ఒక స్టుడెంటు కష్టం...

ఒక స్టుడెంటు కష్టం...

గాఢ నిద్రలో ఉన్న నేను, అమ్మా నాన్నలు ఏదో పెద్దగా మాట్లాడుతుంటే మెళుకువ వచ్చి, 'అబ్బా, సరిగ్గా నిద్రపోనియ్యరు కదా?' అని మనసులో అనుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారిపోయాను.

'ఒరేయ్ సుందరం లేవరా, నీ 10వ తరగతి మార్కులు వచ్చాయట్రా, నీకు 530నే వచ్చాయని నాన్న చిందులు తొక్కుతున్నారు ' అంటూ అమ్మ నన్ను లేపింది.

అమ్మ వెనుక నాన్న నుంచుని ఉన్నారని చూసుకోకుండా, 'ఇంకెంత రావాలిటా?' కళ్ళు నులుముకుంటూ చిరాగ్గా అన్నాను.

'ఒరేయ్ అంట్ల వెధవ, ఇంకో 2 మార్కులు వచ్చుంటే కనీసం స్టేట్ 10వ ర్యాంకైనా వచ్చేది, మా అబ్బాయి స్టేట్ ర్యాంకులలో ఉన్నాడని గొప్పగా చెప్పుకునేవాడ్ని ' అని తిట్లపురాణం మొదలెట్టారు మా నాన్న.

'ఈయనెప్పుడూ ఇంతే, ఎన్ని మార్కులొచ్చినా సంతోషపడరు. అందరి నాన్నలూ ఇంతేనేమో?' అని మనసులో అనుకుంటూ నాన్న తిట్లు పట్టించుకోకుండా లేచి బాత్ రూమ్ లో దూరాను.

బ్రష్ చేసుకుని ముందు గదిలోకి వచ్చాను. ఇంకా నాన్న సణుగుతూనే ఉన్నారు. 

తట్టుకోలేక 'రెండు మార్కులే కద నాన్నా, విజయవాడలో నేనే ఫస్ట్ అయ్యుంటాను?' అన్నాను. 

మా నాన్న వినిపించుకునే స్తితిలో లేరు. 'రెండు మార్కులలో స్టేట్ ర్యాంక్ మిస్సయ్యావు, చదవరా అంటే ఎప్పుడు చూడు సినిమాలు, షికార్లు ఫ్రెండ్స్ తో. అయినా నాకు తెలీక అడుగుతా, నువ్విల్లా బడుద్ధాయిలా తిరిగితే చిరంజీవి వచ్చి రాస్తాడా నీ పరీక్షలు?' అని మళ్ళీ మొదలు.

మారు మాట్లాడకుండా అమ్మ తెచ్చిన కాఫీ తీసుకుని బయట వరండాలో కూర్చున్నా

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!