Posts

Showing posts from May, 2014

హంతో జాయే ఆపని గావు సబ్ కో రాం రాం...

Image
కలసి ఉన్నాం.....కాదు అనుకున్నాం.... విడి పోయాం.... కొంపలు ఏమి ములగలేదు... Parting is allways sad.. ఏదో తెలియని బాధ అంతే.. ప్రేమలు ఎక్కడికి పోతాయీ... జ్ఞాపకాలు ఎప్పుడు ఉంటాయి.. హంతో జాయే ఆపని గావు సబ్ కో రాం రాం... అంటో సరదాగా పాడుకుందాం...

కందుకూరి రుద్రకవి.....

కందుకూరి రుద్రకవి..... కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో కందుకూరి రుద్రకవి ఒకరు. ఈయన కాలం క్రీ.శ. 1480-1560. ఇతడు ఆశు కవిత్వం చెప్పడంలో దిట్ట. తిట్టు కవిత్వంలో ఉద్దండుడు. మొదట్లో రాయల వారి దర్శనం రుద్రకవికి లభించలేదు. చివరికి రాయల వారికి క్షవరం చేసే కొండోజి వల్ల దర్శనం దొరకడంతో ఈ పద్యం చెప్పాడు[1]... “ ఎంగిలి ముచ్చు గులాములు సంగతిగా గులము జెరుప జనుదెంచిరయా ఇంగిత మెరిగిన ఘనడీ మంగలి కొండోజి మేలు మంత్రుల కన్నన్ (వికీపీడియా నుండి)

మా ఆవిడకి కోపం వచ్చింది !

Image
మా ఆవిడకి కోపం వచ్చింది ! వచ్చిందంటే , రాదూ మరి ! అసలు మొగుళ్ళు చేసే తింగరి పనులకు ఆవిళ్ళకు కావిళ్ళ కొద్దీ కోపాలు వస్తాయంటే, పాపం, వారిదా  తప్పు ?  భర్త అంటే, భరించే వాడని వ్యుత్పత్తి చెబుతారు కానీ, నిజానికి ఆ మాట భార్యలకు వర్తిస్తుంది. క్షమయా ధరిత్రీ అన్నారు కదా ! మన కోపాలను, చిరాకులను, పరాకులను, బలహీనతలను, వ్యసనాలను, అధిక ప్రసంగాలను, అవమానకర వ్యాఖ్యానాలను, పిలుపులను, తింగరి వలపులను, తలపులను, దుబారాలను, తెలివి తక్కు పనులను, తెచ్చే తగాదాలను, అలవిమాలిన అహంకారాలను, బద్దకాలను, అవసరాలను కూడా వాయిదా వెయ్యడాలను, అర్ధ నగ్నంగా ఇంట్లో తిరగడాలను, మాసిన బట్టలు రోజుల కొద్దీ మార్చుకోక పోవడాలను, చెప్పుకునే గొప్పలను, కప్పి పుచ్చుకునే తప్పులను, రాద్ధాంతాలను, వెర్రి మొర్రి సిద్ధాంతాలను, పిచ్చి కవిత్వాలను, వెర్రి బ్లాగులను, పువ్వులయినా కొనని పిసినారి తనాలను,ముభావాలను, ముఖం చాటేయడాలను, మన బట్ట తలలను, బాన పొట్టలను, పిట్ట కథలను, ... ఇది అనంతం. వీటిని ఆడాళ్ళు భరించడం లేదూ ? అన్నింటినీ భరిస్తూనే మొగుళ్ళను ప్రేమించ గలిగే, ఆడవారి ఓపికకి జోహార్లు ! x

రవీంద్రుడు-రచన: కొడవంటి

Image
రవీంద్రుడు-రచన: కొడవంటి 04052014 1. వంగ బంధువతడు కవి గాయకుండు  చిత్రలేఖనుడు చిన్మయ మూర్తి  మానవత్వమ్మే మతముగా గల వాడు  హితభాషి మితభాషి శ్రేయోభిలాషి  2.గీతాంజలి రచన తలమానికమ్మాయే శ్రమజీవి కర్షకుల దైవముగనెంచె రచనలన్నిటిలోన మానవత విలువలే ప్రపంచమునందు ప్రతిబింబితములయ్యె  ఆణిముత్యమ్ములు ఆతని రచనలు చిన్ని తనముననుండి చతురతయె కనబరిచె జాతీయ గీతమ్ము జనగణమన ఆతని కలమందు ఆవిర్భవించె  విశ్వకవియై నిలచి విశ్వఖ్యాతిని గాంచె గాంధియే ఆతనిని గురుదేవులనియె 3. అంతరాత్మయె అతని ప్రోబోధమ్మాయె ఆంగ్లేయులిచ్చిన నైట్ హుడ్ గౌరవము  తిరస్కారముజేసితేజస్వియైనాడు మారణ కాండకు చలియించినాడు(జలియన్వాలా) కలమునే కత్తిగా కడు రమ్యముగ మలచి రణమునే సలిపేను వీర సైనికుడై  ఒంటరిగ పోరాడి వినుతికెక్కినాడు రవీంద్రుడై నిలచె రణరంగమందు 4. శాంతి నికేతన్ స్థాపననుజేసి విద్యార్ధులెందరినొ వున్నతులజేసె  గ్రామాభ్యుదయమ్మే దేశాభ్యుదయమని శ్రీనికేతనమ్మునే నెలకొల్పినాడు  చిత్రకళలనుగూడ చిత్రముగ నేర్చే రచయితేగాక గాయకుడు గూడ  నాటకములెన్నిటినొ రచియించినాడు ఖ్యాతినే...

// ప్రార్ధన //

Image
విశ్వకవి రవీంద్రుడి గీతం '' కోరొ జాగరిత '' కు స్వేచ్చానువాదం ... లకుమ // ప్రార్ధన // ప్రభూ ! ఎక్కడ చిత్త దీపమ్ము నిర్భీతి గ వెలుగునో? ఎక్కడ మానవుడు హిమ నగం లా తలెత్తుకొని మనగలడో? ఎక్కడ వీచికలు స్వేచ్చ్చా గీతికలై నలుదెశ లా వ్యాపించగలవో? ఎక్కడ భూగోళం ఖండ ఖండాలై దేశాలై ప్రాంతాలై గోడలై విడిపోదో? ఎక్కడ పదాలు పెదవులనూ ,పుటలనూ దాటేందుకిష్టపడతాయో? ఎక్కడ నిరంతరా' న్వేషణ ' సుజలాం సుఫలాపేక్ష దిశ గా సాగిపోతుందో? ఎక్కడ అనంత జ్ఞాన వాహిని అంధ విశ్వాసపుటెడారి దారుల్లో ఇంకిపోదో? ఎక్కడ పని లోనూ.పాటలోనూ ప్రజ ప్రపంచాన్నే మరచిపోతుందో? ఎక్కడకు చన మనస్సు ఉవ్విళ్ళూరు తుందో? ఎక్కడకు హృదయాంతరాళం పర్వులు తీస్తుందో? ఆ స్వేచ్చా స్వర్గం లోకి! ఆ స్వర్గ లోక ద్వారం లోకి...!! నా దేశం మేల్కొనునట్లు..... మమ్మనుగ్రహించు...!...

ఈ పాదమే కదా ఇలయెల్ల గొలిచినది

Image
ఈ పాదమే కదా ఇలయెల్ల గొలిచినది  ఈ పాదమే కదా ఇందిరా హస్తముల సితవైనది ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది  ఈ పాదమే కదా ఈ గగనగంగ పుట్టినది ఈ పాదమే కదా యెలమి పెంపొందినది  ఈ పాదమే కదా ఇన్నిటికిని యెక్కుడైనది ఈ పాదమే కదా యిభరాజు దలచినది  ఈ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది ఈ పాదమే కదా యీబ్రహ్మ కడిగినది  ఈ పాదమే కదా యెగసి బ్రహ్మాండమంటినది ఈ పాదమే కదా ఇహపరము లొసగెడిది  ఈ పాదమే కదా ఇల నహల్యకు కోరికైనది ఈ పాదమే కదా యీక్షింప దుర్లభము  ఈ పాదమే కదా ఈ వేంకటాద్రిపై నిరవైనది

''అమృతాభి షేకము ''

Image
దాశరధి కృష్ణ మాచార్యులు రచించిన ''అమృతాభి షేకము ''లోని.. ''నిశి ''వర్ణన.. రాత్రి ఏవిధముగా చీకట్లు అలుముకున్నాయో వర్ణన (సేకరణ ... మరియు వివరణ ....@Kalyani Gauri Kasibatla.) ఇరులు నిశాసతీ భుజములెక్కి, శిరమ్మున నిక్కి తారకా తరుణి కపోల పాళిక లు తాకి,విహాయస వీధి ప్రాకి,చం దురు పయి సోకి, భూమి ధర దుర్గమ వీధుల దూకి ,మెల్లగా ధర పయి కాలు మోపిన వుదారములై హరినీల కాంతులన్ ఇటు ప్రాకి అటుప్రాకి ఇందు బింబాననా ముఖము పై కస్తూరి బొట్టు పెట్టి ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలకా భ్రుకుటికా ధనువు నంబకము కూర్చి ఇటు సాగి అటు సాగి ఇందీవ రేక్షణా పక్ష్మ భాగములపై వచ్చి వ్రాలి ఇటు వీగి అటు వీగి మృగ నేత్ర బంగారు చెక్కిలి పై అగర్ చుక్క నునిచి వెండి కొండ పయిన్ మబ్బు విధము దోచి చంద్రకేదారమున లేడి చాయ తిరిగి ఆది శేషుని పై విష్ణువై శయించి చీకటులు కూర్చె నందమ్ము లోకమునకు... కాటుక వంటి చీకటులను కవి ఎంత అందముగా వర్నిచారో కనుగొనుమా.. చాలా మంది మిత్రులు భావం కూడా అడుగుతున్నారు.. వారికోసం భావం ;;- చీకట్లు నల్లని కాంతులతో భూమిమీద అడుగు పెట్టాయి. నిశ అనే స...

