" పోతన భాగవతము " !


" పోతన భాగవతము " !


కమ్మని గ్రంథం బోక్కటి


ఇమ్ముగ ఏ నృపతికైన కృతి


ఇచ్చిన కై కొమ్మని ఈయరే అర్థం ?


బిమ్మహి దున్నంగ నేల ఇట్టి మాహాత్ముల్ ?


నిరాడంబరంగా మడి దున్నుకు బ్రతుకుతున్న


పోతన్నను చూసి ఒకప్పుడు శ్రీనాధుడు సలహా ఇచ్చాడు....


.

"బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్


కూళల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్


హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూలకౌ


ద్దాలికులైన నేమి నిజ దార సుతోదర పోషణార్థమై !!


.

ఆ రాత్రి సరస్వతీదేవి కలలో కనిపించి కంటనీరు పెట్టుకోగా,


ఆమెను ఓదారుస్తూ పోతనగారు ఈ క్రిది పద్యం చెప్పినట్టు ప్రసిద్ది..


"కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ నేల యేడ్చెదో


కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో


హాటక గర్భు రాణి నిను నాకటికిన్ గొని పోయి యెల్ల క


ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ !!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!