ఆనాటి మాటా మంతీ-తాతయ్య కబుర్లు !

ఆనాటి మాటా మంతీ-తాతయ్య కబుర్లు !

.

మా ఇంట్లో కూరలోనో ,పులుసు లోనో ఉప్పు ఎక్కు వైతే మా నాన్న ‘’ఇవాళ కూర బందరు


వెళ్లి నట్లుందే ‘’అనే వారు .అంటే బందర్లో సంద్రం ఉందని ,అందులో ఉప్పు ఎక్కువని అంత


ఉప్పు ఇందులో చేరిందని అర్ధం .కారం ఎక్కువైతే ‘’గుంటూరు సీమ వాళ్లెవరు ఇవాళ


మనింటికి రాలేదే ‘’అనే వారు .గుంటూరు కారానికి ప్రసిద్ధి అని అందరికి తెలుసు కదా . మా


రెండో అక్కయ్య అత్తగారి ఊరు తేలప్రోలు దగ్గర చిరివాడ అగ్రహారం .అత్తగారి పేరు కాంతమ్మ


గారు .చిట్టెమ్మ గారు అనీ అనే వాళ్ళం .ఆవిడ బాగా వంట చేసేది కాఫీ బాగా కాచేది ఫిల్టర్


కాఫీ మాద్రాస్ లో ఇచ్చినట్లు ఇత్తడి గ్లాసు ,వెడల్పు కప్పు లో కాఫీ ఇచ్చేది .ఆవిడ చారు


,పులుసు పెడితే పంచదార ,బెల్లం బాగా ఎక్కువ వేసేది .అది వేలూరి వారికి అల వాటు .మా


ఇంట్లో మా అమ్మ లేక మామ్మ చేసిన చారు పులుసు లో కొంచెం బెల్లం ఎక్కు వినా ‘’ఇవాళ


చారు చిరివాడ వెళ్ళింది ‘’అని సోడ్డు వేసే వాడు నాన్న .


చిన్న ప్పుడు అందరం గోచీలు పెట్టు కొనే స్నానం చేసే వాళ్ళం .యువకులు లంగోటి కట్టు


కొనే వారు .కుర్రాడు ఎవరైనా కొంచెం పొగరు మోతు గా కని పిస్తే ‘’లంగోటి కట్టే వయస్సు కదా


ఆ మాత్రం హడా విడి చేస్తాడు లే ‘’అనే వాళ్ళు పెద్ద వాళ్ళు ముసి ముసి నవ్వులతో .పైలా


పచ్చీస్ గా ఉంటె పూల రంగడని.మరీ ఫాషన్ గా ఉంటె దసరా బుల్లోడుఅనటం మామూలే


మా చిన్న తనం లో స్తుడ్ బెకర్ అనే మోటారు కార్లున్దేవి .చాలా వెడల్పుగా పొడుగ్గా ఉండేవి


ఎవరైనా కొంచెం లావు గా ఉంటె వాణ్ని స్తుడ్ బెకర్ అని గేలి చేసే వాళ్ళం .మరీ సన్న గా


ఉంటె పూచిక పుల్ల అనేవాళ్ళం .


పెసర పచ్చడి తింటే బాగా విరేచనం అవుతుంది .అందుకని దాన్ని ‘’సందడి పచ్చడి ‘’అనే


వాళ్ళం .ఎవరైనా పొడుగ్గా ఉంటె ములక్కాడ పర్సనాలిటి అనీ గడ కర్ర అనీ ,వాసం బొంగు


అనీ ఆటం ఆనాడు సాధారణం .కొంచెం లావుగా ఉంటె ‘ పిప్పళ్ళబస్తా ‘’అనే వారు .ఎవరైనా


జనం తో కలవక పొతే ‘’ఒంటికాయి సొంటి కొమ్ము ‘’అనడం మామూలు .ఆ రోజుల్లో లెట్రిన్


సౌకర్యం లేదు .అందుకని మరుగు ఎక్కడ ఉంటె అక్కడ కాల కృత్యాలు తీర్చుకొనే వాళ్ళు .


