ఏమి చూసి...

మన తెలుగు తల్లి...టంగుటూరి సూర్య కుమారి.!

Image
----------------------మన తెలుగు తల్లి...టంగుటూరి సూర్య కుమారి.!................................

మీ కో పిట్ట కథ !

Image
మీ కో పిట్ట కథ ! , ఒక నిర్భాగ్యుడెవడో కొండ మీద నుండి కాలు జారో, ఎవరో తోసేస్తేనో…పడిపోతున్నాడు…దొర్లుతూ…గిర గిరా తిరుగుతూ….  అప్పుడు రంగ నాయకమ్మ లాంటి వాళ్ళను ‘ విషయం కాస్తా చూడండి ‘ అని ఎవరో…ప్రభుత్వాధికారి అనే అనుకో…. పంపాడు . ఆమె హుటా హుటిన అక్కడికి చేరింది. కొండ మీద నుండి జారి పడే మనిషిని చూసింది…తీక్షణంగా గమనించింది. .సెకన్ లలో సమస్యను సూక్ష్మంగా ఆకళింపు చేసుకుంది….ఆమె చాలా షార్ప్ కదా మరి…. వెంటనే అప్పటికప్పుడు ఒక మెయిల్ పంపింది…… ” అసలు ఈ కొండ ఇక్కడ భూ అంతర్భాగం లో జరిగిన మార్పుల వల్ల ఏర్పడి, ప్రమాదాలకు తావుగా నిలుస్తుంది. భూ అంతర్భాగం లో జరిగే మార్పులను పసిగట్టి మనం అరికడితేనే ఈ సమస్యకు మూలం దొరుకుతుంది.  ఐతే ‘ కొండ ఎత్తుగా ఉంటుంది…కాలు పెట్టడంలో జాగర్తగా ఉండాలి’ అని తెలుసుకోలేని అవివేకత్వం ఈ సమాజం లో ఉన్నంత కాలం ఈ ప్రమాదాలు తప్పవు. ఇప్పుడు ఇక్కడ కింద పడిపోతున్న వ్యక్తి నిజానికి ఎన్నో రాళ్ళను , గడ్డి పీచులను ఆసరా తీసుకోవడం లో కనీస తెలివి కూడా చూపించ లేకపోవడం అన్నది మనమెవ్వరూ గమనించట్లేదు.  నిజానికి మనం అవసరం ఏమీ లేకుండానే ఇతడు రక్షించుకునే పర...

పొడుపు కథలు!

Image
పొడుపు కథలు! కాటుక రంగు, కమలం హంగు, విప్పిన పొంగు, ముడిచిన కుంగు. ఏమిటది?(జవాబు : గొడుగు) , రెక్కలు లేవు కానీ ఎగురుతుంది. కాళ్లు లేవు కానీ ముందుకు వెళ్తుంది. చివరకు మాయమవుతుంది. ఏమిటది?(జవాబు : మేఘం) . కదలకుండానే నదిని దాటగలదు? ఏమిటది?(జవాబు : వంతెన) . ముందుకూ వెనక్కూ తప్ప పక్కలకు కదలదు. ఏమిటది?(జవాబు : తలుపు) . గుడ్డ కింద దాగున్న దొంగకు నాలుగు కాళ్లు. ఎవరది?(జవాబు : టేబుల్) . చెట్టంతా చేదుమయం, రోగాలకు దివ్య ఔషదం, పుల్ల చేయు దంతదావనం. ఏమిటది?(జవాబు : వేపచెట్టు) . నల్ల కుక్కకు నాలుగు చెవులు? ఏమిటది?(జవాబు : లవంగం) . పొట్టలో వేలు, నెత్తి మీద రాయి?ఏమిటది?(జవాబు : ఉంగరం) . సన్నని స్తంభం, ఎక్కలేరు, దిగలేరు?ఏమిటది?(జవాబు : సూది) . ఆకాశంలో కెగిరినా పక్షి కాదు, తోక కలిగిఉన్నా మేక కాదు, తాడు ఉన్నా ఎద్దు కాదు, ఏమిటది?(జవాబు : గాలిపటం) . వేసే వేసే జీలకర్రా, మొలిచే మొలిచే మూలకా కూర, పూసే పూసే బొండు మల్లే, వేసే వేసే వింత గెలరా, కాసే కాసే కామంచీ. ఏమిటది?(జవాబు : అరటి) . నల్లని చేనులో తెల్లటి దారి? ఏమిటది?(జవాబు...

