మనసుకు హత్తుకున్న విషయం !

🙏🙏🙏💐💐🙏🙏🙏


మనసుకు హత్తుకున్న విషయం !


🙏🙏🙏💐💐🙏🙏🙏


ఆ దంపతులిద్దరినీ చూసి, పీఏ ముఖం చిట్లించుకుంది. ముతక వస్త్రధారణలో ఉన్న ఆ ఇద్దరు వృద్ధులను, ప్రెసిడెంట్ దగ్గరికి పంపడానికి ఆమె అంగీకరించలేదు. లేకపోతే, ఈ ముసలివాళ్ళకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ తో పనేమిటి ?


ఇంతలో ఆ అధ్యక్షుడే గదిలోంచి బయటకు వచ్చాడు......


"చెప్పండి ,ఏం కావాలి? "అడిగాడు ప్రెసిడెంట్. 

"మేము విరాళం ఇద్దామనుకుంటున్నాము" చెప్పాడు ముసలాయన.......


ఆయనకు నమ్మకం కలగలేదు. అయినా బయటపడకుండా "ఎంత ఇవ్వాలను కుంటున్నారు?" అన్నాడు......


"మా పదహారేళ్ళ కొడుకు టైఫాయిడ్ తో చనిపోయాడు. వాడి ఙ్ఞాపకార్ధం ఈ యునివర్సిటీ క్యాంపస్ లో ఒక భవనం నిర్మించాలని మా ఆశ " చెప్పంది వృద్ధురాలు......


"బిల్డింగ్ కు ఎంతవుతుందో తెలుసా?" ప్రశ్నించాడు ప్రెసిడెంట్......


"ఎంత ?" చాలా మామూలు గా అడిగాడు ముసలాయన......


చెప్పాడు ప్రెసిడెంట్....


ముసలాయన ఆశ్చర్యపోయాడు.....


ముసలావిడ కూడా ఆశ్చర్యపోయింది.

"అంటే ఈ లెక్కన ఓ యూనివర్సిటీ స్థాపించాలంటే ఎంతవుతుంది?" కుతూహలం ఆపుకోలేక అడిగింది పెద్దావిడ.......


ఆ పెద్ద మొత్తాన్ని ఒక్కొక్క పదమే నొక్కి చెప్పాడు ప్రెసిడెంట్........


ఆమె , భర్త వైపు తిరిగి అంది, "మరి మనమే ఓ యూనివర్సిటీ ఎందుకు పెట్టకూడదు డార్లింగ్ !" 

"సరే" అన్నాడు భర్త.....


కొంతకాలానికి కాలిఫోర్నియా నగరంలో "స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ" స్థాపన జరిగింది.....

ఆ దంపతులిద్దరూ లేలాండ్ స్టాన్ ఫోర్డ్, జేన్ స్టాన్ ఫోర్డ్........


లేలాండ్ కాలిఫోర్నియా గవర్నర్ గాను, సెనేటర్ గానూ పని చేశారు......


ఒక్కోసారి మనం ఎదుటివాళ్ళను ఎలా తప్పుగా అంచనా వేస్తామో చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఎదుటివాళ్ళ దుస్తులను బట్టి,కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయానించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ళ స్థాయిని లెక్కగడుతుంటాం.......


రేప్పొద్దున మీ ఎదురుగా నిలబడి ఉన్నది, ఎవరైనా సరే కావచ్చు.... వాళ్ళను మీకంటే గొప్పవాళ్ళుగా భావించకపోయినా సరే, తక్కువవాళ్ళని మాత్రం అనుకోవద్దు.......


🙏🙏🙏💐💐🙏🙏🙏

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!