‘అప్పడాభరణం’

Image
‘అప్పడాభరణం’  ‘‘వేచే వారెవరురా కరకరా...టటటటా... గరగరా...టటటటా... ‘పాపడ్’ వేచేవారెవరురా! మరిగిన ఈ నూనెలోన వేగజాల ...అప్పడాలవాల.. వేచే వారెవరురా’’  ‘‘ఏవి ఉండనీ, ఉండకపోనీ, ‘అప్పడం’ లేని భోజనం భోజనంలా తోచదు! ‘అప్పడం‘ ఒక్కటి ఉంటే-అది మామూలు ప్లేట్‌మీలే అయినా, కడుపునిండా భోంచేసిన ‘తృప్తి’ కలుగుతుంది. బహుశా అది ‘అప్పడం’ మహత్యం ఏమో’’ . ‘‘ ‘అప్పడం’ ఈజ్ ఈక్వల్టూ ‘విందు భోజనం’ క్రిందే లెక్క! కరకర లాడుతూ పంటికింద అది కరిగిపోతున్నప్పుడు ఉండే మజా, మాటలతో చెప్పలేం! హోటల్లో భోం చేయడానికి వెళ్లినప్పుడు ముందు సలాడ్, అప్పడాలు పెడితే-కంచం వచ్చేలోగానే అప్పడాలు ‘హుష్ కాకీ’ అయిపోతాయి. మునుపు అప్పడాలు ఇళ్లల్లోనే ఒత్తుకుని, ఎండబెట్టుకుని, వాడుకునేవారు. పాపం! ఆర్థిక వెసులుబాటు అంతగా లేని విధవరాండ్రు కూడా-అప్పడాలు, వడియాలు అమ్ముకుని ఆణాకానీ సంపాదించుకోవడం ఉండేది’’ . ‘‘మా తాతయ్యగారికి ‘అప్పడాలపిండి’ అన్న బహుఇష్టంగా ఉండేది! వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి ముద్దవేసుకుని, అప్పడాల పిండి నంచుకుతింటే, స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్న ఆనందం కలిగేదనేవారు. ఏమున్నా లేకపోయినా-ఇంట్లో అప్పడాల...

కొన్నిమినీకవితలు..

కొన్నిమినీకవితలు.. ( సేకరణ:-.Kalyani Gauri Kasibhatla) 1 వలస మేధావులు ఖరీదైన దేశాలకు కారు చౌక కూలీలు 2.ఓల్డ్ఏజ్ హోమ్స్ సన్ స్ట్రోక్ బాధితుల శరణా లయాలు 3 శాంతి పావురం స్వయం గ వెళ్ళింది. భద్రత లేదని ఫి ర్యాదు చెయ్యడానికి, పాపం పదిమంది విందుకు  పలావు గ మారింది 4. నేడు పుస్త కాలకి  పురుగులు రేపు విదేశానికి  పరుగులు

కుంతి చూచుచుండె.......కరుణశ్రీ.

Image
కుంతి చూచుచుండె.......కరుణశ్రీ. ఏటి కెరటాలలో పెట్టె యేగుచుండ గట్టుపై నిల్చి యట్టె నిర్ఘాంతపోయి నిశ్చల నిరీహ నీరస నిర్నిమేష లోచనమ్ములతో కుంతి చూచుచుండె.

నాకు నచ్చిన రెండు పోస్టింగ్స్...

Image
నాకు నచ్చిన రెండు పోస్టింగ్స్... Lakshmi Vasanta..Jogarao Venkata Rama Sambhara... ఉత్పల మాల నేను కిచెన్ను సింకు కడ నిల్చి చివాలున గిన్నె తీసి చే యానెడునంతలోన అవియన్నియు జాలి గ నోళ్ళు తెర్చి మా ంలానము శుద్ధి చేయమని మంచిగ యన్నవి కృంగి పోతి నా మానసమందెదో తళుకు మనది అంట్ల పురాణ కావ్యమై. (mlaanamu = dirty, used ) సింక్ లో అంట్ల గిన్నెలు ,ఇంకెప్పుడు వస్తావు వసంతా ? అని జాలిగా పిలుస్తున్నాయి , అంతే మనకి ఇలాంటి పిలుపులే ..,పిల్లలు ఇల్లు వదిలాక, అంట్లు ,గిన్నెలు ,తపాళాలు ఇవే చప్పుడు చేస్తున్నాయి ..సహచరుడి కి నాకూ ఒక్కో నిట్టుర్పు కి ఒకో కథ ,అంత దీర్ఘ సంభాషణ అని అర్ధం అయిపోతుంది ..మాటలు లేకుండానే ..మొన్నటి వరకు ,మోడీ ప్రథాని ?? అంటూ సుదీర్ఘం గా టీవి ముచ్చట్లు తో గడిచి పోయింది . నా ఎఫ్ బి ప్రపంచం లో నేనూ ,అతని గోల్ఫ్ ప్రపంచం లో అతనూ ,ఇద్దరిని కలిపింది ..ఆకలి ..అవతరణి ఒకటి ..పెసరట్టు టిఫినీ అనుకున్నానే ..మరి లేవాలుగా ,కదలాలి గా ,సో ,అందుకే ఫ్రెండ్స్ బై నౌ ..ఈ లోపల ఒక ఏలూరు ప్రయాణం పొస్ట్ ఒకటి పోస్టించాను సమ్యం ఉంటే చూసి, చదివి ,ఒక లైకో ,ఒక కామెంటొ ..వేస్తారు అని ..హోప్ త...

కుంతి విలాపం......కరుణశ్రీ.

Image
కుంతి విలాపం......కరుణశ్రీ. "ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర మ్మని నే కోరగనేల? కోరితిని బో యాతండు రానేల? వ చ్చెను బో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగా నేల? ప ట్టెను బో పట్టి నొసంగనేల? యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్"

మహానుభావుడు – ఆయనను మరిచే తెలుగు వాడు ఎవరు లెండి..

Image
మహానుభావుడు – ఆయనను మరిచే తెలుగు వాడు ఎవరు లెండి హరికథలు  బుర్రకథలు నాటకాల తో  మాత్రం పురాణాలు తెలుసుకొంటున్న  తరానికి  తన పౌరాణిక పాత్రలతో జీవం పోసి  జనం గుండెల్లో  రాముడిలా కృష్ణుడిలా విష్ణువుగా  రావణుడిలా దుర్యోధనుడిలా కర్ణుడిలా  నిలిచిపోయాడు ఒక న్యాయమూర్తి  ఒక పోలీస్ ఆఫీసర్  ఒక దేశ సైనికుడు ఒక మేజర్  ఒక గుండమ్మ అల్లుడు  స్వాతంత్ర సమరయోధుడు  ఓ ప్రేమికుడు  తండ్రి  కొడుకు  సోదరుడు  ఓ రాజకుమారుడు  కుంటివాడు  పాండురంగడి భక్తుడు  ఇలా ఎన్నో పాత్రలతో  మన ఎన్ టీ యోడు అని ఆత్మీయంగా  పిలుచుకొనేంత ఎత్తుకు ఎదిగాడు దివి సీమ ఉప్పెనకు  జోలె పట్టాడు నవ శిశువు జన్మకాలమంత  సమయం తీసుకొని  రాజకీయ సునామీ సృష్టించి  ముఖ్యమంత్రి అయ్యాడు పేదవాడికి ఆయన పెట్టిన  రెండు రూపాయల కిలో బియ్యం  ఈ రోజు కూ  పేద వాడి  ఆకలి తీర్చుతోంది తాజాగా  విభజన తో  మానసికంగా నలి...

కృష్ణుని చిలిపి చేష్టలు..

Image
పోతన భాగవతం నుంచి కృష్ణుని చిలిపి చేష్టలు పడతీ! నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాలా పడుచులకు బోసి చిక్కిన కడవల బో నడిచె నాజ్ఞ గలదో లేదో? నీ పాపడు మా గృహముల నాపోవగ బాలు ద్రావ నగ పడకున్నన్ గోపించి పిన్న పడచుల వాపోవగ జిమ్ము కొనుచు వచ్చెం దల్లీ వారిల్లు సొచ్చి కడవల దోరంబు నెయ్యి ద్రావి తుదినా కడవల్ వేరింట నీ సుతుండిడ వారికి వీరికిని దొడ్డ వాదయ్యె సతీ! ఓయమ్మ ! నీ కుమారుడు మా యిండ్లను బాలు బెరుగు మననీ డమ్మా పోయెద మెక్కడి కైనను మాయన్నల సురభులాన మంజుల వాణీ!

పెళ్ళంటే పెద్ద శిక్ష

Image
సావిత్రిగారి ” బంది పోట్లు ” అనే కవిత నుండి.! ” పాఠం ఒప్పచెప్పక పోతే పెళ్ళిచేస్తానని పంతులు గారన్నప్పుడే భయమేసింది ! ఆఫీసులో నా మొగుడున్నాడు అవసరమొచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమాన మేసింది! వాడికేం ? మగమహారాజని ఆడా, మగా వాగినప్పుడే అర్థమై పోయింది పెళ్ళంటే పెద్ద శిక్ష అని మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని

ఎల్లోరా .....

