ఆరుద్ర - కూనలమ్మ పదాలు!

ఆరుద్ర - కూనలమ్మ పదాలు!

‘ఓ కూనలమ్మా' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన

“కూనలమ్మ పదాలు”, అనే చిన్ని చిన్ని మాటల ఈటెల

"ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి.

కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు

సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను

కూడా మిళితం చేసి రాసాడు ఆరుద్ర.

ఈ కూనలమ్మ పదంలోని అందమంతా తొలి మూడు పాదాల

అంత్యప్రాసలే !

కూనలమ్మ అంటే పార్వతీ దేవి కూతుళ్ళయిన

ఏడుగురు అక్కలకు కాపగు పోతురాజు భార్య. 

.

కొన్ని కూనలమ్మ పదాలు

.

సర్వజనులకు శాంతి

స్వస్తి, సంపద, శ్రాంతి

నే కోరు విక్రాంతి

ఓ కూనలమ్మ !

.

ఈ పదమ్ముల క్లుప్తి

ఇచ్చింది సంతృప్తి

చేయనిమ్ము సమాప్తి

ఓ కూనలమ్మ !

.

సామ్యవాద పథమ్ము

సౌమ్యమైన విధమ్ము

సకల సౌఖ్యప్రథమ్ము

ఓ కూనలమ్మ !

.

సగము కమ్యూనిస్ట్

సగము కాపిటలిస్ట్

ఎందుకొచ్చిన రొస్టు

ఓ కూనలమ్మ !

.

మధువు మైకము నిచ్చు

వధువు లాహిరి తెచ్చు

పదవి కైపే హెచ్చు

ఓ కూనలమ్మ !

.

తమిళం గురించి -

తమలములు నములు

దవళతో మాట్లాలు

తానెవచ్చును తమిళు

ఓ కూనలమ్మా!

.

శ్రీశ్రీ గురించి -

రెండు శ్రీల ధరించి

రెండు పెగ్సు బిగించి

వెలుగు శబ్ద విరించి

ఓ కూనలమ్మ !

.

కృష్ణశాస్త్రి గురించి -

కొంతమందిది నవత

కొంతమందిది యువత

కృష్ణశాస్త్రిది కవిత

ఓ కూనలమ్మ !

.

బాపు గురించి -

కొంటెబొమ్మల బాపు

కొన్ని తరముల సేపు

గుండె ఊయలలూపు

ఓ కూనలమ్మా!

... 

మహాకవి శ్రీశ్రీ మాటల్లో కూనలమ్మ పదాల

ఆరుద్ర గురించి.

.

కూనలమ్మ పదాలు

వేనవేలు పదాలు

ఆరుద్రదే వ్రాలు

.

కూనలమ్మ పదాలు

లోకానికి సవాలు

ఆరుద్రదే వ్రాలు

.

కూనలమ్మ పదాలు

కోరుకున్న వరాలు

ఆరుద్ర సరదాలు

.

ఆరుద్ర ఇంటింటి పజ్యీయం

వానాకాలంలో వేడి మిరప బజ్జీయం

ఇవి చదివితే వేదన మటుమాయం

మీరు నవ్వుల్లో మునగడం ఖాయం

దిగులు తరిమేందుకు ఆరుద్ర చేస్తారు సాయం

దిగులుదసలే భారీకాయం

తరమడానికి వీరిని తోడు తెచ్చుకోవడం నయం

ఎంతైనా ఒంటరి పోరు కాదు సమర్థనీయం

నాన్సెన్సుతో దోస్తీ అభిలషణీయం

చదవలేదు నేను బిల్హణీయం

చదవలేదు ప్రతాపరుద్రీయం

తెలియదు నాకు రాజకీయం 

తెలిసందల్లా ఆరుద్రీయం

ఇంటింటి 'పజ్యాల' హార్మోనియం.

(సేకరణ -వింజమూరి వెంకట అప్పారావు.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!