భావికథాసూచన !

భావికథాసూచన !

.

అన్వేషించడానికి బైలుదేరిన హనుమంతునికి, 

శ్రీరాముడు తన వ్రేలినున్న రత్నపుటుంగరమును సీతకు 

ఆనవాలుగా చూపుమని ఇచ్చాడు. అది తీసుకుని 

ఆంజనేయుడు లంకకు పయనమైనాడు. 

ఆ సందర్భములోని రామభద్రకవి పద్యం చూడండి.

.

"తరుచరవీరుడు రఘుశే

ఖరు డిడు రత్నాంగుళీయకము గైకొని స

త్వరుడై చనియెను, లంకా

పురిఁ గాల్చగ నిప్పుఁ గొంచుఁబోయెడు భంగిన్."

(రామాభ్యుదయము - అయ్యలరాజు రామభద్రుడు)

.

భావము: రామచంద్రుడు ఒసగిన రత్నపుటుంగరమును 

తీసుకుని లంకకు బైలుదేరినాడు మారుతి. 

అది ఎలా ఉన్నదంటే, లంకాపురిని కాల్చుటకు 

ఆయన తనతో నిప్పుకణికను తీసుకువెళ్తున్నట్లు ఉందట!.... 

రత్నము ఎఱుపు; నిప్పురవ్వ ఎఱుపు. 

ఈ సాదృశ్యమును ఆసరాగా, పై చక్కని పద్యమును 

మనకు అందించినాడు కవి.... 

లంకాదహనం కాబోతున్నదనే భావికథాసూచన సైతం ఉంది 

ఈ చిన్నిపద్యములో!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!