జంధ్యా వందనం!

Image
జంధ్యా వందనం! * "హలో సుబ్బారావు గారూ కులాసా?" "కు లేదు బాబూ...అంతా లాసే" * పన్నేండేళ్ళ దాకా ఆడది ఇండియా లాంటిది అందరూ ఎత్తుకొని ముద్దుపెట్టాలనుకుంటారు! 12 నుంచి 18 దాకా ఆడది అమెరికాలాంటిది ప్రతివాడు ఆ అందాన్ని అందుకోవాలని, పొందాల్ని చూస్తారు! 18 నుంచి 40 దాకా ఆడది ఇంగ్లాండ్ లాంటిది దూరం నుంచి చూస్తూ ఆనందిస్తుంటారు! 40 నుంచి 60 దాకా ఆడది ఆఫ్రికా లాంటిది చూడగానే జడుసుకుని పారిపోతారు ! * నేను ఇంట్లో వంట చేస్తానని చెప్పిన ఆ శుంఠ ఎవరు ? మీ ఏరియా ముష్ఠివాడు సార్. ఎవరూ..మాఏరియా ముష్థివాడా.. వాడి మాటలు నమ్మి మీ గ్రైండర్ కంపెనీ పబ్లిసిటీలో నా ఫొటో వేసుకుంటావా.. ఇలా నాతో మాట్లాడటానికి ఎన్ని గుండెలురా రాస్కెల్... ఓసారి ఇటు వచ్చి కనబడు...నిన్ను రోట్లో వేసి రుబ్బుతా గ్రైండర్ వెధవా... .. శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు చెప్పిన సంగీతం జోకు:  న్యాయమూర్తి ఒక కేసులో ముద్దాయికి శిక్ష విధించబోతూ "నిన్నెక్కడో చూచినట్టుందే, ఎక్కడ చెప్మా" అన్నాడు. "చిత్తం, మీరు ప్లీడరుగా వున్నప్పుడు మీ రెండో అమ్మాయికి సంగీతం చెప్పడాని కొచ్చే వా...

‘ముత్యాల ముగ్గు,’.!

Image
‘ముత్యాల ముగ్గు,’.! . ముత్యాల ముగ్గు, సినిమాకి సుధర్శన్ థియేటర్ కి వెళ్ళినప్పుడు థియేటర్ బయట మొత్తం ముగ్గులతో నింపేసారని గుర్తుంది. . ఆ సినిమా చిన్నప్పుడు చూస్తే ఆ పిల్లలు, కోతి, హనుమంతుడు చాలా నచ్చాయి.  . కాస్త పెద్దయ్యాక చూస్తే, శ్రీధర్, సంగీతని మొదటిసారి చూసినప్పుడు ‘అబ్బా, ఎంత పెద్ద కళ్ళో,’ అనడం, సంగీత రెప్పలార్చి చూడడం, హీరోయినుకి ఎక్కువ మేకప్ లేకుండా చూపించడం బాపు గారికి చెల్లితే,  ఆ పాత్రని అచ్చ తెలుగు అమ్మాయిలా తీర్చి దిద్దడం శ్రీ వెంకటరమణ గారు చేసిన పని.  . రావు గోపాల రావు గారి డైలాగులు ఎవరైనా మర్చిపోగలరా?  ముత్యాల ముగ్గు సినిమా తరవాత ముగ్గులపైన ఇష్టం పెరగడం, అబ్బాయిలు,  తాము పెళ్ళి చేసుకునే అమ్మాయిలు సంగీతలా కళ్ళకు కాటుక పెట్టుకుని, చేతినిండా గాజులేసుకుని, కాళ్ళకు వెండి గజ్జెలు పెట్టుకుని, వాలు జడ వేసుకుని, లంగా ఓణీయో, చక్కగా చీర కట్టుకునో వుండాలని కోరుకునే వారంటే ఆ ప్రభావం ఎవరిదంటారు? బాపు రమణల గొప్పదనం కాకపోతే!  . రామాయణ కథని అందరికీ అర్ధం అయ్యేలా ఈనాటి పరిస్థితులకి తగ్గట్టుగా తీసి చూపించారు ముత్యాలముగ్గు కథతో. ...

లటుకు...చటుకు.!