Image
ఎల్లోరా గ్రామము మహారాష్ట్ర లో ఔరంగాబాద్ కు 30 కి.మి. (18.6 మైళ్ళు) దూరము లో ఉన్నది. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ది చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు మరియు సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. (12బౌద్ద గుహలు - నిర్మాణం -600-800 బి.సి.), 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక థల ను తెలుపుతాయి పదహారవ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టిందట. దీని నిర్మాణానికి సుమారు ఏడు వేలమంది కార్మికులు పాలుపంచుకున్నట్లు చెబుతారు. రాష్ట్ర కూటులకు చెందిన శ్రీక్రిష్ణ -1 కు దీనిని నిర్మించిన ఘవత దక్కింది. ఈ ఆలయం అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఆలయం అంతటా రామాయణ, భాగవత, భారత గాధలను శిల్పాలుగా చెక్కినారు. ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికి ఉంది.

కుమతీ శతకం

Image
పేరడీ.. ( కుమతీ శతకం ) అధరము తడిసీ తడయక మధురమ్ముగ కాఫి జుర్రి మరి సిగరెట్టున్ ప్రధమము నె ముట్టించెడు విధమే పో లైఫు లోని విజ్ఞత కుమతీ లంచము పంచక తినకుము కొంచెo చేనైన చేత గొనకుము సుమ్మీ లంచంబు పట్టు వారికి కించిత్తుగ రాల్చ కున్న కీడగు కుమతీ అడిగిన ప్రశ్నలు చెప్పని  మిది మేలపు టీచరులతోమెలగుట కంటెన్ పడిగొని ట్యూషను వెట్టుక బడి ప్యాసవ వచ్చు గాదె వసుధను కుమతీ అక్కరకు రాని బస్సును చక్కగ సినిమాకు రాక సణ గెడు భార్యన్ ఉక్కగ నుండెడు ఇంటిని గ్రక్కున విడువంగ వలయు గదరా కుమతీ ఇతిశ్రీ..( పుల్లెల రామ చంద్రుడు) సూచన ;;- పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం)

చరిత్రలో మొదటిధర్నా!

Image
చరిత్రలో మొదటిధర్నా!  ధర్నా కూచోడం అంటే, ఇంటి గడప దగ్గర అభోజనంగా అడ్డంగా కూచోడం. ధర్నా కూచోడం అనేది అసలు సిసలు భారతీయమైనదే.  పూర్వకాలంలో తమ అసంతృప్తిని వెళ్ళగక్కేందుకు స్త్రీలు, బాకీ వసూలుకు బలహీనులు పురుషులు వాడిన శాంతియుత ఆయుధం.  చరిత్రలో మొదటి ధర్నా చేసిన వాడు భరతుడు, తన మాట నెగ్గించుకోడానికి. రాముడు తండ్రి మాట మీద పట్టాభిషేకం కాదనుకుని పదునాలుగేళ్ళ వనవాసానికి వచ్చేసేడు. భరతుడు అప్పుడు పట్టణం లో లేడు, మేనమామ ఇంట ఉన్నాడు. దశరధుడు మరణించాడు, భరతుడిని వెంఠనే రమ్మని కబురు చేశారు. మరణ వార్త భరతునికి చెప్పకనే చేరింది, రాజ్యంలోకి రాగానే,తల్లిని నిలదీశాడు,నిందించాడు కూడా,తనకోసం రాజ్యం అడిగినందుకు. ”రాముణ్ణి తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తా”నని ప్రజలకి ప్రకటించి అడవులకు బయలుదేరాడు, మందీ మార్బలంతో, అలంకరించిన పట్టపుటేనుగుతో. రాముని దగ్గరకు పోయాడు, కాళ్ళ దగ్గర కూచున్నాడు. ”అన్నా! నేను రాజ్యం కావాలనికోరలేదు, నాకు రాజ్యం వద్దు, దానిని పాలించడానికి సమర్ధుడవు నువ్వే, వచ్చెయ్యి వెనక్కి,” అని ప్రాధేయపడ్డాడు. రాముడు వినలేదు, ”తండ్రిగారి మాట నిలబెట్టాడానికి అడవులకు వచ్చాను తమ్ముడూ...

సిరిదా వచ్చిన వచ్చును

Image
సమాయాతి యదా లక్ష్మీ నారికేళ ఫలాంబువత్ వినిర్యాతి యదా లక్ష్మీః గజభుక్త కపిత్ధవత్ సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా బోయిన బోవును కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ! లక్ష్మి వచ్చేటప్పుడు లలితంగా అనగా కొబ్బరికాయలోకి నీరు చేరినట్లు వస్తుంది, పోయేటపుడు ఏనుగు తిన్న వెలగపండులా పోతుందన్నారు బద్దెనభూపాలుడు. ఎంత నిజమెంత నిజం, సిరి, చిన్నమ్మ అంటే లక్ష్మీ దేవి, అన్ని పేర్లూ అమ్మ పేర్లే,అన్నీ అమ్మ రూపాలే, అందుకే సహస్రం అన్నారు, సహస్రమంటే అనంతమని అర్ధం. ఈ చరాచర ప్రపంచంలో కనపడేవన్నీ, కనపడనివీ కూడా అమ్మ వైభవాలే, ఒక్క ధనమే లక్ష్మి కాదు! అనంతాన్నీ కుదించడానికి ప్రయత్నం చేసి చెప్పేరు. అష్ట లక్ష్ములని. ధన,ధాన్య,విద్య…ధైర్య లక్ష్ములని. ఈవిడ కూడా ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇందులో ధైర్యలక్ష్మి కి రెండు అంగాలు సత్యము,ధర్మము. ఇవి పాటించినవాని వద్ద ధైర్య లక్ష్మి స్థిరంగానూ ఉంటుందిట. విజయలక్ష్మి, ఈమెకు రెండు అంగాలు వినయము, సౌశీల్యము, వినయం, సౌశీల్యం లేని విజయ లక్ష్మి, పొగరు, తలబిరుసు, విరుగుబాటు కలగచేస్తుంది. సిరితల్లి వచ్చేటపుడు చప్పుడు చేయదట, వచ్చి చేరేదెలాగో కూడా తెలియ...

తేనెమనసులు

Image
తేనెమనసులు వచ్చినపుడు ఆంధ్రా దేవానంద్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ మోహన్,ఆ రోజుల్లో కృష్ణకి నవ్వు రాదు,నడక రాదు,పరుగు రాదు!ముఖంలో అభినయం పలకదు!అయన సినిమాల్లో రాణించడు!అన్నారు సిని పండితులు! కాని కృష్ణ నిలదొక్కుకున్నాడు! రామ్మోహన్ తాగుడు వల్ల స్నేహితుల వల్ల ఆలస్యంగా షూటింగ్ లకు అతి ఆలస్యంగా వస్తూ నిర్మాతదర్శకులను తిప్పలు పెట్టి చెడ్డపేరు తెచ్చుకున్నాడు! సినిమా అమ్మాయిలు తాగుడు పాడు చేశాయంటారు!తన మీద తనకు నియంత్రణ సంయమనం లేని వాళ్ళు సినిమాల్లోనే కాదు ఏ రంగంలోనూ రాణించలేరు!

త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ | త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ ||

त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव | त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देवदेव || త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ | త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ || It is You that comes as the mother to nourish with the sap of life. It is You that comes as the father to protect with the sweat of the brow. It is You that comes as the friend to befriend in the hour of need. It is You that comes as the bosom companion, the sweetener of life. It is You that comes as knowledge to pour power in man to know Your wonderous Self. It is You that comes as the wherewithal to fulfill the desires that spring eternally in the human breast. Words fail, utterly fail to reveal that You really are unto me, O Lord of all our lords, You are this beggar's All. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय | मृत्योर्मा अमृतं गमय, आविराविर्म एधि || ఆసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ | మృత్యోర్మా అమృతం గమయ ఆవిరావిర్మ ఏధి || To Y...

నివేదిక

నివేదిక  స్కూల్ లో క్లాస్ జరుగుతుంటుంది .. స్కూల్ తనిఖీ ( Inspection )చెయ్యడం కోసం ఒక పెద్దాయన స్కూల్ కి వస్తారు.  ఒక తరగతి గదికి వెళ్తారు .. అక్కడ టీచర్ ఏదో పాఠం చెప్తూ ఉంటారు.  తనిఖీ చెయ్యడం కోసం వచ్చిన పెద్దాయన ఆ తరగతిలోని ఒక విద్యార్థిని ఒక ప్రశ్న అడుగుతారు. తనిఖీ అధికారి : బాబూ నువ్వు లేచి నిలబడు !  విద్యార్థి లేచి నిలబడతాడు. తనిఖీ అధికారి : రామాయణం ఎవరయ్యా రాసింది ? విద్యార్థి : నాకు తెలియదు సార్ , నేనైతే రాయలేదు !!. తనిఖీ అధికారి ఎవరో ఒకర్ని ప్రత్యేకించి అడగడం దేనికని .. విద్యార్థులనందరినీ ఉద్దేశ్యించి ...  ' రామాయణం ఎవరు రాసారో మీలో ఎవరైనా చెప్తారా ' అని అడుగుతారు. విద్యార్థులెవ్వరూ సమాధానం చెప్పరు .. అంతా మౌనంగా ఉంటారు.  అప్పుడు ఆ అధికారి ఉపాధ్యాయులవారిని అడుగుతారు .. 'ఏంటి మాస్టారు .. రామాయణం ఎవరు రాశారంటే ఎవరూ చెప్పట్లేదు ' దానికి ఆ ఉపాధ్యాయుని సమాధానం : 'ఏమో సార్ ..ఎవరు రాశారో నేను చూడలేదు '. ఆ సమాధానం విన్న అధికారికి చిర్రెత్తుకొస్తుంది పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని పిలిచి జరిగినదంతా చెప్తారు. దానికి ఆ హెడ్ మా...

