జీవితమే తమాషా అని చెప్పిన అక్కినేని నాగేశ్వర రావు!

జీవితమే తమాషా అని చెప్పిన అక్కినేని నాగేశ్వర రావు!


నటుడిగా సినీరంగంలో వెలుగొందుతూ..


ఉన్నత శిఖరాలు చేరిన అక్కినేని నాగేశ్వరరావు బతికున్న రోజుల్లో


జీవితమే ఓ తమాషాగా అభివర్ణించేవారు.


చాలాసార్లు తన పుట్టినరోజు ఎప్పుడో తనకే సరిగ్గా తెలియదని,


ఆరోజుల్లో ఇలాగా పుట్టినరోజు పత్రాలు రాసుకునేవారు కారని


చెప్పేవారు. అప్పట్లో గవర్నమెంట్‌ రికార్డులో 1924 సెప్టెంబరు 21,


ఆదివారం పుట్టానని రాసుంది. అమ్మేవో 'నువ్వు శనివారం పుట్టావురా


అబ్బాయ్‌' అని కచ్చితంగా చెప్పింది. కరణంగారు గుడివాడకెళ్లి


రికార్డుల్లో రాయించేసరికి ఓరోజు ఆలస్యమైంది. అంటే, నేను సెప్టెంబరు


ఇరవైన పుట్టానన్నమాట! ఆ సంగతి తెలిసేటప్పటికి నా వయసు


ఇరవై. తెలిశాక కూడా నేనెప్పుడూ పుట్టినరోజు పండగ జరుపుకోలేదు.


ఆ అలవాటు మా ఇంటావంటా లేదు. అయితే, 'బుద్ధిమంతుడు' సరిగ్గా


సెప్టెంబరు ఇరవైన విడుదలకు వచ్చింది. పోస్టర్ల మీద 'బర్త్‌డే రిలీజ్‌'


అని వేయించమంటారా? అనడిగారు ముళ్లపూడి వెంకటరమణ. సరే


అన్నాను. నాకేం తెలుసు? ఇంత గొడవ జరుగుతుందనీ... ఇంతమంది


అభిమానులు నా పుట్టినరోజు జరుపుకుంటారనీ. అసలు నా జీవితమే


ఓ తమాషా...'' అని ఒకప్పుడు అన్నారు ఏఎన్నార్.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!