శ్రీ కాళహస్తీశ్వర !


🌷🌷🌷🌷🌷🌷 .. శ్రీ కాళహస్తీశ్వర ! ..🌷🌷🌷🌷🌷🌷🌷


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


"నీతో యుద్దము చేయనోప,గవితా / నిర్మాణశక్తి న్నిన్నుం


బ్రీతుం చేయగలేను,నీకొరకు తం / డ్రిన్ చంపగాజాల నా


చేతన్ రోకట నిన్ను మొత్తవెరుతం / చీకాకు నా భక్తి యే


రీతి న్నాకిక నిన్ను చూడగనగున్ / శ్రీకాళాహస్తీశ్వరా!


శ్రీకాళాహస్తీశ్వరా!


అర్జునునివలె నీతో యుద్దము చేయుటకు శక్తిలేనివాడు


నీపై కవిత్వములల్లి నిన్ను ప్రసున్నునిగా చేసుకొనవలెను.


.నీకోసమై తండ్రిని మూఢ భక్తునివలె నాచేతిలో యు


న్న రోకటితో నిన్ను కొట్టనూ లేను


నీయందు నాకు గల భక్తియే నను బాదలపాలు చేయుచున్నది.


మరే విధముగా నాకు నిన్ను చూడగల అవకాదము కల్గునో


భోదపడక యున్నదికావున వెంటనే నాకు కన్పింపుము.


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Comments