ఒక స్టుడెంటు కష్టం...

ఒక స్టుడెంటు కష్టం... గాఢ నిద్రలో ఉన్న నేను, అమ్మా నాన్నలు ఏదో పెద్దగా మాట్లాడుతుంటే మెళుకువ వచ్చి, 'అబ్బా, సరిగ్గా నిద్రపోనియ్యరు కదా?' అని మనసులో అనుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారిపోయాను. 'ఒరేయ్ సుందరం లేవరా, నీ 10వ తరగతి మార్కులు వచ్చాయట్రా, నీకు 530నే వచ్చాయని నాన్న చిందులు తొక్కుతున్నారు ' అంటూ అమ్మ నన్ను లేపింది. అమ్మ వెనుక నాన్న నుంచుని ఉన్నారని చూసుకోకుండా, 'ఇంకెంత రావాలిటా?' కళ్ళు నులుముకుంటూ చిరాగ్గా అన్నాను. 'ఒరేయ్ అంట్ల వెధవ, ఇంకో 2 మార్కులు వచ్చుంటే కనీసం స్టేట్ 10వ ర్యాంకైనా వచ్చేది, మా అబ్బాయి స్టేట్ ర్యాంకులలో ఉన్నాడని గొప్పగా చెప్పుకునేవాడ్ని ' అని తిట్లపురాణం మొదలెట్టారు మా నాన్న. 'ఈయనెప్పుడూ ఇంతే, ఎన్ని మార్కులొచ్చినా సంతోషపడరు. అందరి నాన్నలూ ఇంతేనేమో?' అని మనసులో అనుకుంటూ నాన్న తిట్లు పట్టించుకోకుండా లేచి బాత్ రూమ్ లో దూరాను. బ్రష్ చేసుకుని ముందు గదిలోకి వచ్చాను. ఇంకా నాన్న సణుగుతూనే ఉన్నారు.  తట్టుకోలేక 'రెండు మార్కులే కద నాన్నా, విజయవాడలో నేనే ఫస్ట్ అయ్యుంటాను?' అన్నాను.  మా నాన్న వినిపించుకునే స్తితిలో ...

జంధ్యాల తిట్ల దండకం... నూతనం ...

జంధ్యాల తిట్ల దండకం... నూతనం ... కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి ఎదవా … ATM లో PAN card పెట్టే తింగరి సన్నాసి…. AC కోసం ATM కి వెళ్లి బాలన్స్ enquire చేసే కక్కుర్తి ఎదవ… 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ. తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే చెత్త నాయాల నల్ల cooling glass వేసుకుని నల్ల అద్దంలో చూసుకుంటూ మాడిపోయిన మసాలాదోసను అమావాస్య రోజు current పోయిన Time లో తినే కక్కుర్తి యెదవ. విమానంలో kerchief వేసి seat book చేసుకోటానికి parachute వేసుకెళ్ళే పిచ్చి వెధవ Sunday night PUB కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి. కుక్క వెంటపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి శవం మీద మరమరాలు ఏరుకొని bhel puri చేసుకొని తినే పెంట మొహమా.. అక్షయపాత్ర చేతిలో పెట్టుకుని అడుక్కుతినే వెదవ అష్ట దరిద్రమైన శని గ్రహానికి powder పూసి,...

అసలు పేర్లు తెలుసా?/

అసలు పేర్లు తెలుసా?/ 1.ఆత్రేయ ....................కిళాoబి వెంకట నరసింహాచార్యులు 2.ఆరుద్ర .........................భాగవతులశివశంకర శాస్త్రి 3.వోల్గా ............................పోవూరి లలితకుమారి 4.అంపశయ్య నవీన్ ................ డి.మల్లయ్య 5.బుచ్చిబాబు ...........................శివరాజు వెంకట సుబ్బారావు 6.కరుణశ్రీ ............................... జంధ్యాల పాపయ్య శాస్త్రి 7.దేవీప్రియ ...............................ఖాజా హుస్సేన్ 8.వడ్డెర చండీదాస్ ......................చెరుకూరి సుబ్రహ్మన్యే శ్వర స్వామి 9 పురాణం సీత ..........................పురాణం సుబ్రహ్మణ్య శర్మ 10.శ్రీ రమణ ..............................వంకమామిడి రాధాకృష్ణ

ఎంత పని చేసితివి వివాహమా....

Image
ఎంత పని చేసితివి వివాహమా.... నా కన్న ఇంటికి నన్ను అతిధి చేసితివి కదా....... అని వాపోయే ఒక వధువు...

ఇన్నాళ్ళు, మనం ఏదో కోల్పోయాము, అనే వేదన నుంచి బయట పడ్డట్టు అనిపించింది..

Image
శ్రీ నరేంద్ర మోడీ ని ప్రజలు అత్యధిక మెజారిటీ తో గెలిపించారు. మోడీ నోట జై భారత్ అని వింటూ వుంటే మనసుకు తృప్తి గా ఉంది. అయన గంగా హారతి కార్యక్రమం చూస్తూ ఉంటె ఎంతో సంతోషం అనిపించింది. ఏదో మనకు సంబంధించిన మన మనిషి, మన సొంతవాడు అక్కడ ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నట్టు అనిపించింది. మోడీ గెలిచినట్టు టీవీల్లో చుసిన తర్వాత చాలా కాలం తర్వాత మన దేశానికి మనం వచ్చినట్టు భావన కలిగింది. ఇది భారత దేశం, ఇది మనది, మనం భారత దేశ వాసులం అనే సంపూర్ణ భారతీయ భావన కలిగింది. కారణం ఏమిటో తెలియదు కానీ, ఇన్నాళ్ళు, మనం ఏదో కోల్పోయాము, అనే వేదన నుంచి బయట పడ్డట్టు అనిపించింది.

పంకజం గారెలు ..

పంకజం గారెలు .. ఒక ఊళ్ళో పంకజం అనే అమాయకురాలు ఉండేది. ఒక రోజు పంకజం మొగుడికి గారెలు తినాలని కోర్కె కలుగుతుంది. గారెలు చేయమని భార్యను అడుగుతాడు. దానికి పంకజం నాకు ఎలా వండాలో తెలియదు అంటుంది. దానికి పంకజం భర్త మన పక్కింటి బామ్మ గారు ఉన్నారు కదా ఆవిడని కనుక్కొని చేయి అంటాడు. సరే అని పక్కింటి బామ్మగారి దగ్గరికి వెళ్ళి గారెలు ఎలా చేయాలని అడుగుతుంది. దానికి బామ్మగారు చాలా ఈజీ నేను చెపుతాను ఎలా వండాలో. ముందు మినపప్పు నానబెట్టుకోవాలి అని అనీ అనగానే పంకజం నాకు తెలుసు నాకు తెలుసు అని వెళ్ళిపోతుంది. కొంచం సేపటికి వచ్చి ఆ తరవాత ఏమి చేయాలి అంటుంది. ఏముంది శుభ్రంగా కడిగి పొట్టు తీసి రుబ్బుకోవాలి అని చెప్పగానే నాకు తెలుసు.. నాకు తెలుసు అని వెళ్ళిపోతుంది.  పప్పు సరిగా నానకపోయినా అలాగే పప్పు పప్పు గా కడిగి రుబ్బుతుంది. మళ్ళీ బామ్మగారి దగ్గరకు వెళ్ళి ఆ తర్వాత ఏమి చేయాలని అంటుంది . ఆ తర్వాత నూనె కాగపెట్టి పిండి ని అందులో వేయటమే అని బామ్మ గారు చెపుతుండగానే మాళ్ళీ మాములుగానే నాకు తెలుసు ..నాకు తెలుసు అని నూనె కాగకుండానే వేస్తుంది. కాసేపటికి పంకజం భర్త వచ్చి గారెలు చేశావా అనగానే ఒక గ్లాసులో వేసుకొ...

యువకులలో సంకుచితత్వం పోలేదు.

Image
కొంతమంది యువకులలో సంకుచితత్వం పోలేదు. Male ego అప్పుడప్పుడు తొంగిచూస్తూవుంది కొన్నాళ్ళు భర్తతో కాపురం చేసి వితంతువైన విమలను అభ్యుదయభావావేశంతో మోహన్ పెళ్ళి చేసుకున్నాడు మొదటి రాత్రి ఆమె గదిలోకి వచ్చి సిగ్గుతో గుమ్మందగ్గర నిలబడింది  మోహన్ ఆమెకేసి చూసి “అప్పుడు కూడా ఇల్లాగే సిగ్గుపడ్డావా?" అని అడిగాడు వ్యంగ్యంగా  విమల చివుక్కున తలపైకెత్తి అతనికేసి అసహ్యంగా చూసింది

కోన సీమ రైలు బస్సు.....

