సీతాదేవి రావణాసురుడి కూతురా ?


సీతాదేవి రావణాసురుడి కూతురా ?

.


శ్రీరాముని సతీమణి మహాసాధ్వి సీతాదేవి ఎవరి కూతురు అంటే మీరేం చెబుతారు 

ఇంకెవరు మహారాజు జనకుడి కూతురు అని ఠపీమని చెప్పేస్తాం. కానీ తాజా సమాచారం seethadeviప్రకారం సీత రావణాసురుడి కూతురు అని అంటున్నారు. సీత జనకుడి కూతురు అనడానికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం తొమ్మిదో శతాబ్దం నాటి గుణభద్రుడి ఉత్తర పురాణంలో ఉన్న ప్రస్తావన ఇప్పుడు సీత రావణాసురుడి కూతురు అనే దానికి బలం చేకూరుస్తోంది.


అలకాపురి అమితవేగ మహారాజు కుమార్తె మణివతి.

ఓ రోజు ఆమె తపస్సు చేసుకుంటుండగా రావణాసురుడు ఆమె తపస్సుకు భంగం కలిగిస్తాడు. దీంతో మణివతి ఆగ్రహోదగ్రురాలై త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తుందట. ఆ తరువాత ఆమెనే రావణుడు – మండోదరి దంపతులకు సంతానంగా జన్మిస్తుంది మణివతి.

ఆ సంతానంతో రావణాసురుడికి ప్రాణాపాయం తప్పదని జ్యోతిష్యులు చెబుతారు.


దీంతో రావణాసురుడు భయపడిపోయి ఆ పాపను చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. దీంతో ఆ పాపను ఓ పెట్టెలో పెట్టి మిథిలరాజ్యం పరిసరాలలో పాతేస్తారు. ఆ క్రమంలో రైతు భూమిని దున్నుతుండగా పెట్టె భయపడడం అందులో పాప ఉండడం రైతు మహారాజు జనకుడికి ఈ విషయం తెలపడం జరుగుతుంది. దీంతో నాగలి అంటే సీత అని, నాగలి దున్నుతుంటే భయటపడిన నేపథ్యంలో ఆ పాపకు సీత అని పేరు పెట్టడం జరిగిందని ఈ ఉత్తరపురాణం వెల్లడిస్తోంది.


ఇక సంగదాస రామాయణం కూడా ఇలాంటి కథనాన్నే వెల్లడిస్తోంది. వసుదేవహింది పేరిట సీత రావణుడి ఇంట జన్మిస్తుందని, జ్యోతిష్యులు రావణుడి భార్య విద్యాధర మాయ కడుపున పుట్టే తొలి సంతానం వంశ వినాశనానికి కారణం అవుతుందని చెప్పడంతో రావణుడు ఆ శిశువును రాజ్యానికి దూరంగా పాతమని చెబుతాడు. రైతు నాగలి దున్నుతుండగా పాప బయటపడడంతో పాప విషయం తెలుసుకుని జనకుడు తీసుకెళ్లాడని చెబుతారు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!