మా ఇంటి వెనుక ఖాళీ ప్రదేశాన్ని ‘’చామలి ‘’అనే వారు .దాన్నిండా ఈత పొదలు తాడి


పొదలు ముళ్ళ పొదలు వుండేవి. అక్కడికే అందరు బహిర్భూమికి వెళ్ళే వాళ్ళు .దాన్ని


చెంబట్టుకు వెళ్లటం ,బైలికి వెళ్లటం అనే వారు .కొంచెం ఇంగ్లీష ఫాశాన్లు అలవాటైన తరువాత


‘’లండన్ కు వెళ్లాడు ‘’అనటం ఫాషన్ అయి పోయింది . అలాగే ఆ మూడు రోజుల్ని ‘’ఫ్రెంచ్


లీవు ‘’అనటం . పని ఎగ గొడితే కూడా ఇలానే పిల్చే వారు .


సాంప్రదాయ బ్రాహ్మణా కుటుంబాలలో తద్దినాలు తప్పని సరి .దానికి భోక్తలను పిలవటం


వుంది తద్దిన బ్రాహ్మ నార్తానికి ఆ రోజుల్లో వైదిక నామం ‘’దర్భ పోటు’’.కనుక ఎక్కడైనా


భోక్తకు వెడితే ఇవాళ డి.పి.ఎక్కడా అని అడిగే వారు అంటే దర్భ పోటు అని అర్ధం .అదే


మనకు డిన్నర్ పార్టీ అయింది .అదే అశ్లీలార్ధం లో దుప్పి భోజనం గా గేలి చేయటానికి అనే


వారు .అంటే భోజ నానికి పిలిచినా వారింట్లో కడు పు నిండా తిండి పెట్ట లేదని భావం .


తాంబూలం వేసుకొని నోరు పండితే ‘’అబ్బో ! నోరు సమర్త ఆడిందే ‘’అని నవ్వటం బాగా


ఉండేది .అలాగే పైలా పచ్చేసు గా ఉందే వాణ్ని ‘’వాడికేం శోభనం పెళ్లి కొడుకు ‘’అనటం


రివాజు ఇప్పుడూ ఉంది.మాస్టారు బెత్తం తో కొట్టటం ఆ రోజుల్లో సర్వ సాధారణం .దాన్ని


కవిత్వీకరించి ‘’పేకా వారి అమ్మాయి తో పెళ్లి ‘’అనే వారు .అంటే పేక బెత్తం తో వీపు


వాయింపు అని అర్ధం .

.


జుట్టు పొట్టిగా కట్టిరించుకొంటే ‘’పనస కాయ కొట్టుడు ‘’అనే వాళ్ళు .ఎవరికైనా వత్తాసు


పలికితే ‘’చెక్క భజన ‘’అనేవారు .ఇప్పుడూ ఉందీ మాట.పిల్లలు అల్లరి చేస్తుంటే ‘’సంత


గోల ‘’అని చేపల మార్కెట్ అని అన టం మామూలే .సంగీతం లో రాగాలు పాడుతూ ఉంటె ‘


’జిలేబి చుట్టలు ‘’అనే వాళ్ళు .ఏదైనా ప్రమాదం వస్తే ‘’పుట్టి మునిగింది ‘’అనే వారు .తలకు


నూనె రాసుకోమన టానికి తైల సంస్కారం అనే వారు .ఇలా ఎన్నని చెప్పను ?బహుశా ఇవి


అందరికి పరిచయం ఆయె ఉంటాయి .ఆ కాలం లో అందరి ఊళ్ళల్లో విన్న మాటలే అయి


ఉంటాయి నాకు గుర్తు వచ్చి ఒక సారి ఏకరువు పెట్టాను అంతే .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!