Image
కోన సీమ రైలు బస్సు..... మా చిన్నప్పుడు మా అత్తలు కోటి పల్లి కి రైల్ ఉండేది....  దొరలూ పికేసారు.... కానీ పట్టాలు ఇంకా ఉన్నాయి అని చూపేవారు.... ఇపుడు అదే పట్టాలు మీద రైల్ బస్సు నడుస్తోంది.... ఎవరు చేయి ఊపిన ఆగి ఎక్కించు కుంటుంది. అదే కాకినాడ కోటి పల్లి ట్రైను.... Kakinada - Kotipalli Rail bus : Raise your hand and the rail will stop for you  Its an awesome experience travelling in this rail bus... This rail bus departs from Kakinada at 9.30 AM and reaches Kotipalli by 11.30 A.M.

కొన్ని మాటలు అలా పుట్టేస్తుంటాయి.

ఎవ్వరు పుట్టించకపోతే అసలు మాటలెలా పుడతాయి, వేసుకో వీడికి రెండు.... అన్న చందాన కొన్ని మాటలు అలా పుట్టేస్తుంటాయి. 1. తొక్క:- సహజంగా వొలిచి పారేసేదాన్ని తొక్క అంటారు, ఇక్కడ సదరు వ్యక్తికి రుచించని/నచ్చని ప్రతీ విషయం గురించి తొక్క అనే పదం ఉపయోగిస్తారు. 2. తొక్కలోది:- తొక్కలోనిది పండో లేక కాయో ఒలిచేవరకూ తెలియదు ఎవ్వరికైనా... అలాగే సందిగ్ధంలో సదరు వ్యక్తి ఉంటే వారు తొక్కలోది అనే పదప్రయోగం చేస్తారు. 3. పీకావులే:- కలుపు పీకితేనే పంట ఏపుగా పెరుగుతుంది అన్న సత్యం నుంచి ... పరిస్థిని మన అదుపులోకి తెచ్చుకుంటే పీకాడని, లేదంటే ఏమీ పీకలేకపోయాడని ప్రయోగం జరుగుతుంటుంది. 4.బొంగు:- వెదురు బొంగు పైకి దృఢంగా కనపడినా లోపలంతా డొల్లే అనాది ఇక్కడ అర్ధం.... పైకి తెలిసినట్టు కనపడి తర్వాత నిర్ఘాంతపోయే సందర్భంలో ఈ ప్రయోగం జరపబడుతుంటుంది. 5.అదుర్సు:- సహజంగా కంపించేది విపిరీత పరిణామాలు లేదా ఊహించని మార్పులు జరిగినప్పుడే... అలాంటి సందర్భంలో ఈ ప్రయోగం. 6.చింపావులే:- తప్పురాస్తే కాగితాన్ని చింపేస్తాంగా... నువ్వు తప్పు చేసావోచ్ అని చెప్పడానికి ఈ ప్రయోగం. 7.ఇరగదీసావ్:- పొయ్యిలో పెట్టే కట్టెల్ని చిన్నవిగా/...

అనువు కానిచోట….

Image
అనువు కానిచోట…. అనువుకానిచోట అధికులమనరాదు కొంచముండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచమైయుండదా విశ్వదాభిరామ వినుర వేమ.హిమాలయాల్లోని మానస సరోవరంలో ఉండే హంసల గుంపునుంచి ఒక రాజహంస దారితప్పి ఒక కాకులగుంపులో దిగింది. ఎప్పుడూ ఊరుదాటి ఎక్కడికీ వెళ్ళని కాకులు ఆ హంస అందాన్ని, ఠీవిని చూసి ఆనందపడ్డాయి. ఇంత అందంగా కూడా ఉంటారా మనజాతివారని. అందరూ చుట్టూ చేరి పలకరించి ఎక్కడనుంచి వస్తున్నావు, ఎవరు నువ్వు అని ప్రశ్నించాయి. తనపేరు రాజహంస అని నివాసం మానస సరోవరమని అది హిమాలయల్లో ఉంటుందని చెప్పేటప్పటికి, హంస గొంతు విని, పలుకు హొయలు విని కాకులు కొద్దిగా ఈర్ష్య పడ్డాయి, తమ రూపంతో, గొంతుతో పోల్చుకుని. ఇది వెళ్ళగక్కేందుకు ఒక కాకి ఇంత అందంగా, తెల్లగా ఉన్నావు రోజూ ఏమితింటావని అడిగితే మానస సరోవరంలోని లేత తామరతూడులు తింటానని చెప్పింది, దానికి కాకి ”ఏం! అక్కడ నత్తలు పీతలు దొరకవా?,” అని అడిగితే హంస ఆశ్చర్యపోయింది. అయ్యో పీతలు నత్తలు ఎంత బాగుంటాయో వాటిని తినకుండా నీ బతుకు వ్యర్ధమని ఎకసెక్కెమాడాయి. కాకి హంసని తెలివితక్కువదానిగా అంచనావేసి, తమరూపంతో, గొంతుతో పోల్చుకుని అసూయపడుతూ నువ్వింత సున్నితంగా, పెద్దగ...

విజయవాడ సత్యనారాయణ పురం.

మేము విజయవాడ సత్యనారాయణ పురం లో ఉండేవాళ్ళము. అక్కడ ఓ చిన్న రైల్వే స్టేషన్ ఉండేది, ప్యాసింజర్ ట్రెయిన్లు తక్కా మిగతావేవి ఆగేవి కాదు. సర్కార్ ఎక్స్ప్రెస్ మటుకూ స్టెషన్ దగ్గరకు రాగానే డ్రైవర్ స్లో చేసేవాడు, చాలా మంది దిగిపోయేవారు. అల్లా దిగే వారిలో ఎక్కువమంది రైల్వేలో పని చేసేవాళ్ళు ఉండేవారు. సత్యనారాయణ పురం స్టేషన్లో దిగకపోతే, మెయిన్ రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి, మళ్ళీ బస్సో, ఆటోనో పట్టుకు రావాలి. అందుకే చాలా మంది కూసింత రిస్కైనా దిగిపోయేవారు. మా సందులో ఉన్న సత్యనారయణ గారు కూడా అల్లానే దిగేవారు. నేననుకోవటం చాలా ఏళ్ళ నుంచి దిగివారనుకుంటా. రైల్వే పోలీసతను వేరే వాళ్ళతో చెబుతున్నాడు 'చాలా ఏళ్ళ నుంచీ దిగుతున్నారు ఈయన, ఈ రోజు దిగుతుండగా పట్టుకున్న డోర్ హ్యాండిల్ జారి ఒక కాలు స్టెషంకి, ట్రెయిన్ కి మధ్య ఇరుక్కుపోయింది. అల్లా ఈడ్చుకుంటూ పోయింది. గార్డ్ చూసి ఎర్రజెండా ఊపి ట్రెయిన్ ఆగేలోపలే లోపలకి లాగేసింది. ' అని. ఒక్కసారి నా ఒళ్ళు జలదరించింది. ఊహించుకోవటానికే భయమేసింది. ఈ లోపల ఆంబులెన్సులో శవం వచ్చింది. మొత్తం కట్లు కట్టి ఉంది. ఆయన భార్యా, కొడుకుని ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. నేనది చూడల...

ఏగూటిచిలక ఆగూటిపలుకే పలుకు.

Image
ఏగూటిచిలక ఆగూటిపలుకే పలుకు. వెనక, అబ్బో చాలా ఏళ్ళక్రితం ఒక బోయవాడు అడవిలోకి వెళ్ళి మాట్లాడే రెండు రామచిలకలను పట్టి పంజరంలో పెట్టి తెచ్చాడు. శాస్త్రిగారు ఒక చిలకను కొన్నారు  ఒక రైతు బామ్మ రెండో చిలకను కొంది  శాస్త్రిగారి చిలక కొన్నాళ్ళకి అక్కడ సంభాషణలను పలకడం అలవాటు చేసుకొంది.  రెండో చిలక బామ్మ గారి ఇంట్లో వుందికదా.  ఆబామ్మగారు మనమరాలి పట్ల మహా కర్కోటకంగా వ్యవహరిస్తుంది. ప్రతిదానికీ ఆంక్షలే.  ఆ మనుమరాలుకు వళ్ళుమండి నీదుంపతెగ, చావు దొంగపీనుగా, నీకళ్ళు మాడిపోనూ అని తిట్టుకునేది.  చిలక్కి అవే అలవాటయ్యాయి.  ఆ మాటలు విని విసిగిపోయిన బామ్మ గారు శాస్త్రిగారి దగ్గరకు వచ్చింది సలహా కోసం.  రండి, కూర్చోండి, మంచినీళ్ళు కావాలా అని చిలుక ఆహ్వానించడం విని ముచ్చటపడి శాస్త్రిగార్ని తన చిలుకకు కూడా మంచి మాటలు వచ్చేవుపాయం చెప్పమంది.  కొన్నాళ్ళు నాచిలుకను తీసుకుపోయి నీచిలుక పంజరం పక్కన పెట్టు. ఈ మాటలు దానికి అబ్బుతాయి అని తమచిలుకను ఇచ్చారు  బామ్మ గారు ఈ చిలుకను పంజరంతో తీసుకుపోయి తన చిలక పక్క తగిలించి ఒక జామకాయ కూడా పంజరంలో పెట్టింద...

తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503)

Image
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి. కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుంద...

