శుభోదయం -📌*ఆదిత్య హృదయం* ....!

శుభోదయం -📌*ఆదిత్య హృదయం* ....!



*తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం*


*రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం*


*దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం*


*ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః*




రామరావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలసి అగస్త్య మహర్షి 


కూడా వస్తాడు. యుద్ధంలో అలసివున్న రాముడిని చూసిన 


అగస్త్య మహర్షి "రామా! ఈ సందర్భంగా నీకు వేదంవలె నిత్యమైనదీ, 


మంగళకరమైనదీ, పురాతనమైనదీ, ఆరోగ్యప్రదాయకమైనదీ, 


ఆయుర్వృద్ధిని చేసేదీ, అత్యంత ఉత్తమమైనదీ, అతి రహస్యమైనదీ, 


అత్యంత లాభదాయకమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాను" అని 


పలికి, ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.



అగస్త్య ఉవాచ:



*రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం*


*యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి*



ఓ రామా! గొప్ప బాహువులు గల రామా! ఈ రహస్యమును విను. 


నీకు యుద్ధంలో విజయం కలుగును గాక!



*ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం*


*జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం*



ఈ ఆదిత్య హృదయం వలన పుణ్యం, శత్రు నాశనం కలుగును. 


దీనిని చదువుట వలన జయం, శుభం, పరము కలుగును.


*సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం*



*చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం*




ఇది అత్యంత శుభకరమైనది, మంగళకరమైనది, అన్ని పాపములను 


నాశనం చేయునది. చింత, శోకం, ఒత్తిడిలను తొలగించి ఆయుర్వృద్ధి 


కలిగించును.


*రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం*



*పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం*



ప్రకాశకుడైన, దేవాసురులచే పూజింపబడిన, తన ప్రకాశంతో 


లోకాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ భువనేశ్వరున్ని పూజింపుము.


*సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః*



*ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః*



ఈ ఆదిత్యుడు సకలదేవతలకు ఆత్మయైనవాడు. 


గొప్ప తేజం కలవాడు. తన కిరణాలతో లోకాలను రక్షిస్తుంటాడు.


 తన కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా ఎండావానలను కలిగించి 


దేవదానవులను, సకలజనులను కాపాడుతున్నాడు.



*ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః*



*మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః*



ఇతడు సమస్త శరీరాలు గలవాడగుటచే, ఇతడే బ్రహ్మా, విష్ణువు, 


కుమారస్వామి, ప్రజాపతుల రూపం, దేవేంద్రుడు, కుబేరుడు, కాలుడు, 


యముడు, చంద్రుడు, వరుణుడు.



*పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః*



*వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః*



ఇతడే పితృదేవతలు, వసువు, పంచభూతాలు, ప్రజలు శరీరంలోని 


ప్రాణవాయువు. ఋతువులను కలిగించే ప్రభాకరుడు.


ఆదిత్య స్తోత్ర ప్రారంభం :


*ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్*



*సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః*



నీవు అదితి కుమారుడవు. 


నీవు సూర్యుడవు. నీవు ఆకాశంలో సంచరించేవాడివి. 


వర్షంతో జగాన్ని పోషించేవాడవు. పసిడి కిరణములు కలవాడవు.


 బంగారు తేజస్సు కలవాడవు. 


భానుడవు, హిరణ్యం రేతస్సుగా కలవాడవు. 


నీవు దివాకరుడవు.


*హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్*



*తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండ అంశుమాన్*



నీవు ఆకుపచ్చ గుఱ్ఱములు కలవాడవు. 


సహస్ర కిరణములు కలవాడవు. చీకటిని సంహరించేవాడివి. 


శుభములు కలుగజేసేవాడివి. 


బ్రహ్మాండాన్ని మరలా జీవింపజేయువాడవు. ప్రకాశవంతమైనవాడవు.



*హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః*



*అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనః*



నీవు హితమనే రమణీయ మనస్సు కలవాడవు. 


చల్లనివాడవు. అగ్నిగర్భుడవు. అదితిపుత్రుడువు.


 సాయంకాలంలో శమించువాడవు. 


మంచును పోగొట్టేవాడవు.


*వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్ యజుస్సామ పారగః*



*ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః*



ఆకాశానికి నాధుడవు. చీకటిని పోగొట్టేవాడవు. ఋగ్వేదం,


 యజుర్వేదం, సామవేదంల పారంగుడవు. 


గొప్ప వర్షాన్ని కురిపించేవాడవు. నీటికి మిత్రుడవు. 


ఆకాశామార్గమున శీఘ్రంగా పోయేవాడవు.


*ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః*



*కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః*




ఎండ నిచ్చేవాడవు. గుండ్రనివాడవు. మృత్యువువి. 


ఉదయాన్నే లేతకిరణంలు కలవాడవు. 

మద్యాన్నం సర్వాన్ని తపింపజేయువాడవు. 


కవివి. మహాతేజుడవు. సమస్త కార్యాలకు కారణభూతుడవు.


*నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః*



*తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే*



నక్షత్రాలకు గ్రహాలకు నాయకుడవు. 


నీవే ఈ విశ్వ ఉనికికి కారణం. అన్ని తేజస్సుల కంటే తేజస్సును 


ఇచ్చువాడవు. ద్వాదశాదిత్యులలో అంతర్యామివైన నీకు నమస్కారం.


*నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః*



*జ్యోతిర్గణానాం పతయే దినధిపతయే నమః*



తూర్పుకొండతో కూడినవాడికి నమస్కారం.


