కుంతి విలాపం !

కుంతి విలాపం !

-

భోగభాగ్యాలతో తులతూగుచున్న

కుంతిభోజునీ గారాబుకూతురినై

కన్న నలుసుకు ఒక్క పట్టెడన్నమైన 

పెత్తుకోనోచనైతి పాపిష్టిదానా...ఆ..


నా చిట్టిబాబు


పెట్టియలోయలోన నొత్తిగిల్లబెట్త్టి నినున్ 

నడిగంగలోకి నెట్టుచుండి తండ్రి

ఇక నీకును నాకు ఋణము తీరె

మీదెట్టులయున్నదో మన యదృష్టము

ఘోరము చేసినాను నా పుట్టుగమాసిపోను

నినుబోలిన రత్నము నాకు దక్కునే

అయ్యో తండ్రి

పున్నమ చందమామ సరిపోయేడి

నీ వరహాల మోము

నేనెన్నటికైనా జూతునే

మరే దురదృష్టము గప్పికున్న

నాకన్నుల కంత భాగ్యమును కల్గునే

ఏయమ్మయిన ఇంత నీకన్నము బెట్టి

ఆయువిడినపాటిమాట గదోయి నాయనా


తల్లి గంగాభవాని


బాలభానుని బోలు నా బాలు

నీదుగర్భమున నుంచుచుంటి

గంగాభవానీ 

బాలభానుని బోలు నా బాలు

నీదుగర్భమున నుంచుచుంటి

గంగాభవానీ 

వీనినే తల్లి చేతిలోనయిన పెట్టి

మాట మన్నించుమమ్మా…ఆ….ఆ…

నమస్సులమ్మా

నమస్సులమ్మా

నమస్సులమ్మా


మరులు రేకెత్త బిడ్డను

మరల మరల నెత్తుకొనుచు

పాలిండ్ల పై నొత్తుకొనుచు

మరులు రేకెత్త బిడ్డను

మరల మరల నెత్తుకొనుచు

పాలిండ్ల పై నొత్తుకొనుచు

బుజ్జగింపుల మమకార ముజ్జగించి

పెట్టెలోపల నుంచి జోకొట్టె తల్లీ


ఆమె మాతృహృదయం

తటపట కొట్టుకుంటున్నది పాపం


ఆతపత్రమ్ము భంగి

కంజాత పత్రముండు

బంగారు తండ్రిపై ఎండ తగులకుండ సందించి

ఆతపత్రమ్ము భంగి

కంజాత పత్రముండు

బంగారు తండ్రిపై ఎండ తగులకుండ సందించి

ఆకులోనుండి ముద్దు మూతిపై

కట్టకడపటి ముద్దునునిచి

నన్ను విడిపోవుచుండే

మా నాన్నయనుచు

కరుణ గద్గద కంఠియై


కంఫమాన హస్తములతోడ

కాంక్షలల్లాడ కనులు మూసుకొని

నీటిలోనికి త్రోసె పెట్టె


నది తరంగాలలో పెట్టె కొట్టుకుపోతున్నది

……………………………………


ఏటి కెరటాలలో - పెట్టె ఏగుచుండ

గట్టుపై నిల్చి, అట్టే నిర్ఘాంతపోయి

నిశ్చల, నిరీహ, నీరస, నిర్నిమిష 

నేత్రములతో కుంతి చూచుచుండె…

-


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!