శ్రీ కాళహస్తీశ్వరా ! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీ కాళహస్తీశ్వరా !

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


భవకేళీ మదిరామదంబున మహా / పాపాత్ముడై వీడు న


న్ను వివేకింపడటంచు,నేను నరకా / ర్ణోరాశిపాలైన బ


ట్టవు,బాలుం డొకచోట నాటతమితో / డ న్నూతగూలంగ దం


స్రి విచారింపక యుండునా కటకటా! / శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా..


జనన మరణాదుల మాయ అనే మద్యమును త్రాగుటచే కల్గిన


గర్వమువలన సంసారమునందు మహాపాతకములు


చేయుచున్నవాడైయున్నందున,


పరమేశ్వరుడైన నిన్ను పూజించుట లేదనే నెపముతో,నీవు


పట్టించుకొనక,నరకాది లోకాలలో పడి భాదపడుతున్నా కూడ


చూడకౌండుట న్యాయము కాదు.


అయ్యయ్యో!ఒకచోట ఆటలు ఆడుచున్న సమయంలో కొడుకు


హఠాత్తుగా నూతిలో పడిపోతే అతని తండ్రి పట్టించుకొనకుండా


ఉండిపోతాడా? వదిలిపెట్టక రక్ధించునగదా!


అట్లే నేను పడుచున్న భాదలు చూచి కూడ నన్ను రక్షించక ఉండుట


దర్మము గాదు.గాన వెంటనే తండ్రివలె నన్ను రక్షింపుము.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!