విజయవాడ సత్యనారాయణ పురం.
మేము విజయవాడ సత్యనారాయణ పురం లో ఉండేవాళ్ళము. అక్కడ ఓ చిన్న రైల్వే స్టేషన్ ఉండేది, ప్యాసింజర్ ట్రెయిన్లు తక్కా మిగతావేవి ఆగేవి కాదు. సర్కార్ ఎక్స్ప్రెస్ మటుకూ స్టెషన్ దగ్గరకు రాగానే డ్రైవర్ స్లో చేసేవాడు, చాలా మంది దిగిపోయేవారు. అల్లా దిగే వారిలో ఎక్కువమంది రైల్వేలో పని చేసేవాళ్ళు ఉండేవారు. సత్యనారాయణ పురం స్టేషన్లో దిగకపోతే, మెయిన్ రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి, మళ్ళీ బస్సో, ఆటోనో పట్టుకు రావాలి. అందుకే చాలా మంది కూసింత రిస్కైనా దిగిపోయేవారు.
మా సందులో ఉన్న సత్యనారయణ గారు కూడా అల్లానే దిగేవారు. నేననుకోవటం చాలా ఏళ్ళ నుంచి దిగివారనుకుంటా.
రైల్వే పోలీసతను వేరే వాళ్ళతో చెబుతున్నాడు 'చాలా ఏళ్ళ నుంచీ దిగుతున్నారు ఈయన, ఈ రోజు దిగుతుండగా పట్టుకున్న డోర్ హ్యాండిల్ జారి ఒక కాలు స్టెషంకి, ట్రెయిన్ కి మధ్య ఇరుక్కుపోయింది. అల్లా ఈడ్చుకుంటూ పోయింది. గార్డ్ చూసి ఎర్రజెండా ఊపి ట్రెయిన్ ఆగేలోపలే లోపలకి లాగేసింది. ' అని.
ఒక్కసారి నా ఒళ్ళు జలదరించింది. ఊహించుకోవటానికే భయమేసింది. ఈ లోపల ఆంబులెన్సులో శవం వచ్చింది. మొత్తం కట్లు కట్టి ఉంది. ఆయన భార్యా, కొడుకుని ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. నేనది చూడలేక ఇంటి ముఖం పట్టాను.
ఆరు నెలల తర్వాత తెలిసింది, ఈ దుర్ఘటన మూలంగా రైల్వే ఎంక్వైరీ పడి, సర్కార్ ఎక్స్ప్రెస్ ని ఓ నిమిషం పాటు సత్యనారాయణ పురం స్టేషన్లో ఆపేలా చేసారని.
అంత మంది రోజూ స్లో చేసిన ట్రెయిన్ నుంచి దూకుతున్నా పట్టించుకోని అధికారులు, సర్కార్ ఎక్స్ప్రెస్ ని ఈ చిన్న స్టేషన్లో ఓ నిమిషం పాటు ఆపటానికి ఒక ప్రాణం బలి అవ్వాల్సి వచ్చింది

Comments
Post a Comment