కరిమింగిన వెలగపండు !

కరిమింగిన వెలగపండు !


"సిరి దా వచ్చిన వచ్చును


సలలితముగ నారికేళ సలిలము భంగిన్


సిరి దాఁ బోయిన బోవును


కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!

.


తాత్పర్యం:


సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి


నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది.


అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన


వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది.


ఓ సుమతీ !


సంపద యొక్క రాకడ పోకడ రెండూ కూడ అద్ఫుతంగానే ఉంటాయి


కొబ్బరి కాయలోకి నీరు ఎలా వచ్చాయో ఆ విధంగానే డబ్బు రావడం


మొదలు పెడితే తెలియకుండానే కుప్పలు తెప్పలు గా


వచ్చిపడుతుంది. ఆ సమయం లో తెలివైన వాడు విచక్షణ తో జాగ్రత్త


పడి దాచుకుంటాడు.


అలాగే డబ్బు పోవడం మొదలు పెడితే ఏనుగు మ్రింగిన వెలగ పండు


లోని గుజ్జు లాగ మాయమై పోతుంది. కాబట్టి బుద్ధిమంతుడు సరైన


సమయం లో జాగ్రత్త పడి పొదుపు చేయాలి.


‘ కరి మ్రింగిన వెలగపండు’ అనగా ‘ఏనుగు తిన్న వెలగ పండు’ అని,


ఏనుగు యొక్క గొప్పదైన జీర్ణశక్తి వలన అది మ్రింగిన వెలగ పండు


అలాగే ఉండి దాని లోని గుజ్జు మాయ మౌతుందని తెలుగు


కవులు వ్రాశారు . 

.

కాని సంస్కృతం లో ‘గజ భుక్త కపిత్థవత్ ’ అని గలదు.


దీనికి “గజ క్రిమి రూపేణ ” అని వ్యాఖ్య.


కంటికి కనపడని క్రిమి వెలగ కాయ లోనికి ప్రవేశించి


గుజ్జు నంతటిని నల్లగా మార్చి వేస్తుందని ,


‘కరి అనగా నలుపు ’అని, “ కరి మ్రింగిన ”అంటే


“నల్లగా మారిన ” అని అర్థం చెపుతున్నారు.


ఆంధ్రుల సాంఘీక చరత్ర లో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు


ఈ విషయాన్ని చర్చించారు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!