" స్వామీ ! ఐశ్వర్యా అంటే లక్ష్మే కదా "

Image
" స్వామీ ! ఐశ్వర్యా అంటే లక్ష్మే కదా "! . ఏకాంత వేళలో వున్న శ్రీవారు , శ్రీదేవి తో " దేవీ ! చూడు ! ఈ ప్రపంచములో ఎంత ధనవంతులైనా , రూపవంతులైనా , అధికారులైనా నా దర్శనము కోసం ఎంత ప్రయాసపడుతున్నారో " " . అవును స్వామీ ! తమరు శ్రీ నివాసులు కదా " అంటూ మురిసిపోసాగింది . అందులోని మర్మమును గ్రహించిన స్వామీ " అహా ! అలా అని అది నీ గొప్పే అని అంటావా ? , ఎంతటి వారనా నా కోసము ఇక్కడకు కాలినడకన వస్తారు , అహము లేకుండా నిలువుదోపిడి ఇస్తారు , అందము మీద వ్యామోహము వుండకుండా సిరోజాలు సమర్పించుకుంటారు , కొందరు అడుగడుగు దండాలు , పొర్లు దండలు , తులాభారాలు ఇలా ఎన్నో మొక్కులు మొక్కి తీరాగానే శరీర శ్రమ అని లేకుండా మొక్కులు చెల్లిస్తారు , ఇవన్నీ కూడా శ్రీ నివాసుడనేనా చేస్తారు ? " అంటూ చిలిపిగా నవ్వుతూ..." పోయిన ఏడాది వచ్చిన ఈ దేశాధ్యక్షుడు , ఆ తరువాత వచ్చిన ఇంకో రాజకీయనాయకురాలు , కానుకగా మూడు కోట్లు ఇవ్వడము కూడా శ్రీనివాసుడనేనా , అదిగో అటు చూడు ఎంత మంది భక్తులో నిత్యము " గోవిందా , గోవిందా " అంటూ స్మరిస్తూ నా దర్శనము కోసం ఎంత ప్రయాస పడుతున్నారో , ...

ప్రాప్తం.

ప్రాప్తం. ఒక రోజు పార్వతీపరమేశ్వరులు భూలోక విహారానికి బయలుదేరారు. భూలోక సౌందర్యానికి ముగ్దురాలయిన పార్వతీదేవి వరమేశ్వరునితో "నాథా! భూలోకము ఎంత రమణీయము గా నున్నది! ఈ వనములు, ఈ పక్షులు, జలాశయములు కన్నుల పండువుగా ఉన్నవి. ఇట్టి సుందర ప్రదేశములో నివశించుచున్న జనులు ఎట్టి పుణ్యమును చేసియున్నారో కదా, ఈ భవనములు చూడుడు ఎంత అందము గా ఉన్నవి, ఈ జనుల వస్త్రములెఒత అద్భుతముగ నున్నవి. మా అక్క లక్ష్మీ దేవి సక్షాత్తూ కొలువై ఉన్నది కదా ఇచట" అని పరవశురాలయింది. ప్రియసఖి ఉత్సాహమును గమనించి నవ్వుకున్నాడు మహాదేవుడు. అలా కొనసాగిన వారి విహారం ఒక చోట నిలిచింది. అక్కడ ఒక ముసలి బిచ్చగాదు "అమ్మా! అన్నపూర్ణమ్మ తల్లీ! పట్టెడన్నం పెట్టండమ్మా!" అని అతి దీనంగా బిచ్చమెత్తుకుంటున్నాడు. అది చూసిన ఆన్నపూర్ణ హ్రుదయం ద్రవించిపోయింది. సజల నయనాలతొ పరమేశ్వరుని తో, "స్వామీ! ఏమి ఈ వైపరీత్యము? ఒక చోట రత్న మాణిక్యలతో తుల తూగు సుందర భవనములా? ఒక పక్క పొట్టకు పటికెడు మెతుకులు దొరకని దుస్థితి యా? ఏమి ఈ మాయ స్వామీ? అని ప్రశ్నిఒచింది. దానికి శంకరుదు చిరునవ్వు నవ్వి, "సఖీ పార్వతీ, ఈ పేదవాని ఆకలి చూసి నీ మాత...

గుంపులో గోవింద !

Image
ఏదో అందరూ ఇండియాలో ఉండి , ఒకరు అమెరికా వెళ్తే గొప్పకానీ , అందరూ అమెరికా వెళ్ళినవారే అయితే గొప్పేం ఉంది? గుంపులో గోవింద !  అలా అని గొప్పలు చెప్పుకోకపోతే ఎలా? అందుకే మనసూరుకోక యధాశక్తిగా గొప్పలు చెప్పుకోవడం.. " మా అబ్బాయి ఉండే ఊళ్ళో చలికాలం అంతా మంచు మయం , తెల్లారేసరికి దూదికుప్పల్లా మొకాటివరకు మంచు , ఎంతబాగుంటుందో చూడ్డానికి " అని ఒకరంటే " నిజమే పాపం అదో పీడాకారం , తెల్లారి లేస్తూనే పారలు , పలుగులు పట్టుకొని ఆ మంచంతా తవ్విపోసుకోవాలిట పాపం , వెధవ చాకిరీ , మా అబ్బాయి ఉండేది సీ కోస్ట్ , లక్షణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది వాతవరణం " అని మరొకరి సానుభూతి . "కిందటిసారి మేము వెళ్ళినప్పుడు నయాగరా చూశాం ఎంత బాగుందో " అని ఒక ఇల్లాలు కళ్ళు విప్పార్చుకొని చెప్తే.. " భలెవారేలెండి ! అసలు నయాగరా అందం చూడాలంటే కెనడా వైపునుండి చూడాలి , మొన్న మేము వెళ్ళొచ్చాము , ఈ సారి మీరూ వెళ్ళిరండి " అంటూ మరొక ఇల్లాలి సలహా.

రాయాలా? రాయలా!

రాయలా రాయ లా రాయాలా రాయాలా? రాయాలా రాయాలా    ( వ్రాయాలనా అనే అర్థం లో ) రాయలా రాయలా?     ( ఇంకా వ్రాయలేదు) రాయాలా రాయాలా     ( వ్రాయాలనా అనే అర్థం లో ) రాయాలా? రాయలా!     ( ఇంకా రాయలేదు ) రాయాలా రాయాలా? రాయ లా  రాయలా?      ( దేవరాయ లోని రాయ వ్రాసినట్టు రాయాలా? ) రాయలా రాయలా?     ( దేవరాయలు లోని రాయలు ) రాయాలా రాయాలా?     (  నేను వ్రాయాలనా?) రాయ లా రాయ లా రాయాలా రాయాలా? ( దేవరాయలు లోని రాయ. రాయా, నేను వ్రాయాల్నా? )

సాహిత్య హాస్య రస గుళికలు.

Image
సాహిత్య హాస్య రస గుళికలు. మన పూర్వ కవులకు ఎంత రచనా పాటవ మున్నా, ఎంత వాగ్థాటి వున్నా మన పల్లె పడుచుల ముందు ఘోరంగా ఓడిన సందర్భాలు కోకొల్లలు.నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల లో చదివే రొజుల్లో తెలుగు పంతుళ్ళు , నిజానికి భాషా పండితులు. (ఇప్పటి పరిస్థితి తారుమారు అని విన్నా).వాళ్ళు పఠాలు చెప్తూ మధ్యలో కొన్ని చమత్కారలు చెప్తూ వుండేవారు. వారు ప్రసాదించిన విద్యలో నుంచి కొన్ని హాస్య రస గుళికలు. ముందుగా సంగీత స్వరాలను ఒక రసజ్ఞుడు కంద పద్యములో చెప్పి తన తృష్ణ ఎలా తిర్చుకున్నాడో చుడండి. మీకు సంగీతము వస్తే పాడుకోండి. ( ఏమండోయ్ అర్థము లేదనుకునేరు, పద్యానికి శుభ్రంగా అర్థము వుంది. కాకపొతే వాడిన అక్షరాలే సంగీత స్వరాలు) మా పని నీ పని గాదా పాపమ మా పాపగారి పని నీ పనిగా నీ పని దాపని పని గద పాపని పని మాని దాని పనిగానిమ్మా !! విజయ నగర రాజ్యం లో తెలుగు ఒక వెలుగు వెలిగిన సంగతి మనందరికీ తెలుసు కదా. అక్కడ ఒక పూవులమ్ముకునే ఆమెకు కవికి ఈ రకంగా సంభాషణ జరిగింది. " వెలది నీ ఈ దండ వెల ఎంత? " " నా దండకును వెలబెట్ట నెవ్వని తరంబు ?" అని పూలమ్మి చెల్లు మనిపించింది. ఇక్కడ ర...

కష్టంలో సుఖం, సుఖంలో కష్టం

Image
ఆలోచనలు… అభిమానంతో మీ ప్రవీణ…..  . కష్టంలో సుఖం, సుఖంలో కష్టం కష్టం నన్ను కష్టిద్దామని ఎంతో కష్టపడుతుంది. కొన్ని సార్లు నాకంటే పెద్దగా, మరి కొన్నిసార్లు నా కంటే చిన్నగా, కొన్నిసార్లు నా ముందు, మరి కొన్నిసార్లు నా వెనుక…నీడల నన్ను వెంబడిస్తుంది. కష్టానికే తెలియని కష్టమేమిటంటే, కష్టం తన ప్రతీ కష్టంలోనూ నన్ను సానపెడుతుంది. కష్టం తన కష్టాల సమ్మెట పోటులతో నన్ను శిల్పంగా చెక్కుతుంది. కష్టం తన కష్టంతో నన్ను కష్టించి కష్టించి….. చివరకు కష్టాలకు నేను అలవాటైపోవటం కాదు, నాకే కష్టాలు అలవాట్లుగా మారిపోయాయి. ఇక, కష్టం నన్ను కష్టించటం మానేసింది. ఎప్పుడైతే కష్టాలకు నేను లొంగిపోకుండా ఎదురు నిలిచానో, అప్పుడు కష్టం తన మనసు కష్టపెట్టుకుని, నన్ను కష్టించటం మానేసింది. అప్పుడు…అప్పుడు…కష్టాల కడలిలో నుంచి సుఖం ఉద్భవించింది. సుఖం భాజా భజంత్రీలతో, పల్లకీలో ఊరేగుతూ గుంపుగా వచ్చింది. సుఖం ఒంటరిగా రాకుండా బోల్డు నేస్తాలను మోసుకొచ్చింది. కొన్నినాళ్ళు, సుఖం నన్ను చాలా సుఖ పెట్టింది. సుఖమైన మైకంలో నన్ను మురిపించింది. మరి కొన్నినాళ్ళు గడిచి గడవక ముందే, సుఖాన్ని సుఖంగా అనుభవించక ...

