పగలే వెన్నెలా. జగమే ఊయలా -

పగలే వెన్నెలా. జగమే ఊయలా -


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


.పగలే వెన్నెలా. జగమే ఊయలా - కదిలే ఊహలకే కన్నులుంటే'


సినారె గారి అద్భుత కవిత్వం.🙏🙏🙏


చిన్నప్పటి నుంచీ నా మనస్సులో ముద్రించుకు పోయిన పాట ఇది.


పూజాఫలం సినిమాలో జమున అందమైన కళ్ళతో అభినయం...

..

ఊహ తెలి సే రోజుల్లో, ఓ ఎండాకాలం వెన్నెల రాత్రి


మా అత్తయ్యకూతురు ఈ పాట పాడగా విన్నాను,


అప్పటి నుంచీ ఈ పాట ఎక్కడ విన్నా, ఆగి పూర్తగా వినాల్సిందే.


అంతగా కట్టివేసిందీ పాట నన్ను.


ఓ మిత్రుడు అన్నట్లు కొన్ని పాటలు కళ్లు మూసుకొని వినాలి.


కొన్ని చెవులు మూసుకొని వినాలి.


ఈ పాట ఖచ్చితంగా కళ్లు మూసుకునే వినాలి.


మిమ్మల్ని ఎక్కడో వెన్నెల నిండిన ప్రశాంత తీరాలకి తీసుకెళ్లి


వదులుతుంది. దేవుడు మనకిచ్చిన వరాల్లో వెన్నెల ఒకటని


నా స్వచ్చమైన అభిప్రాయం. వెన్నెలని అనుభవించని జీవితం


అమావాస్యే.


వెన్నెలకు వసంత కాలం తోడయిందనుకోండి పెసరట్టు ఉప్మా


చందమే.


'అక్టోబర్ నెలా, మార్చి నెలా - ఈ రెండు నెలలూ, సంవత్సరం


మొత్తానికి వరాల్లా అనిపిస్తాయి, 

మిగిలిన కాలమంతా ముసురు, ఎండ, ఉక్క, చలి. అయినా భరిస్తాం.


మార్చి వస్తుంది. వసంతం వస్తుంది అక్టోబర్ వస్తుంది. శరత్తు వస్తుంది.


అన్న చిరు ఆశతో తక్కిన కాలాలను స్థిమితంగా భరించగలగడమే


కదా సాధనా.' ఎంత నిజం! మార్చి నెలలో కనీసం ఒక్క నిండు


పున్నమి వెన్నెల రాత్రన్నా మీరు ఆరు బయట పడుకుని, మంచి


వెన్నెల పాటల్ని వినకపోతే మీ ఖర్మ. పిండారబోసినట్లు వెన్నెల,


చల్లటి గాలి, కమ్మని సంగీతం,


ఇంతకంటే ఏం కావాలండి బాబూ మనసుని ఆనందంతో నింపడానికి.


కొంతమంది రసిక రాజులు ఇంకొంచెం ముందుకు వెళ్లి -


'చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపంలో...' అంటూ వెన్నెల రాత్రుల్లో


చల్లటి గాలిని వేడెక్కించడానికి ఇంకో మార్గం కనిపెట్టారు.


ఆయనెవరో కవి కాబట్టి సరిపోయింది గాని. నాలాంటి మర్యాదస్తుడు,


ఏకపత్నీ వ్రతుడు అలా ఊహించకూడని (పత్రికాముఖంగా ) వదిలేస్తున్నాను.


అసలా మాటకొస్తే, చాలా మంది కవుల హృదయాల్లో మరులు గోల్పేది వెన్నెలే.

.

బాల గంగాధర్ తిలక్ అయితే ఏకంగా,


'నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు' అని


కమిట్ అయిపోయాడు.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!