Image
లటుకు...చటుకు.! . పెళ్ళి చేసి చూడు - ఇల్లు మారి చూడు ."అద్దె పది వేలు".. "అద్భుతం సార్.." "మెయింటెనన్స్ పదమూడు వేలు" నేను ఆయన అసిస్టెంటు వైపు తిరిగి.."ఇదిగో..సార్ మీకేదో చెబుతున్నారు" అన్నాను "నేను చెబుతున్నది నీకే. మెయింటెనన్స్ పదమూడు వేలు." "అంటే మొత్తం ఇరవైమూడు వేలా? అసలు అంత మెయింటెనన్స్ ఎందుకు సార్? రోజూ పరిచారికలు వచ్చి నాకు గులాబి రేకులతో స్నానాలు చేయిస్తారా ఏంటి? మీరు 'ధిక్ ' అన్నా సరే..నేను అంత మెయింటెనన్స్ కట్టను.." అన్నాను "అద్దెకు ఉన్న వారి కోసం ఎన్ని సదుపాయాలు ఏర్పాటు చేసామో తెలుసా?" అని.. "కింద జిం ఉంది" అన్నాడు "అలవాటు లేదు" "విమానం పార్కింగ్ ఉంది" "అవసరం లేదు" "పిల్లలను ఆడించటానికి డేకేర్ సెంటర్ ఉంది.." "నాకు పెళ్ళే కాలీదు.."  "వెరీ గూడ్. ఇక్కడ మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది.." తిరుపతి గంగమ్మ జాతర లో నేర్చుకున్న బూతులన్నీ తిట్టి, అక్కడి నుంచి బయటికొచ్చేసాను..

బాధ పదునైన ఆయుధం!

Image
బాధ పదునైన ఆయుధం! . బాధ అనేది ఒక పదునైన కత్తి లాంటిది. కత్తితో పళ్ళు కోయవచ్చు,  ప్రాణాలు తీయవచ్చు.  అంటే మనకు కలిగిన బాధను తలచుకుని క్రుంగి కృశించి పోవచ్చు లేదా  ఆ బాధ నుండి వచ్చిన పౌరుషంతో అద్బుతాలు కూడా సాధించవచ్చు .. అంటే మనకు కలిగిన బాధను నెగేటివ్ గా ఉపయోగిస్తే నేగేటివ్ ఫలితాలు వస్తాయి పాజిటివ్ గా ఉపయోగిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి  . ఈ విషయం అర్థమైతే బాదే లేదు.

ఎదురుచూపులు !

Image
ఎదురుచూపులంటే విసుగెత్తిన తర్వాత ,ఆసక్తి అనేది సన్నగిల్లింది .., ఆకరి మజిలీలో ఆగి మట్టిదుప్పటి కప్పేదెవ్వరో ..., ఏమో కొందరి జీవితాలు మనకుతెలియదు.. పుట్టకతోనే.. మజలి చేరుకుంటాయి.. వారికీకూడాతెలియదు ఎందుకుబ్రతుకుతున్నారో..(Meraj Fathima.)

సుందర కాండం - హనుమాయణం ! (Vvs Sarma గారికి కృతజ్ఞతలతో..)

Image
సుందర కాండం - హనుమాయణం ! (Vvs Sarma గారికి కృతజ్ఞతలతో..) మనం వేగాన్ని గురించి gaమాట్లాడినప్పుడు మూడు పదాలను ఉపయోగిస్తాం -  శర వేగం, వాయువేగం, మనోవేగం. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు  ఒకచోట గరుడుని వలే ఎగురుతున్నాను అంటాడు హనుమ. మహేంద్ర పర్వతం నుండి లంకా తీరానికి ప్రయాణంచేసినప్పుడు ఆయన వేగమెంత? సమయమెంత పట్టినది? ఆయన గగన ప్రయాణ మార్గం (flight path) ఏది?  . మనోజవం మారుతతుల్య వేగం  జితేంద్రియం బుద్ధిమతా వరిష్ఠం  వాతాత్మజం వానరయూధ ముఖ్యం  శ్రీరామ దూతం శరణం ప్రపద్యే . హనుమంతుడు వాతాత్మజుడు (వాయు పుత్రుడు) వాయువేగముతో చరించగల సమర్థుడు. బుద్ధిమంతుడు. మనోవేగముతో చరింపగల వాడు. జితేంద్రియుడు మహాయోగి. ప్రాణమును నియంత్రణచేసి జీవుడైన అంగుష్ఠమాత్ర పురుషుని శరీరమునకు బాహ్యముగా తీసుకొని రాగలడు. రాముని దూత. రామబాణమువలె శరవేగమున సంచరించగలవాడు. ఆయనను శరణువేడిన తక్షణమే రక్షణ దొరకును .. భౌతిక శాస్త్రజ్ఞులకు మనము పైన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సుందరకాండం ప్రథమ సర్గ శ్రద్ధగా చదివితే అక్కడే లభిస్తాయి. మొదటిశ్లోకం  తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర...

