కుమతీ శతకం

పేరడీ.. ( కుమతీ శతకం )

అధరము తడిసీ తడయక

మధురమ్ముగ కాఫి జుర్రి మరి సిగరెట్టున్

ప్రధమము నె ముట్టించెడు

విధమే పో లైఫు లోని విజ్ఞత కుమతీ

లంచము పంచక తినకుము

కొంచెo చేనైన చేత గొనకుము సుమ్మీ

లంచంబు పట్టు వారికి

కించిత్తుగ రాల్చ కున్న కీడగు కుమతీ

అడిగిన ప్రశ్నలు చెప్పని 

మిది మేలపు టీచరులతోమెలగుట కంటెన్

పడిగొని ట్యూషను వెట్టుక

బడి ప్యాసవ వచ్చు గాదె వసుధను కుమతీ

అక్కరకు రాని బస్సును

చక్కగ సినిమాకు రాక సణ గెడు భార్యన్

ఉక్కగ నుండెడు ఇంటిని

గ్రక్కున విడువంగ వలయు గదరా కుమతీ

ఇతిశ్రీ..( పుల్లెల రామ చంద్రుడు)

సూచన ;;- పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం)

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!