రాముని వారము మనము, మనకేల విచారము...

Image
Sivarama Krishna Rao Vankayala. .తోడబుట్టిన అన్నగారు కాసులు తేలేదని వెలివేసినట్టు వదిలేసినా, ఆ కటికపేద సంసారి ఏమాత్రం బాధ పడలేదు. ఇంకో విషయం, అసలు ఆయనకి ఈ పూట గడవడం ఎలా అన్న చింతే లేదు, 'రాముని వారము మనము, మనకేల విచారము' అన్న గుండె ధైర్యం తప్ప! ఎవరు తనను వదిలేసినా ఆయనకు ఎప్పుడూ గుండె జారలేదు. పైగా తన బలగాన్ని చూసుకొని, తనకు వీరే కదా పరమబాంధవులు అనుకొని ఆనందించడం పరిపాటి అయనకి! ఆయనే సంగీత సద్గురువు త్యాగరాజు గారు. తన బలగాన్నీ, ఆ బలగానికి బలం అయిన తల్లిదండ్రుల్నీ మనకి చూపిస్తున్నారు: సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన ధాత -భరతాదులు సోదరులు మాకు ఓ మనసా || (సీత) పరమేశ వసిష్ఠ పరాశర నారద శౌనక శుక సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు ధర నిజ భాగవతాగ్రేసరులెవరో వారెల్లరు వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా || (సీత) "సాక్షాత్తు ఆ సీతమ్మే మా అమ్మ. సీతమ్మ అమ్మ అయితే, శ్రీ రాముడే కదా తండ్రి!  వాయునందనుడు ఆంజనేయుడు, సుమిత్ర పట్టి లక్ష్మణుడు, వినతా సుతుడు గరుత్మంతుడు, శత్రువులను మర్దించే శత్రుఘ్నుడు, ధాత అనిపిలువబడే బ్రహ్మదేవుడు, భరతు...

శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’

Image
శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి బ్రాహ్మణులను బ్రతికించిన లెక్క యుక్తి: సీ. తార్కికుల్ నలుగురు, తస్కరు లేవురు, శ్రోత్రియు లిద్దరు, చోరుఁ డొకఁడు, భూసురుల్ ముగ్గురు, ముడియవి ప్పొక్కఁడు సకలార్థనిపుణుఁడు శాస్త్రి యొకఁడు, యల్లాపు లిద్దఱు, యాచకు లిద్దఱు, బరివాండ్రు ముగ్గురు, బాపఁ డొకఁడు, ఆగడీ లిద్దఱు, ఆరాధ్యు లిద్దఱు, దుష్టాత్ముఁ డైనట్టి దొంగ యొకఁడు, తే.గీ. అరసి వారల నొక శక్తి యశనమునకు సగము గోరఁగ, నవసంఖ్య జగతిసురుఁడు చెప్ప, దొంగలు హతమైరి, చేటుదప్పి విజయ మందిరి యావేళ విప్రు లెల్ల. ఈ పద్యంలోని కథ .... కొందరు బ్రాహ్మణులు అడవిలో వెళ్తుంటే దొంగలగుంపు అడ్డగించింది. ఎంత బతిమాలినా వదలలేదు. దొంగలు ఆ బ్రాహ్మణులను దగ్గరే ఉన్న శక్తిగుడికి తీసికొనివెళ్ళి బాధించడం మొదలుపెట్టారు. ఇంతలో గుడిలోని మహాకాళి ఘోరాకారంతో ప్రత్యక్షమై "మీలో సగంమంది నాకు బలి కావాలి. లేకుంటే మమ్మల్నందరినీ భక్షిస్తా" నన్నది. దొంగలు పదిహేనుమంది. బ్రాహ్మణులూ పదిహేనుమంది. అందువల్ల ‘బలికావలసిన పదిహేనుమంది ఎవరు?’ అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు బ్రాహ్మణులలో ఒక యుక్తిశా...

“సత్యం” కు గల గొప్పతనం!

Image
“సత్యం” కు గల గొప్పతనం పస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అయినదానికి, కానిదానికి, అసలు అబద్దం ఆడవల్సిన అవసరంలేని సందర్భాలలో సైతం అబద్దాలు ఆడడం గమనించవచ్చు... అసలు సత్యానికి ఉన్న గొప్పతనం ఇక్కడ తెలుసుకోండి. సత్యమంటే నిజం. సత్యముకు మించిన ధర్మము లేదు. వేదకాలం నుండి సత్యమునకు విశిష్ట స్ధానం ఉంది. సత్యం పలికితే పుణ్యం లభిస్తుంది, అబద్దం ఆడితే పాపం వస్తుంది. ధర్మం, సత్యం, అహింస మెదలైన సద్ధర్మాల మీదనే సకల చరాచర సృష్టిమయమైన లోకం ఆధారపడి ఉంది. ఆదికవి అయిన నన్నయ్య సత్యం గురించి ఇలా అన్నాడు.. “ నూరు బావుల కంటే ఒక దిగుడు బావి మేలు, నూరు దిగుడు బావులకంటే ఒక యజ్ఞం మేలు, నూరు యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు, నూరుమంది పుత్రులకంటే ఒక సత్యవాక్యం మేలు ” వేయి అశ్వమేధ యాగాలు చేసిన ఫలం కన్నా, సత్యం వాక్యానికి ఉన్న ఫలం ఎక్కువ. అన్ని ధర్మాలకంటే సత్యము గొప్పదని అంటారు. గురుకులాలో సత్యబోధన మహాకవి కాళిదాసు కూడా “ సత్యాయ మిత భాషిణే ” అని సత్యాన్ని ఎలా సాధించవచ్చో తెలిపాడు. హరిశ్చరిందుడు, గాంధీజీ మెదలైన ఎందరో సత్యాన్ని ఆచరించి మహాత్ములై పకాశించినారు. లోకం సత్యవంతులని ఎంత గౌరవిస్తుందో, అబద...

'మనసున మల్లెల మాలలూగెనే'

Image
'మనసున మల్లెల మాలలూగెనే'  ఆనాటి సినిమాలకు ఈనాటి సినిమాలకు ఎంతో తేడా ఉంది. పాత సినిమాల గురించి  చెప్పుకోవాలంటే  ఎన్నోమంచి  చిత్రాలు  ఉన్నాయి. ఎప్పటికి గుర్తుండి పోయే   మధురమైన ఆణిముత్యం మల్లీశ్వరి. బి.ఎన్.రెడ్డిదర్శకత్వంలో రామారావు, భానుమతిల నటన వెరసి ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా రూపుదిద్దుకున్న చిత్రం ఇది. ఈ సినిమా విడుదలై 61ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ నిత్యనూతనంగా, సంగీత సాహిత్యాల అందాల భరిణగా ఉంటుంది. మల్లీశ్వరి... తెలుగు సినీ జగత్తులో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కళాఖండం. దర్శకుడిగా బి.ఎన్. రెడ్డినీ, గేయ రచయితగా కృష్ణశాస్త్రినీ, సంగీత దర్శకుడిగా సాలూరు రాజేశ్వరరావునీ చిరస్మరణీయం చేసిన అజరామర చిత్రం. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై సెట్టింగులు, వస్త్రాలంకరణ పరంగా ప్రఖ్యాత 'మొఘల్-ఎ-ఆజమ్'కు ఏమాత్రం తీసిపోదని విమర్శకుల అభినందనల్ని అందుకున్న ఆణిముత్యం. అందుకే విడుదలై అరవై సంవత్సరాలు దాటినా  'మల్లీశ్వరి' నిత్యనూతనం. మిగతా దర్శకులతో పోలిస్తే బి.ఎన్. రెడ్డి భిన్నంగా కనిపిస్తారు. ఆయన తీసిన ప్రతి చిత్రమూ కళాఖండమన్న పేరు ఆర్జించింది. కేవలం పదకొ...

టైం ఎందుకు ఉండదు?

