బుడబుక్కల జోస్యం!

బుడబుక్కల జోస్యం!

బుడ్‌ బుడక్‌ అని శబ్దం చేసే చిన్న ఢమరుకాన్ని వాయిస్తూ ఊరూరు తిరుగుతూ జోస్యం చెప్పేవాళ్ళని బుడ్‌ బుడక్కులు లేక బుడబుక్కల వాళ్ళు అంటారు. వీరు మహారాష్ట్ర నుండి వచ్చి ఆంధ్రదేశంలో స్ధిరపడిన ఆరెకులం వాళ్ళు. వీరు సంవత్సరమంతా జోస్యం చెబుతూ అడుక్కుంటారు. ఒక్కొక్క ఊరిలో కనీసం రెండు నెలలు ఉంటారు. రోజుకు మూడు లేక నాలుగు ఇండ్లు మాత్రమే అడుక్కుంటారు. బుడబుడక్కల జోస్యం పురుషులు మాత్రమే చెపుతారు. వీరు ఒక్కొక్కరే భిక్షానికి పోతారు. బుడబుడ్కని వాయిస్తూ అంబపలుకు జగదాంబపలుకు అని అందరు దేవుళ్ళను స్మరిస్తూ భిక్షాటనం చేస్తుంటారు. రాత్రి ఆరు గంటల ప్రాంతాల్లో ఇంటికి వస్తారు. వీరు అడుక్కునే సమయంలో సానిపి (కళ్లపి) తొక్కరు. ఏ ఇంటికి ముందుకు పోతే ఆ ఇంటి సంగతులు పగిడి అంటే పక్షి పలికిన దాన్ని బట్టి జోస్యం చెబుతారు. అంతే కాకుండా మరుసటి రోజు అడుక్కోబోయే ఇంటిని ముందురోజే నిర్ణయించుకుంటారు.

వీరి వేషధారణ ప్రత్యేకంగా ఉంటుంది. తెల్లటి పంచెను సైకిల్‌ కట్టు పద్ధతిలో కట్టుకుని, చొక్కావేసుకుని దానిపై నల్లని కోటు ధరిస్తారు. భుజంపై బొంతను వేసుకొని వీపుకు దుప్పి లేక పులితోలు కట్టుకుంటారు. ఈ దుప్పి తోలు వీరికి ఎవరైనా చెడుపు చేస్తే దగ్గరికి రాకుండా కాపాడుతుంది. బుర్ర మీసాలు కలిగి నుదుటిపై నల్లని కావు అడ్డంగా పెట్టుకొని, తలకు ఎర్రని పాగా చుట్టుకుని, పాత గొడుగు పట్టుకుంటారు. చెవులకు రింగులు ధరిస్తారు. వీరు వైద్యం కూడా చేస్తారు. అంతేకాకుండా భూత వైద్యంలో సిద్ధహస్తులు. ధాన్యాన్ని వస్త్రాల్ని, డబ్బుల్ని భిక్షంగా స్వీకరిస్తారు. వీరు కూడా ఊర్లను పంచుకుంటారు. ఒకరికి కట్టడి ఉన్న ఊర్లకు ఇంకొకరు పోరు. బుడబుక్కల స్త్రీలు బొంతలు కుడతారు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!