#యధార్ధ_సంఘటన!


#యధార్ధ_సంఘటన!


(#ఆస్తికులు_నాస్తికులు ప్రత్యేకంగా చదవండి..)


అది 1970 వ సంవత్సరం. తిరువనంతపురం సముద్రపు ఒడ్డున ఒక పెద్దమనిషి భగవద్గీత పఠనములో ఉన్నాడు. అక్కడికి ఒక నాస్తికుడైన ఒక కుర్రవాడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు.


ఆ కుర్రాడు ఈ పెద్దమనిషినితో " ఈకాలంలో కూడా ఇలాంటి పుస్తకాలు చదవడం వలన , మీరంతా మూర్ఖులుగా మిగులుతున్నారు. మాకు సిగ్గుగా ఉన్నది" అని రెచ్చగొడుతూ మాట్లాడము మొదలుపెట్టాడు.


పైగా " మీరే కనుక ఇలాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు పుస్తకాలు చదువుతూంటే, మనదేశం ఈపాటికి చాలా అభివృద్ధి సాధించి ఉండేది " అని ఆవేశంతో అన్నాడు.


ఆ పెద్దమనిషి ఆ కుర్రవాని పరిచయం అడిగాడు. అప్పుడా కుర్రవాడు " నేనొక కలకత్తానుండి వచ్చిన సైన్స్ పట్టభద్రుడిని. ఇక్కడ భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్లో పనిచేయటానికి వచ్చాను " అని గర్వంగా చెప్పాడు.


" మీరు వెళ్ళి ఈ భగవద్గీత లాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు మీద పుస్తకాలు చదవమని, ఇలాంటి పుస్తకాలు చదవడం వలన జీవితంలో సాధించేది ఏదీ ఉండదని " ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.


ఆ పెద్దమనిషి నవ్వి, అక్కడనుండి వెళ్ళడానికి ఉపక్రమించాడు. ఆయన అలా లేవగానే నలుగురు రక్షక దళ భటులు ఆయనను చుట్టుముట్టి, ఆయనకు రక్షణగా నిలబడ్డారు. ఆయన కోసం ఒక అధికార ఎర్రబుగ్గ కారు వచ్చింది. ఇదంతా చూసి, ఆ కుర్రవాడు భయపడి, ఆ పెద్దమనిషిని " మీరెవరూ " అనడిగాడు. ఆ పెద్దమనిషి తనపేరు " విక్రం సారాభాయి" చెప్పాడు. అంటే, అప్పటికి ఆ కుర్రవానికి తను పనిచేయబోయే సంస్థకు ఆయన చైర్మన్ అని అర్ధం అయ్యింది.


ఆ సమయానికి భారతదేశంలో 13 రీసెర్చ్ సంస్థలు, విక్రం సారాభాయి పేరుమీద నడుస్తున్నాయి. అణువిజ్జాన పధకాలు రచించే సంస్థకు ఆయన అధిపతి. ఆయనను ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా దానికి నియమించింది.

అప్పుడు ఆ కుర్రవాడు వలవలా ఏడుస్తూ, ఆయన కాళ్ళమీద పడ్డాడు. అప్పుడు కీ.శే. )) చెప్పిన గొప్ప విషయం ఇది.


" ఈ విశ్వంలో ప్రతి వస్తువు పరమాత్మచే సృష్టించబడినదే. అది పురాణకాలం కావచ్చును. మహాభారత సమయం కావచ్చు. ప్రస్తుత సమయం కావచ్చును. మిత్రమా !! దైవాన్ని ఎప్పుడూ మరువకు. " అని బోధించాడు.


ఇప్పటి #నాస్తికులు ప్రతిదీ #హేతువాదం , అంటూ డాంబికముగా కరాళ నృత్యాలు చేయవచ్చును. కానీ సైన్సును అభివృద్ది చేసినది మటుకు #ఆస్తికులే అని చరిత్ర చెపుతోంది. దైవం నిత్య సత్యం. భగవద్గీత ఒక అమోఘమైన విజ్జాన శాస్త్రము. దానిని ఎవరూ తప్పుబట్టలేరు. దానిలో చెప్పినది ఆచరించి ప్రపంచంలో ఎందరో లాభము పొందుతున్నారు. ప్రపంచములో ఉన్న సమస్యల కన్నిటికీ భగవద్గీతలో పరిష్కారాలున్నాయి.


శ్రీమత్భగవద్గీత సకలశాస్త్ర సారం !


శ్రీ కృష్ణం వందే జగద్గురుం !!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!