టైం ఎందుకు ఉండదు? (అభిమానంతో మీ ప్రవీణ…..) “అస్సలు తీరట్లేదంటే నమ్మండి. చాలా బిజీగా ఉంటున్నాను” “ఊపిరి పీల్చుకోవటానికి కూడా టైం దొరకట్లేదు” “లైఫ్ ఇస్ డామ్ హేక్టిక్” కాలమానాలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడుగునా ఇవే మాటలు పదే పదే వల్లె వేసేవారికి ఓ ఉచిత సలహా….మీరు పనులన్నీ పక్కన పడేసి యుద్ధప్రాతిపదికన హిమాలయాలకు ప్రయాణం కట్టి, బ్రహ్మ విష్ణు శివ పార్వతి మొదలగు దేవతలు, దేవుళ్ళ దర్శనం కొరకు ఘోర తపస్సు ఆచరించి రోజుకు నూట పాతిక గంటలు ఉండేలా వరం పొంది, అందులో ఓ రెండు మూడు గంటలు ఉచిత సలహా నిమిత్తం నాకు ఇచ్చేయ్యాలని మనవి. గమనించాలి, పనులన్నీ పక్కన పడేసి అన్నానే కానీ పనులు అవచేసుకుని అనలేదు! నిజమే…జీవితంలో కొన్ని కొన్ని దశలలో చాలా బిజీగా ఉంటాం. నిజంగా… జీవితమంతా అంత బిజీగా ఉంటామా?? జీవించటానికే తీరిక లేనంత పనులా మనకి?! జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. మనమే వండుకోవాలి, మనమే వడ్డించుకోవాలి. కనీసం ముద్దలు నోట్లో పెట్టుకునే తీరిక లేదు అనేవాళ్ళతోనే చిక్కు.

కాఫీ కప్పే!........( ప్రవీణ.గారి అద్బుత రచన ….)

కాఫీ కప్పే!........( ప్రవీణ.గారి  అద్బుత  రచన ….) . సగం తాగిన కాఫీ కప్పును విసురుగా నెట్టేసాడతను టేబుల్ పై ఒలికిన చుక్కలపై ఒక్క చూపన్నా చూడకుండా తన షులో తన పాదాలను ఇరికించేసుకుని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. భారాన్ని మోస్తూ ముడుచుక్కూర్చుంటే ఇళ్ళు సాగదని చీర కొంగుకో, చున్నీ అంచుకో మూటగట్టగలిగినంత మూటగట్టి నడుం బిగించిందామె. మూల మూలలా పొడిగుడ్డతో దుమ్మును దులుపుతూ కాఫీ టేబుల్ దగ్గరకు వచ్చింది. బాధగా కసిగా గట్టిగా తుడిచినా వదలవే ఆ చుక్కలు! ఆమె పెదవులు బిగిసి ఉన్నాయి. నుదిటి నుంచో, కంటి నుంచో ఓ చుక్క రాలిపడింది. ఎండిన ఆ మరకలపై చెమ్మ చేసి వదిలించింది! పిల్లల పాలు పోపులో ఆవాలు ఏవి గతి తప్పలేదు! సూరీడు సెలవు తీసుకునే వేళ అతను తిరిగిచ్చాడు తళతళలాడుతున్న టేబుల్ పై సిద్ధంగా ఉన్న కాఫీ కప్పును అందుకున్నాడు. చిక్కటి నురగలు కక్కే కాఫీ అతనికి ఇష్టం! లోపల వంటింటి గట్టుపై విరిగిపోయిన పాలను ఆమె శుభ్రం చెయ్యలేదని ఆమె కప్పు అంగులమైనా కదలలేదని అతనికి తెలీదు! x

మనిషి మారలేదు, మమత తీరలేదు

Image
మనిషి  మారలేదు, మమత తీరలేదు గుండమ్మ కధ సినిమాలో మహా నటులు NTR, సావిత్రి పాట  “మనిషి మారలేదు, మమత తీరలేదు” అనే పాట మనం ఎన్నటికీ మర్చిపోలేము. అందులో ఎంత నిజం వుందో. “వేశము మార్చెను, బాషను మార్చెను, మోసము నేర్చెను, అసలు తానే మారెను  అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు.” సావిత్రి గారి అభినయం అంతా ఆ   కల్లలోనే చూపించేస్తారు. పింగలి నాగేశ్వర రావు గారు ఎంత బాగా చెప్పారు ఆ రోజుల్లోనే. మనందరం వేశం మార్చాము. జీన్స్, ప్యాంట్స్, స్కర్ట్స్ లోకి మారాం. చీరలు, పంచెలు అటకెక్కించాం. ఎప్పుడైన పండగలకు దింపుటాము లేండి. భాష మార్చాము. English నేర్చాము. రకరకాల accents మాట్లాడటం. తెలుగు ని టెలుగు చేశాం. మోసము నేర్చెను. నేర్చామా నేర్చలేదా?!! అసలు తానే మారేను. yes, మారాము. మన ఆలోచనలు, ఆశలు, ఇస్టాలు, ప్రైయారిటీస్ అన్నీ మారిపోయాయి. ఏసీ, కారు లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేము. అయినా మనిషి మారలేదు, మమత తీరలేదు. అవును మనం మారలేదు, మన మమత తీరలేదు. ఏ దేశం  వెళ్లినా, ఎంత ఎత్తుకు ఎదిగినా… అభిమానం,ఆత్మేయతా, ప్రేమ లేకుండా బతకలేము. మన అనే మమత లేకపోతే మనుగడ సాగించలేము. అందుకే...

ఒకప్పుడు TV చూడటమంటే ఎంతో సరదాగా ఉండేది.

Image
ఒకప్పుడు TV చూడటమంటే ఎంతో సరదాగా ఉండేది. ఆదివారం సాయంత్రం వచ్చే సినిమా కోసం వారం అంతా ఎదురుచూసేవాళ్ళము. సినిమా బాగుందా బాగోలేదా అనే ప్రశ్నే ఉండేది కాదు. వారం మధ్యలో వచ్చే చిత్రలహారి (తెలుగు సినిమా పాటలు) చూడటానికి మాకు పర్మిషన్ ఉండేది. ప్రతీ పాటను ఆస్వాదించేవాళ్ళము. ఆదివారం మహాభారతం వచ్చేటప్పటికి కుంకుడుకాయలతో తలారా స్నానం చేసి, కళ్ళు నలుపుకుంటూ TV ముందు కూర్చునే వాల్లము. మా నాన్న గారు మహాభారతంలో వచ్చే సీన్స్ అన్నే విడమర్చి చెప్పేవాళ్ళు. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మహాభారతం చూడటానికి మా ఇంటికి వచ్ఛేవాళ్ళు. అతి సర్వత్ర వర్జయేత్ అని, ఇన్ని టీవీ చ్యానెల్స్ వచ్చి మన అనందాన్ని హరించేశాయి.

ఉత్పలమాల

Image
రోజులు గడిచేయి పెద్దవాణ్ణయ్యేను పెళ్ళాం పిల్లలూ వచ్చేరు, విదేశవాసం . రోజులు గడిచిపోతునాయి.  చిన్నప్పట్నించీ ఉన్న కవిత్వం సరదా ఒక్కసారిగా ఎక్కువయింది. ఏవేవో పద్యాలు రాస్తునాను. కానీ ఈ దేశంలో నా పద్యాలు ఎవరికి వినిపించను. ఎవరికీ వినిపించకపోతే మనసు ఉండబట్టదు.సరే ఎవర్నో పట్టుకుని నా పద్యం వినండీ అని బతిమాలుకోవడం ఎందుకూ, ఇంటావిడ ఉందికదా ఆవిడకే వినిపించేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలండోయ్ మా గుండుగాడికి క్రికెట్ తెలియనట్లే మా ఇంటావిడకి తెలుగు తెలియదు. మాట్లాదుతుంది కానీ వ్రాయడం చదవడం రావు. నార్త్ లో చదువుకుందిలెండి, మా మామగారు మిలట్రీ మనిషి.  కనుక ముందు ఆవిడకి పద్యమంటే ఏమిటో చెప్పి తరువాత పద్యం చెప్పాలి.  సరే కానిద్దాం అనుకుని ఉపోద్గాతంగా, ఏమోయ్ ఉత్పలమాల ఎంత సొగసుగా ఉంటుందనుకున్నావ్ అన్నాను  అంతే ఆవిడ తాడిప్రమాణాన లేచింది నామీద ఇద్దరాడపిల్లల తండ్రివైకూడా ఇంకా పరస్త్రీల సొగసులు చూస్తునావా ఆయ్ అని. ఉత్పలమాలంటే ఆవిడెవరో కాంచనమాల, రత్నమాలా లాంటి స్త్రీ అనుకుంది కాబోలు. అబ్బే అది కాదు అని సర్ది చెప్పేటప్పటికి తలప్రాణం తోకకొచ్చిందంటే నమ్మండీ

మామకు మామ ఐనవాడు .

Image
మామకు మామ ఐనవాడు ...(కంది శంకరయ్య) ఉ. మామను సంహరించి, యొక మామను గర్వ మడంచి, య న్నిశా మామను రాజుఁ జేసి, యొక మామ తనూజున కాత్మబంధువై, మామకుఁ గన్ను లిచ్చి, సుతు మన్మథు నింతికిఁ దానె మామయై, మామకు మామయైన పరమాత్ముఁడు మీకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్. (చాటుపద్య రత్నాకరము)  భావం - మామ అయిన కంసుని సంహరించి, వారధి కట్టడానికి ముందు తన మామ అయిన సముద్రుని గర్వాన్ని అణచి, నిశామామ అయిన చంద్రునికి `రాజు` అనే పేరునిచ్చి, మామ కొడుకైన అర్జునునకు ఆప్తుడై, మామ అయినధృతరాష్ట్రునికి కన్నులిచ్చి, కొడుకైన మన్మథుని భార్య రతీదేవికి తానే మామ అయి, తనకు లక్ష్మి నిచ్చిన మామ సముద్రునికి తన కూతురైన గంగనిచ్చి అతనికి మామ అయిన విష్ణుదేవుడు మీకు ప్రసన్నుడౌతాడు. ....