పెళ్లి కాబోతున్న ప్రతి తనయునికి తల్లి చెప్పించవలసినది!

Image
పెళ్లి కాబోతున్న ప్రతి తనయునికి తల్లి చెప్పించవలసినది! .(Durga Manapragada గారికికృతజ్ఞతలతో) కాలకాలముగా మనం అమ్మాయికి మట్టుకే బుద్ది చెప్పి పంపుతాము కదా అయితే అబ్బాయిలు ఎలా ఉంటున్నారని మనం యోచించడం లేదు. తల్లి కొడుకుకు చెప్పవలసిన ముఖ్యమైన ఐదు విషయములు...... ౧. ఏ సమయములోను తల్లితో భార్యను పోల్చకూడదు. తల్లి వేరే భార్య వేరే నీ తల్లికి ఇరవై యేండ్ల అనుభవం వుంది కాని నీ భార్య నేను నిన్ను పెంచిన విధముగానే తనను అల్లారుముద్దుగా అరచేతిలోపెట్టుకొని పెంచివుండును తనకు కొంచం అవకాశం ఇవ్వడం నీ కర్తవ్యం తర్వాత ఒక గొప్ప శ్రేష్టమైన ప్రేమమూర్తి ఐన తల్లిగా నీ బిడ్డకు వుంటుంది. ౨. భార్య నీకు తల్లి కాదు ఒక సఖి స్నేహితురాలు తాను అందరిని వదలుకొని నీతో జీవితం పంచుకోవడానికి వచ్చింది. నీ తల్లికి నిన్ను పోషించడం మాట్టుకే ముఖ్యం కాని నీకు నీ భార్య ఆలనా పాలనా ముఖ్యం మీ ఇద్దరు అన్యోన్యముగా వుండడం చాల ముఖ్యం ౩ గౌరవార్హురాలు నీ భార్య నీ జేవితంలో ఒడుదుడుకులు తారతమ్యములు అన్నిటిలోనూ పాలుపంచుకొనే వ్యక్తీ. నీ ప్రతి అడుగులోనూ తన సహాయ సహకారములు ప్రేమానురాగాములు పంచె వ్యక్తీ తనతో ఏది దాచకూడదు. దాంపత్యములో దాచు...

రావోయి బంగారు మామా! (శ్రీ కొనకళ్ల వెంకటరత్నం.)

Image
రావోయి బంగారు మామా! (శ్రీ కొనకళ్ల వెంకటరత్నం.) రావోయి బంగారిమామా నీతోటి రహస్య మొకటున్నదోయీ పంటకాలువ ప్రక్క జంటగా నిలుచుంటె నీడల్లో మన యీడు జోడు తెలిశొస్తాది- రావోయి... ఈ వెన్నెల సొలపు ఈ తెమ్మెరల వలపు రాత్రి మన సుఖకేళి రంగరించాలోయి- రావోయి... నీళ్లతూరల వెన్క నిలుచున్న పాటనే జలజలల్‌ విని, గుండె ఝల్లుమంటున్నాది- రావోయి... ఈనాటి మన వూసు లేనాటికీ, మనకు, ఎంత దూరానున్న, వంతెనల్‌ కట్టాలి- రావోయి... అవిసె పువ్వులు రెండు అందకున్నయి నాకు; తుంచి నా సిగలోన తురిమి పోదువుగాని- రావోయి... ఏటి పడవసరంగు పాట గిరికీలలో చెలికాడ మనసొదల్‌ కలబోసుకుందాము- రావోయి... జొన్నచేలో, గుబురు జొంపాలలోగూడ, సిగ్గేటో మనసులో చెదరగొడుతున్నాది- రావోయి... .ఈ పాటకు నేను చేసిన వీడియో https://www.youtube.com/watch?v=Cz3af36H23g