మను చరిత్రము 🌷

మను చరిత్రము 🌷 🌷అరుణాస్పదపుర వర్ణనము! 👉మ. వరణాద్వీపవతీ తటాంచలమున\న్ వప్రస్థలీ చుంబితాం బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబున\న్ బుర మొప్ప\న్, మహికంఠహార తరళస్ఫూర్తి\న్ విడంబింపుచు\న్. 🌷ప్రవరుని సౌశీల్యాది ప్రశంస! 👉ఉ. ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై. 👉సీ. తీర్థసంవాసు లేతెంచినారని విన్న, నెదురుగా నేఁగు దవ్వెంతయైన, నేఁగి తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చుఁ, దెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు, నిచ్చి యిష్టాన్న సంతృప్తులఁగాఁ జేయు, జేసి గూర్చున్నచోఁ జేరవచ్చు, వచ్చి యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి, త్తీర్థమాహాత్మ్యముల్ దెలియ నడుగు, తే. నడిగి యోజన పరిమాణ మరయు నరసి పోవలయుఁ జూడ ననుచు నూర్పులు నిగుడ్చు ననుదినము తీర్థసందర్శనాభిలాష మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి. 👉ప్రవరుని స్వగ్రామం అరుణాస్పద పురము. అరుణాస్పద పురము వరణ నది ప్రక్కన గలదు. 🌷🌷...