 పడమటకొండతో కూడినవాడికి నమస్కారం. 


జ్యోతిర్గణాలకు అధిపతివైన నీకు నమస్కారం. 


పగటిని కలిగించే నీకు నమస్కారం.




*జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః*



*నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః*



జయుడకి నమస్కారం. జయభద్రునికి నమస్కారం. 


పచ్చని గుఱ్ఱములు గల నీకు నమస్కారం. 


సహస్రాంసునకు నమస్కారం.



*నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః*


*నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః*



ఉగ్రునకు నమస్కారం. 


వీరునకు, వేగంగా పయనించే నీకు నమస్కారములు. 

కమలములను వికసింపజేయు నీకు నమస్కారం.


 మార్తుండునికి నమస్కారం.


*బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యోదయాదిత్యవర్చసే*



*భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః*



బ్రహ్మా, విష్ణు, మహేశుల అధిపతికి నమస్కారం. 


ఆదిత్య వర్చస్సుతో ప్రకాశించువానికి నమస్కారం. 


సర్వభక్షకునికి నమస్కారం.


*తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే*



*కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః*




చీకటిని పోగొట్టువానికి నమస్కారం. 


శత్రువులను వధించేవానికి నమస్కారం.


 గొప్ప తేజస్సు గలవానికి నమస్కారం. 


స్వయంప్రకాశం గలవానికి నమస్కారం.


 దేవునికి, జ్యోతిషపతికి నమస్కారం.




*తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే*



*నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే*




బంగారుకాంతివంటి కాంతి కలవాడు, అగ్నిరూపునకు, జగత్తుకు కారణమైనవాడికి నమస్కారం. 


విశ్వకర్మకు నమస్కారం. ప్రకాశాస్వరూపునకు నమస్కారం. 


లోకసాక్షికి నమస్కారం.


*నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః*


*పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః*



ఈ ఆదిత్యుడే మహా ప్రళయకాలంలో ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. 


తిరిగి తానే జగత్తును సృష్టిస్తాడు.


 నాశకాలం తప్ప, తక్కిన కాలంలో చక్కగా పరిపాలిస్తాడు.


ఇతడు కిరణాలతో శోశింపజేస్తాడు, ఎండా, వానలను ఇస్తాడు.



*ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః*


*ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం*



సకల జీవులు నిద్రిస్తుండగా, వాటిలో అంతర్యామిగా మేల్కొని 


ఉంటాడు. అగ్నిహోత్రం, అగ్నిహోత్రఫలమూ ఇతడే.



*వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ*



*యాని కృత్యాని లోకేషు సర్వన్యేషు రవి: ప్రభుః*




వేదాలు, యజ్ఞాలు, యజ్ఞఫలమూ ఇతడే. 


లోకంలోగల సర్వకార్యములకు ఈ రవియే ప్రభువు.




*ఏనమాపత్సు కృచ్చేషు కాంతారేషుభయేషు చ*


*కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవః*



రామా! ఆపదలలో, భయంకలిగించే ప్రదేశాలలో, 


ఈ స్తోత్రంతో సూర్యుడిని కీర్తించేవాడు అన్ని ఆపదలనుండి 


రక్షింపబడతాడు.


*పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్*


*ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి*



నువ్వు మనస్సును ఏకాగ్రంచేసి ఆ దేవదేవుడు జగన్నాధుడైన 


సూర్యున్ని ఆరాదించు. ముమ్మార్లు ఈ స్తోత్రాన్ని జపిస్తే యుద్ధంలో 


విజయం నీకే.


*అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి*



*ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్*



మహాపరాక్రమశాలీ! నువ్వు ఈ క్షణాన్నే రావణుని సంహరిస్తావు' అని 


రామునితో అగస్త్య మహర్షి చెప్పి అక్కడినుండి నిష్క్రమిస్తాడు.


*ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తద


*ధారయామాస సుప్రీతొ రాఘవః ప్రయతాత్మవాన్*






అప్పుడు మహాతేజోవంతుడైన రాముడు ధైర్యంతో ఆనందమును పొంది, 


నిర్మల హృదయంతో ఆదిత్య హృదయంను జపించాడు.



*ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరంహర్ష మవాప్తయాన్*


*త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్*



రాముడు అలా ఆదిత్య హృదయమును జపించి 


మహదానందభరితుడయ్యాడు. 


తర్వాత ముమ్మార్లు ఆచమనం చేసి, మిగుల పరాక్రమముతో


 విల్లు ధరించాడు.




*రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్*



*సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్*



శ్రీరాముడు రావణున్ని చూసి ఉత్సాహంతో యుద్ధం చేయడం 


ప్రారంభించాడు. 


రావణున్ని సంహరించాలని ధృడంగా నిశ్చయించుకున్నాడు.



*అథ రవి రవదన్నిరీక్ష్య రామం


ముదితమన్యాః పరమం ప్రహృష్యమాణః*


*నిశిచరపతి సంక్షయం విదిత్వా


సురగణమధ్యగతో వచస్త్వరేతి*



అలా తనను జపించుతున్న శ్రీరామున్ని చూసి, రాక్షసరాజు వినాశనంను


 గ్రహించి, చాలా ఆనందంతో 'నీవింక రావణుని వధింప త్వరపడమని, 


నీకు విజయం తధ్యమ'ని సూర్యభగవానుడు రామునితో చెప్పెను.


*ఇతి ఆదిత్య హృదయం సంపూర్ణం* ....,.✍ 


లోకాస్సమస్తాస్సుఖినోభవంతు .

************************************

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!