రవీంద్రుడు-రచన: కొడవంటి

రవీంద్రుడు-రచన: కొడవంటి 04052014

1. వంగ బంధువతడు కవి గాయకుండు 

చిత్రలేఖనుడు చిన్మయ మూర్తి 

మానవత్వమ్మే మతముగా గల వాడు 

హితభాషి మితభాషి శ్రేయోభిలాషి 

2.గీతాంజలి రచన తలమానికమ్మాయే శ్రమజీవి కర్షకుల దైవముగనెంచె

రచనలన్నిటిలోన మానవత విలువలే ప్రపంచమునందు ప్రతిబింబితములయ్యె 

ఆణిముత్యమ్ములు ఆతని రచనలు చిన్ని తనముననుండి చతురతయె కనబరిచె

జాతీయ గీతమ్ము జనగణమన ఆతని కలమందు ఆవిర్భవించె 

విశ్వకవియై నిలచి విశ్వఖ్యాతిని గాంచె గాంధియే ఆతనిని గురుదేవులనియె

3. అంతరాత్మయె అతని ప్రోబోధమ్మాయె ఆంగ్లేయులిచ్చిన నైట్ హుడ్ గౌరవము 

తిరస్కారముజేసితేజస్వియైనాడు మారణ కాండకు చలియించినాడు(జలియన్వాలా)

కలమునే కత్తిగా కడు రమ్యముగ మలచి రణమునే సలిపేను వీర సైనికుడై 

ఒంటరిగ పోరాడి వినుతికెక్కినాడు రవీంద్రుడై నిలచె రణరంగమందు

4. శాంతి నికేతన్ స్థాపననుజేసి విద్యార్ధులెందరినొ వున్నతులజేసె 

గ్రామాభ్యుదయమ్మే దేశాభ్యుదయమని శ్రీనికేతనమ్మునే నెలకొల్పినాడు 

చిత్రకళలనుగూడ చిత్రముగ నేర్చే రచయితేగాక గాయకుడు గూడ 

నాటకములెన్నిటినొ రచియించినాడు ఖ్యాతినే గడియించి విఖ్యాతి పొందె

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!