శ్రీకాళహస్తీశ్వర మహత్యం,ధూర్జటి,పరమశివుడు(4)!


శ్రీకాళహస్తీశ్వర మహత్యం,ధూర్జటి,పరమశివుడు(4)!

.

మ|| నీకున్ మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా

జోకైనట్టి కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా

పాకంబొప్ప ఘటించి, చేతిపునుకున్ భక్షింప కా బోయచే

జేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా! 

.

తా|| ఈశ్వరా! నీకు మాంసాహారముపై కోరిక గలిగినచో, నీ చేతిలో లేడి యున్నది; గండ్రగొడ్డలి యున్నది; నీ మూడవకంటిలో నిప్పున్నది; తలమీద నీరున్నది; కొంచెము శ్రమపడి వంట చేసికొని శుచిగా రుచిగా తినలేక పోయినావా? ఆ తిన్న డెంగిలి చేసి పెట్టిన మాంసమే కావలసి వచ్చినదా? నీవంటి వా డిట్లు చేయవచ్చనా?

.

శా|| రాజైదుష్కృతి జెందె జందురుడు, రారాజై కుబేరుండు దృ

గ్రాజీవమున్మ గాంచె దుఃఖము; కురుక్ష్మాపాలు డామాటనే (కై)

యాజిం గూలె సమస్త బంధువులతో; ఆ రాజ శబ్దంబు ఛీ!

ఛీ! జన్మాంతరమందు నొల్లనుజుమీ! శ్రీకాళహస్తీశ్వరా! 

.

తా|| చంద్రుడు తాను రాజై గురుపత్నిని అపహరించి పాపమును మూటగట్టుకొనెను. కుబేరుడు పిశాచముల వంటి యక్షులకు రాజై దుఃఖము నొందెను. 

ధుర్యోధనుడు గూడ పాండవులను సమూలముగా నాశనము చేసి రారాజు కావలెనన్న కాంక్షతో యుధ్ధమునకు దిగి సమస్త బంధుమిత్రులతోను నాశనమయ్యేను. కాంక్షతో యుధ్ధమునకు దిగి సమస్త బంధుమిత్రులతోను నాశనమయ్యేను. 

ఈ రాజశబ్దములో ఇంత దోషమున్నది. కావున మరొక జన్మలో గూడ రాజు కావలెనని కోరను. నీ దయారస వీక్షణమున్నచో చాలును.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!